ఇంటి అద్దెలు చెల్లించవద్దు.. వేధిస్తే 100కి ఫోన్ చేయండి.. కేసీఆర్ ఆదేశం
20-04-202020-04-2020 15:24:36 IST
Updated On 20-04-2020 15:31:29 ISTUpdated On 20-04-20202020-04-20T09:54:36.405Z20-04-2020 2020-04-20T09:54:34.344Z - 2020-04-20T10:01:29.904Z - 20-04-2020

మార్చి, ఏప్రిల్, మే నెలల అద్దెను ఇంటి యజమానులు వసూలు చేయరాదని తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం ప్రకటించారు. లక్షలాది మంది వేతనజీవులు, కూలీలు, వలస ప్రజలకు మేలు చేస్తున్న నిర్ణయాన్నీ కేసీఆర్ ప్రకటించారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో చాలా మంది ఇంటి రెంట్ కట్టలేని పరిస్థితి నెలకొంది. ఉపాధి కోల్పోయి జీవనం సాగించడం కష్టంగా మారడంతో వారి పరిస్థితులను సీఎం కేసీఆర్ అర్ధం చేసుకున్నారు. ఆదివారం మంత్రివర్గం సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంటి యజమానులు.. కిరాయిదారుల నుంచి మార్చి, ఏప్రిల్, మే నెలల అద్దె వసూలు చేయొద్దని ఆదేశించారు. తర్వాత నెలల్లో వాయిదాల వారీగా వసూలు చేసుకోవాలని సూచించారు. ఇది అప్పీల్ కాదని.. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారమని చెప్పారు. ఎవరైనా ఇబ్బంది పెడితే 100కి ఫోన్ చేసి చెప్పాలని తెలిపారు. సతాయిస్తే ఇంటి యజమానులపై కఠిన చర్యలుంటాయన్నారు. కిరాయి వాయిదా వేశామంటూ వడ్డీ వసూలు చేయాలని చూస్తే ఊరుకోమని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశమంతా లాక్ డౌన్ అయి ప్రజలంతా ఇళ్లలోనే ఉండిపోవలసి వస్తున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా అద్దె ఇళ్ల యజమానుల ఆగడాలు మితిమీరుతున్నాయి. మూడునెలల దాకా పని ఉండదని, ఉద్యోగాలు చేసే పరిస్థితి లేదని, వేతనాలపై సంగంపైనే కోత విధిస్తున్నారని, చాలా పరిశ్రమల్లో వేతనాలు 30 శాతం కూడా ఇవ్వడం లేదని వార్తలు వస్తున్నప్పటికీ మార్చినెల ఇంటి అద్దె బకాయలను ఏప్రిల్ తొలివారంలో కట్టి తీరాల్సిందేనని హైదరాబాద్లో, రాష్ట్రవ్యాప్తంగా కూడా కిరాయి ఇళ్ల యజమానులు వేధించడం నిత్యం వార్తల్లో వస్తోంది. హైదరాబాద్లో కొన్ని చోట్ల సాప్ట్ వేర్ ఉద్యోగినులు జీతాలు రాక మార్చి నెల వేతనాలు చెల్లించలేమని చెబితే వెంటనే ఖాళీ చేసేయాలని ఇంటి యజమాని ఒత్తిడి చేస్తే వారు రోడ్డుమీద పడ్డారు. నగరంలో ఒక ప్రాతంలో వలస కూలీలు తిండికి కూడా లేని స్థితిలో అద్దె చెల్లించలేమని చెబితే దాదాపు వందమందిని ఇళ్లలోంచి వెళ్లగొడితే వారు రోడ్డెక్కి ధర్నాలు చేయగా అధికారులు వారికి బాసటగా నిలిచి ఆ ఇళ్ల యజమానిని తీవ్రంగా హెచ్చరించి వలస కూలీల సమస్యను పరిష్కరించారు. ఇలాంటి వార్తలు నిత్యం వస్తున్న నేపథ్యంలో ఇంటి యజమానుల ఆగడాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆదివారం జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా ఇంటి అద్దెల సమస్యను ప్రస్తావించి రాష్ట్రమంతటా ఎవరినీ ఇంటి అద్దెల విషయమై వేధించవద్దని ప్రకటన చేశారు. కేసీఆర్ ఇంటి అద్దెల విషయమై విధాన ప్రకటన చేయగానే తెలంగాణ వ్యాప్తంగా కిరాయికి ఉంటున్న జనం ఊపిరి పీల్చుకున్నారు. కిరాయి వసూలు చేయవద్దని ఇంటి యజమానులను అభ్యర్థించడం లేదని ఆజ్ఞాపిస్తున్నామని కేసీఆర్ స్పష్టంగా ప్రకటించడంతో ఇళ్ల యజమానుల గుండెల్లో రైళ్లు పరుగెడుతుండగా, సీఎం నిర్ణయం పట్ల కిరాయికి ఉంటున్న లక్షలాది మంది ఊపిరి పీల్చుకున్నారు.

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
2 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
4 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
5 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
6 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
7 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
8 hours ago

వన్ ప్లస్ వన్ ఆఫర్
6 hours ago

నా రూటే సెపరేటు
9 hours ago

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
a day ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
a day ago
ఇంకా