newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఇంటి నుంచి పని చేయడం.. ఐటీకి, మీడియాకు కూడా ఇబ్బందులే!

26-03-202026-03-2020 14:43:29 IST
Updated On 26-03-2020 17:20:36 ISTUpdated On 26-03-20202020-03-26T09:13:29.380Z26-03-2020 2020-03-26T09:13:26.453Z - 2020-03-26T11:50:36.586Z - 26-03-2020

ఇంటి నుంచి పని చేయడం.. ఐటీకి, మీడియాకు కూడా ఇబ్బందులే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కోవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అత్యవసర సేవలతో పాటు, ఐటీ రంగానికి మినహాయింపునిచ్చింది. ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు (వర్క్‌ ఫ్రం హోం)ను కల్పించాలని, పరిస్థితిని బట్టి కార్యకలాపాలు నిలిపేయాలని ఐటీ కంపెనీలకు సూచించింది. హైదరాబాద్‌ కేంద్రంగా 1,283 ఐటీ కంపెనీల్లో సుమారు ఐదున్నర లక్షల మంది పనిచేస్తుండగా, ప్రభుత్వ సూచన మేరకు 70 శాతానికి పైగా ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్నారు. 

ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించగా, హైదరాబాద్‌లో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించింది. మరోవైపు ప్రైవేటు వాహనాల రాకపోకలను కూడా పోలీసులు నియంత్రిస్తున్నారు. గతంలో క్యాబ్‌ల ద్వారా రవాణా సదుపాయాన్ని కల్పించిన ఐటీ సంస్థలు అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు సొంత వాహనాల్లో విధులకు రావాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నాయి. సొంత ఖర్చుతో విధులకు హాజరయ్యేవారికి ట్రావెల్‌ అలవెన్స్‌ వేతనంతో కలిపి ఇస్తామని చెబుతోంది. 

ఓ వైపు ప్రజా రవాణా లేక మరోవైపు వ్యయ ప్రయాసలతో విధులకు వెళ్తున్న ఐటీ ఉద్యోగులు అడుగడుగునా పోలీసుల ఆంక్షలు, తనిఖీలతో ఇబ్బందులు పడుతున్నారు. తాము పనిచేస్తున్న ఐటీ కంపెనీల గుర్తింపు కార్డులు చూపుతున్నా విధులకు అనుమతించడం లేదని టెకీలు చెప్తున్నా రు. సోమవారం రాత్రి విధులకు వెళ్తున్న ఇద్దరు ఐటీ ఉద్యోగులపై సైబరాబాద్‌ పోలీసులు లాఠీలు ఝళిపించారు. తమ కంపెనీ అమెరికాలోని ఓ బ్యాంకుకు ఐటీ సేవలు అందిస్తోందని చెప్పినా వినకుండా చితకబాదారని టెకీలు సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. 

అమెజాన్, గూగుల్‌ వంటి పెద్ద కంపెనీల పేర్లు తప్ప చిన్నా, చితక ఐటీ కంపెనీల్లో పనిచేస్తూ విధులకు వెళ్తున్న ఐటీ ఉద్యోగులు మరింత సమస్య ఎదుర్కొంటున్నారని తెలంగాణ ఐటీ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (టీటా) ప్రతినిధులు వెల్లడించారు. వీరికి ప్రత్యేక పాస్‌లు జారీ చేయాలని టీటా అధ్యక్షుడు సందీప్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు.

 గతంలో అరుదుగా ఇంటి నుంచే ఆఫీసు పని (వర్క్‌ ఫ్రం హోం)కు అనుమతించిన ఐటీ కంపెనీలు కరోనా ప్రభావంతో మెజారిటీ ఉద్యోగులకు అవకాశం కల్పించింది. అయితే వర్క్‌ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటుండటంతో పని సామర్థ్యం తగ్గి ఉత్పాదకతపై ప్రభావం చూపుతుందని ఐటీ కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. 

డేటా కనెక్టివి టీ సమస్యలు ఎదురవుతుండటంతో తరచూ అంతరాయం కలుగుతోందని టెకీలు చెప్తున్నారు. దీంతో ఉద్యోగులు సాంకేతిక సమస్యలతో పూర్తి స్థాయిలో పనిచేయలేక పోతుండటంతో కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి.  

ఒక్క ఐటీ ఉద్యోగులనే కాదు.. లాక్ డౌన్ కాలంలో కూడా మీడియా నూటికి నూరు శాతం పని చేస్తుందని, వారిని ఇబ్బంది పెట్టవద్దని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించినప్పటికీ రాత్రింబవళ్లు వార్తల సేకరణ, కూర్పులో ఉండే మీడియా సిబ్బందికి ఇప్పటికీ తిప్పలు తప్పడం లేదు. సోమవారం మీడియా వ్యక్తులను గుర్తించలేక హైదరాబాద్ పోలీసులు చితకబాదిన నేపత్యంలో యాజమాన్యాలు కూడా మీ మీ ఐడీ కార్డులను ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా చేతితో పట్టుకునే వెళ్లాలని పోలీసలు అడగక ముందే తమది ఫలానా మీడియా అని ఐటీ చూపించి మరీ చెప్పి పోలీసుల బారి నుంచి తప్పించుకోవాలని తమతమ సిబ్బందికి సూచనలు పంపుతున్నాయి. 

అయితే లాక్ డౌన్ నేపథ్యంలో సమయాన్ని కచ్చితంగా పాటించనవసరం లేదని కాస్త లేటుగా వచ్చి పని పూర్తి చేసుకుని త్వరగా వెళ్లిపోయినా పర్వాలేదని తెలుగు మీడియా యాజమాన్యాలు వెసులుబాటు కల్పించడంతో డెస్కు జర్నలిస్టులు, రిపోర్టర్లు కూడా రాత్రి తొమ్మిది, పది గంటలలోపే పని పూర్తి చేసుకుని ఆఫీసుల నుంచి చెక్కేస్తున్నారు. 

ఈ వెసులు బాటు ఎన్నాళ్లు ఉంటుందో తెలీదు మరి.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle