newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు కాసేపట్లో...

31-07-202031-07-2020 11:31:02 IST
Updated On 31-07-2020 11:30:55 ISTUpdated On 31-07-20202020-07-31T06:01:02.651Z31-07-2020 2020-07-31T06:00:25.295Z - 2020-07-31T06:00:55.681Z - 31-07-2020

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు కాసేపట్లో...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా కారణంగా విద్యాసంవత్సరంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పదవ తరగతి పరీక్షలు రద్దయ్యాయి. పరీక్ష ఫీజు చెల్లించిన వారంతా పాసయ్యారు. అసలు పుస్తకం తీయని వారు, హాయిగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ స్కూలుకి డుమ్మా కొట్టినవారు కూడా పాసై పోయారు. తాజాగా ఇంటర్మీడియెట్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలకు రంగం సిద్ధమయింది. ఈ ఫలితాల వెల్లడికి ప్రాసెస్‌ పూర్తయింది. 

మొత్తం 1,50,941 మంది పాస్‌ అయ్యారు అందరికీ 35 శాతం కనీస మార్కులు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి వెబ్‌సైట్‌లో ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.కోవిడ్‌-19 కారణంగా ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. అయితే ఈ విద్యార్థులందరికీ కనీస గ్రేస్‌ మార్కులు ఇచ్చి కంపార్ట్‌మెంటల్‌లో పాస్‌ చేసింది.

విద్యార్థులందరినీ పాస్‌ చేస్తామని సీఎం కేసీఆర్‌ గతంలో హామీ ఇచ్చారు. ఆయన తీసుకున్న నిర్ణయం మేరకు ఫలితాల ప్రాసెస్‌ను పూర్తి చేసినట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ తెలిపారు. ఈ నిర్ణయంతో1,50,941 మంది విద్యార్థులను కంపార్ట్‌మెంటల్‌లో పాస్‌ చేశారు. ఇందులో సెకండియర్‌ జనరల్, వొకేషనల్‌ విద్యార్థులు కూడా ఉన్నారు.

ప్రస్తుతం సెకండియర్‌ పూర్తయిన విద్యార్థులకు సంబంధించిన ఏమైనా ఫస్టియర్‌ బ్యాక్‌లాగ్స్‌ మిగిలి ఉన్నా ఆయా సబ్జెక్టుల్లోనూ సదరు విద్యార్థులను పాస్‌ చేసినట్లు పేర్కొన్నారు. అంటే గతంలో ఫెయిలైన సబ్జెక్టులు ఉంటే వారు కూడా పాసయినట్టే. విద్యార్ధినీ, విద్యార్ధులకు ప్రతి సబ్జెక్టులో 35 శాతం కనీస పాస్‌ మార్కులను ఇచ్చారు.

వారంతా తమ మార్కుల వివరాలతోపాటు సవరించిన మార్కుల మెమోలను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి బోర్డు వెబ్‌సైట్‌ నుంచి http://tsbie.cgg.gov.in డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు.ఏమైనా సందేహాలుంటే అధికారులను సంప్రదించవచ్చు. ష్రభుత్వ నిర్ణయంతో వేలాదిమంది విద్యార్ధులు ఇంటర్ పూర్తిచేసుకున్నారు. 

 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   2 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   4 hours ago


ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

   25 minutes ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   3 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   5 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   6 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   6 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle