newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఇంటర్ ఫలితాలకు రంగం సిద్ధం... ఎలా చెక్ చేసుకోవచ్చంటే?

18-06-202018-06-2020 09:07:59 IST
Updated On 18-06-2020 11:14:48 ISTUpdated On 18-06-20202020-06-18T03:37:59.286Z18-06-2020 2020-06-18T03:37:20.240Z - 2020-06-18T05:44:48.006Z - 18-06-2020

ఇంటర్ ఫలితాలకు రంగం సిద్ధం... ఎలా చెక్ చేసుకోవచ్చంటే?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నేడు తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి.  మధ్యాహ్నం 3 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నారు మంత్రి సబిత.  ఒకేసారి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలవుతాయి. గురువారం సాయంత్రంలోగా ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు ముందే ప్రకటించారు. ఫలితాలను విడుదల చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. 

కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనాన్ని ఎప్పుడో పూర్తి చేసింది. అయితే ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. గతంలో కంటే వేగంగా ఈసారి వ్యాల్యుయేషన్ జరిగిందని అధికారులు తెలిపారు. 

ఈ ఫలితాలను తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ https://tsbie.cgg.gov.in/ తో పాటు ఇతర వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు. అలాగే తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక యాప్‌లో కూడా తెలుసుకోవచ్చు. ఇందుకోసం విద్యార్థులు ముందుగా గూగుల్ ప్లేస్టోర్‌లో TSBIE m-Services యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ సైజ్ 4 ఎంబీ లోపే ఉంటుంది. ఇంటర్‌ఫేజ్‌ కూడా సులభంగా ఉంటుంది. ఫలితాలు విడుదలైన వెంటనే ఈ యాప్‌లో చెక్‌ చేసుకోవచ్చు. ఎలాంటి సాంకేతిక ఇబ్బందులకు తావులేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

TSBIE m-Services యాప్ ఓపెన్ చేసిన వెంటనే Results ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత విద్యా సంవత్సరాన్ని సెలక్ట్‌ చేసుకుని హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అనంతరం Search బటన్‌ క్లిక్‌ చేస్తే ఫలితాలు కనిపిస్తాయి. విద్యార్థుల కోసం తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ఇది. ఇందులో ఫలితాలు మాత్రమే కాకుండా, పరీక్షల సమయంలో ఎగ్జామ్ సెంటర్లను కూడా లొకేట్ చేయవచ్చు. ఈ యాప్ లక్షలాదిమందికి అందుబాటులో వుంది. 

నా రూటే సెప‌రేటు

నా రూటే సెప‌రేటు

   an hour ago


బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   14 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   15 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   15 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   19 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   20 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   18 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   21 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   21 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle