newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఇంటినుంచి పనే భేషుగ్గా ఉంది... హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు

24-09-202024-09-2020 11:09:50 IST
2020-09-24T05:39:50.181Z24-09-2020 2020-09-24T05:39:47.672Z - - 17-04-2021

ఇంటినుంచి పనే భేషుగ్గా ఉంది... హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా నేపధ్యంలో బస్సు, రైలు ప్రయాణాలంటేనే హడలి చస్తున్న హైదరాబాద్ లోని ఐటీ ఉద్యోగులు ఇంటినుంచి పని చేయడానికే తాము ప్రాధాన్యత ఇస్తామని తెగేసి చెబుతున్నారు. దేశంలోని ఇతర నగరాల మాటేమో గానీ, హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు మాత్రం వర్క్ ఫ్రం హోంకే జైకొడుతున్నారు. కోవిడ్‌–19 కేసులు నగరంలో అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఇంటి నుంచి పని చేయడమే మేలని భాగ్యనగరంలో ఐటీ, ఐటీఈఎస్‌ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు భావిస్తున్నారు. 

ఈ విషయం హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) అధ్యయనంలో తేలింది. దాదాపు ‘95% కంపెనీలు వర్క్‌ ఫ్రం హోం విధానంలోనే కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. 90–100% ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు.  రెండు నెలలుగా ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య పెరిగిందని ఈ సర్వే తెలిపింది.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నయ్, బెంగళూరు, హైదరాబాద్, పుణే, అహ్మదాబాద్ నగరాల్లో అసోచాం జరిపిన తాజా అధ్యయనం ఈ వాస్తవాన్ని బయటపెట్టింది. కరోనా వైరస్ పూర్తిగా నిర్మూలమైపోయినా సరే తాము ఇంటినుంచి పనిచేయడానికే ప్రాధాన్యత ఇస్తామని వివిధ నగరాల్లోని ఐటీ ఉద్యోగులు భావిస్తున్నారని ఈ సర్వే స్పష్టం చేసింది. దీంతో కంపెనీలు కూడా తమ భవిష్యత్తు పథకాలను కసరత్తు చేస్తున్నాయి. 

ఈ విధానంలో ఉద్యోగుల ఉత్పాదకత 75% ఉన్నట్టు 80% కంపెనీలు తెలిపాయి. పెద్ద కంపెనీల్లో అయితే ఇది 90 శాతంగా ఉంది. బ్రాడ్‌బ్యాండ్, విద్యుత్‌ కోతలు, ఇంట్లో నెలకొన్న వాతావరణం ఉద్యోగులకు అడ్డంకిగా మారాయి. ఉద్యోగుల్లో ధైర్యం తగ్గిందని 34% మంది తెలిపారు. కాగా సుమారు 70% పెద్ద కంపెనీలు గత 6 నెలల్లో ఫ్రెషర్లను నియమించాయి. కొన్ని కంపెనీలు 1,000 మంది వరకు రిక్రూట్‌ చేసుకున్నాయి. ఆఫర్‌ లెటర్లు అందుకున్న ఫ్రెషర్లను నియమిస్తామని చాలా కంపెనీలు తెలిపాయి’ అని పేర్కొంది.

ఐటీ ఉద్యోగులు మొత్తంగా ఇంటినుంచి పనికే ప్రాధాన్యం ఇవ్వడానికి ప్రధాన కారణం ప్రజారవాణా వ్యవస్థపై నమ్మకం లోపించడమే. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు ప్రభుత్వ బస్సులు, మెట్రో రైళ్లును నడుపుతున్నప్పటికీ వాటిని ఉపయోగించడానికి మాత్రం ప్రజలు సిద్ధపడకపోగా ప్రభుత్వ రవాణా సేవలంటేనే భయపడిపోతున్నారు.

అందుకే సర్వేలో పాల్గొన్నవారిలో 73 శాతం తమ సొంత వాహనాన్నే ఉపయోగిస్తామని చెప్పగా 21 శాతంమంది ప్రజారవాణా కోసం చూస్తున్నారు. పైగా టెక్నాలజీ అనేది వర్క్ ఫ్రం హోమ్ అనే భావన పట్ల ఐటీ ఉద్యోగులను ఆకర్షితులను చేస్తోందని అసోచాం ప్రధాన కార్యదర్శి దీపక్ సూద్ పేర్కొన్నారు.

 

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   6 minutes ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   an hour ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   an hour ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   4 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   3 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   6 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   19 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   a day ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   21 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   16-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle