newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఇంటి అద్దెవసూలు నిలిపివేతపై ప్రభుత్వ ఉత్తర్వులు.. వేధిస్తే ఓనర్లకు శిక్షలు తప్పవు

24-04-202024-04-2020 12:11:16 IST
Updated On 24-04-2020 12:14:02 ISTUpdated On 24-04-20202020-04-24T06:41:16.011Z24-04-2020 2020-04-24T06:41:14.134Z - 2020-04-24T06:44:02.525Z - 24-04-2020

ఇంటి అద్దెవసూలు నిలిపివేతపై ప్రభుత్వ ఉత్తర్వులు.. వేధిస్తే ఓనర్లకు శిక్షలు తప్పవు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశం మొత్తం మీద లాక్ డౌన్ కాలంలో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఇళ్ల అద్దెలు వసూలు చేయరాదని ఇళ్ల యజమానులను ఆదేశించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు కెక్కింది. పదిరోజులక్రితమే ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయగా గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ దీనికి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. 

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఇళ్లలో అద్దెకుంటున్న వారి నుంచి యజమానులు కిరాయి వసూలు చేయరాదని ప్రభుత్వం ఆదేశించింది. మార్చి నుంచి 3 నెలల పాటు అద్దె అడగొద్దంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 

కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఎక్కడివారు అక్కడే ఉండేలా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నామని తెలిపింది. దీంతో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారికి వేతనాల చెల్లింపు సమస్యగా మారిందని వివరించింది. చాలా మంది అద్దె ఇళ్లలోనే నివసిస్తున్నారని, వారి నెలవారీ సంపాదనలో 40 శాతం ఇళ్ల అద్దెలకే పోతుందని పేర్కొన్నది. 

ప్రస్తుత కష్టకాలంలో వీరి నుంచి అద్దెలు వసూలు చేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆందోళన వ్యక్తం చేసింది. అద్దెలు చెల్లించలేదన్న కారణంతో ఎవరినీ బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించరాదని తెలిపింది. ఇల్లు ఖాళీ చేయిస్తే వారు సరిహద్దులు దాటడం లేదా మరో ఊరికి వెళ్తారని, కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వివరించింది. 3 నెలల తర్వాత అద్దె బకాయిలను వాయిదాల పద్ధతిలో వసూలు చేసుకోవాలని సూచించింది. 

బలవంతంగా అద్దెలు వసూలు చేసినట్లు, ఇల్లు ఖాళీ చేయించినట్లు ఫిర్యాదులొస్తే ఎపిడమిక్‌ డిసీజెస్‌ యాక్టు-1897, డిజాస్టర్‌ మేనేజ్‌ మెంట్‌ యాక్టు-2005 ప్రకారం శిక్షలు విధిస్తామని హెచ్చరించింది. జిల్లాల్లో డిస్ట్రిక్ట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీలు, హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. 

కరోనా కట్టడిలో భాగంగా ముందు చూపుతో వ్యవహరించి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇళ్ల యజమానులు ఏమేరకు పాటిస్తారో చూడాలి. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మేము అద్దె చెల్లించమని కిరాయికి ఉంటున్నావారు, కాదు.. ససేమిరా కట్టాల్సిందేనని ఇళ్ల యజమానులూ మొండికేస్తే చట్టరీత్యా ప్రభుత్వం గృహయజమానులపై చర్య తీసుకోవచ్చు కానీ లాక్ డౌన్ తర్వాత ఇళ్ల యజమానులు, కిరాయికి ఉంటున్న వారికి మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని, అప్పుడు ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించగలదా అనే సందేహాలు కూడా పుట్టుకొస్తున్నాయి. 

ఏది ఏమైనా జాతి మొత్తంగా విపత్తులో కూరుకుపోయిన సందర్బంగా ఇంటి యజమానులు కాస్త ఔదార్యం పాటిస్తే ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లే.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle