newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆ 4 జిల్లాలే కొంప ముంచుతున్నాయ్.. తెలంగాణలో కట్టడి కఠినం

18-04-202018-04-2020 19:02:38 IST
Updated On 18-04-2020 19:16:47 ISTUpdated On 18-04-20202020-04-18T13:32:38.289Z18-04-2020 2020-04-18T12:08:38.161Z - 2020-04-18T13:46:47.682Z - 18-04-2020

ఆ 4 జిల్లాలే కొంప ముంచుతున్నాయ్.. తెలంగాణలో కట్టడి కఠినం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తిచెందుతుండడంతో కట్టడిప్రాంతాల్లో ప్రత్యేక దృష్టిసారిస్తూనే మరోవైపు లాక్‌డౌన్‌, కర్ఫ్యూ అమలుపై కఠినంగానే వ్యవహరిస్తున్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు, మందులు కొనుగోలు కోసం, బ్యాంకుల వద్ద డబ్బుల కోసం వచ్చే వారు విధిగా భౌతిక దూరం పాటించేలా వాలంటీర్లు, పోలీసులు చర్యలు చేపడుతున్నారు. రాత్రి 7 గంటల నుంచి కర్ఫ్యూను మరింత పక్బందీగా అమలు చేసేందుకు పోలీసు కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి పలు ప్రాంతాల్లో పర్యటించడంతో పోలీసులు మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

కట్టడిప్రాంతాలలో ప్రజలు విధిగా ప్రభుత్వ నిబంధనలు పాటించేలా చూడాలని, ఎవరైనా అతిక్రమిస్తే వారిపై కేసులు నమోదు చేయాలని రాష్ట్ర మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ జిల్లా అధికారులకు వీడియో కాన్ఫరెన్సులో ఆదేశించడంతో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పేదలను ఆదుకోవాలనే వారు విధిగా మున్సిపల్‌ కమిషనర్‌ నుంచి అనుమతి తీసుకోవాలని ఆదేశించడంతో దాతలు అనుమతి తీసుకొని వారికి సూచించిన ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నారు. మొత్తంగా కరోనా కట్టడికి ప్రజలు కూడా సహకరిస్తున్నారు. 

ఇదంతా బాగానే ఉంది కానీ రాష్ట్రం మొత్తం మీద నాలుగు జిల్లాల్లోనే కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. ముఖ్యంగా హైదరాబాద్, నిజామాబాద్, సూర్యాపేట, వికారాబాద్‌లలో పెరుగుతున్న కేసులపై అధికారులు ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్నారు. కరీంనగర్, వరంగల్‌ అర్బన్, ఇతర జిల్లాల్లో వైరస్‌ని జిల్లా అధికారులు కట్టడి చేసినప్పటికీ సూర్యాపేటలో ఒక్క వ్యక్తి ద్వారా 38 మందికి వైరస్‌.. చార్మినార్‌ ప్రాంతంలోనే 143 మందికి కరోనా సోకడం అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. 

మిగిలిన జిల్లాల్లోనూ కరోనా కేసులు నమోదైనా, కాస్త నియంత్రణలోనే ఉంది. కానీ ఈ నాలుగు జిల్లాల్లో మాత్రం పరిస్థితి బాగోలేదు. ఆయా జిల్లాల్లో అధికంగా కేసులుండటానికి గల కారణాలను, విస్తరించడానికి దోహదపడిన పరిస్థితులను వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు అధ్యయనం చేస్తున్నాయి. నియంత్రణలో తొలి నుంచి ముందున్న కరీంనగర్ జిల్లాలో అమలు చేస్తున్న ప్రణాళికనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని కూడా అధికారులు నిర్ణయించుకున్నారు.

రాష్ట్రంలో కరోనా నాలుగు జిల్లాలను అతలాకుతలం చేస్తోంది. హైదరాబాద్, నిజామాబాద్, సూర్యాపేట, వికారాబాద్‌ జిల్లా ప్రజలకు ఈ వైరస్‌ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు నమోదైన ప్రాంతాలతో పోలిస్తే, ఈ 4 జిల్లాల్లోనే మూడో వంతు వరకు నమోదయ్యాయి. ప్రధానంగా మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారి ద్వారానే కేసులు నమోదైన విషయం తెలి సిందే. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అధికంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఆరుగురి ద్వారా ఏకంగా 81 మందికి కరోనా అంటుకుంది. ఒక్క చార్మినార్‌ ప్రాంతంలోనే 143 మందికి కరోనా వైరస్‌ సోకిందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. 

హైదరాబాద్‌లో కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గట్లేదు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటు చేశారు. 30 సర్కిళ్లలో డీఎంహెచ్‌వో ప్రత్యేకాధికారులను నియమించారు. కంటైన్మెంట్‌ జోన్లలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి వయసువారీగా ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు. 60 ఏళ్లు దాటిన వృద్ధులుంటే, వారి వివరాలు సేకరించి వారికున్న అనారోగ్య సమస్యలు తెలుసుకుంటున్నారు. అనుమానం వస్తే పరీక్షలు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం చేపట్టిన చర్యలను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఇతర స్థానిక నేతల సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు. అలాగైతేనే స్థానిక ప్రజలు మాట వింటారనేది సర్కారు ఆలోచన. దీనిపై ఇప్పటికే రాష్ట్ర స్థాయి పెద్దలు పలువురు నేతలతో చర్చించారు. 

అలాగే వికారాబాద్, సూర్యాపేట, నిజామాబాద్‌ జిల్లాలపైనా ప్రత్యేక దృష్టిసారించాలని నిర్ణయించారు. ముఖ్యంగా సూర్యాపేట, వికారాబాద్‌ జిల్లాల్లో వైరస్‌ వేగంగా విజృంభిస్తోంది. అక్కడి యంత్రాంగానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సూచనలు చేసింది. మర్కజ్‌ కాంటాక్టు వ్యక్తులను వేగంగా పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. నిఘా పెంచాలని కోరింది. అనుమానితులు ఉంటే తక్షణమే తమకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో నిజామాబాద్‌ జిల్లా కరోనా కేసుల్లో రెండో స్థానంలో ఉంది. కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో ఇంకా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర స్థాయి నుంచి ఆదేశాలు వెళ్లాయి. సూర్యాపేట జిల్లాలో పరిస్థితి మరింత ఘోరంగా మారింది.

10 మంది మర్కజ్‌కు వెళ్లిరాగా, అందులో ఇద్దరికి పాజిటివ్‌ లక్షణాలు కన్పించాయి. వారిలో ఒకరు సూర్యాపేట పట్టణానికి చెందినవారు. మరొకరు ఆ జిల్లాలో ఓ మండలానికి చెందిన వ్యక్తి. సూర్యాపేటకు చెందిన వ్యక్తి ద్వారానే 38 మందికి వైరస్‌ సోకడం మరింత ఆందోళన కలిగించింది. మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వ్యక్తి నుంచి ప్రైమరీ కాంటాక్టు ద్వారా మార్కెట్‌ బజార్‌లోని ఓ కిరాణా వ్యాపారికి కరోనా వచ్చింది. ఈ వ్యాపారి నుంచి అతడి కుమార్తెకు, మార్కెట్‌లో చేపలు, కూరగాయలు, పొగాకు అమ్మే వ్యాపారులకు.. వారి నుంచి కుటుంబ సభ్యులకు ఇలా 38 మందికి వైరస్‌ సోకింది. 

కరీంగనగర్‌ ఆదర్శంగా..

కరోనా కట్టడిలో కరీంనగర్‌ మార్గదర్శిగా నిలిచింది. ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం కృషి, పోలీస్, వైద్య, ఆరోగ్య, మున్సిపల్‌ సిబ్బంది సేవలు, ప్రజల క్రమశిక్షణతో కరోనాను కట్టడి చేశారు. మొదట కరీంనగర్‌కు వచ్చిన 10 మంది ఇండోనేసియన్లకు మార్చి 16న కరోనా లక్షణాలు కనిపించాయి. 17న ఒకరికి పాజిటివ్‌గా తేలింది. 18 నాటికి ఆ సంఖ్య 8కి చేరింది. అప్పటినుంచే కరీంనగర్‌లో ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఇండోనేసియన్లు బస చేసిన ప్రాంతాలు, పర్యటించిన ఏరియాలను రెడ్‌జోన్లుగా గుర్తించి కట్టుదిట్టమైన ఆంక్షలు అమలు చేశారు. ఇండోనేసియన్లు 10 మంది, వారి ద్వారా నలుగురికి వ్యాధి సోకినా కఠిన ఆంక్షలతో వైరస్‌ చైన్‌ తెగిపోయి ఇతరులకు సోకలేదు. ఆ తర్వాత కరీంనగర్‌ జిల్లా నుంచి మర్కజ్‌కు వెళ్లొచ్చిన 19 మందిలో కశ్మీర్‌గడ్డ ప్రాంతంలోని ఒక యువకుడికి, హుజురాబాద్‌లో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. హుజురాబాద్‌లో పాజిటివ్‌ వచ్చిన ఒక వ్యక్తి సోదరుడికి తర్వాత వ్యాప్తి చెందింది.

కరీంనగర్‌ స్ఫూర్తితో వైరస్‌ పాజిటివ్‌గా తేలిన వ్యక్తులు నివసించిన ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లు (హాట్‌స్పాట్‌లు)గా ప్రకటించి, ఇతర ప్రాంతాలతో సంబంధాలను తెంచుతున్నారు. గత నెల 22న జనతా కర్ఫ్యూకు ప్రధాని నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్‌ పిలుపునివ్వడానికి ముందే అంటే.. 19 నుంచే ఈ ప్రాంతాలతో పాటు కరీంనగర్‌లోని ప్రధాన రోడ్లలో కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. 23 నుంచి లాక్‌డౌన్‌ అమలులోకి రావడంతో ఇండోనేసియన్లు పర్యటించిన ప్రాంతాలన్నీ మూతపడ్డాయి. ఆ ప్రాంతాల్లో నివసించే కుటుంబాలకు నిత్యావసర వస్తువులను , కూరగాయలను కార్పొరేషన్‌ ద్వారానే అందించే ఏర్పాట్లు చేశారు. 

ఇప్పుడు కూడా ఇదే పద్ధతిని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తున్నారు. వరంగల్‌ అర్బన్‌లోనూ అలాగే పరిస్థితిని అదుపులోకి తీసుకురాగలిగారు. అయితే అత్యధికంగా కేసులు నమోదైన ప్రాంతాల్లోనూ కరీంనగర్‌ మోడల్‌గా అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు కలసికట్టుగా వ్యవహరించి క్రమశిక్షణతో కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు.  

కాగా కరీనంగర్‌లో రెండురోజుల క్రితం కొత్తగా మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా కొత్తగా కరోనా పాజిటివ్‌ వచ్చిన ప్రాంతమైన సాహెత్‌నగర్‌, శర్మనగర్‌, సాయినగర్‌ కట్టడి ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. ఓవైపు వైరస్‌ వ్యాప్తి  చెందకుండా ముమ్మరంగా పారిశధ్య పనులు చేపడుతూనే మరోవైపు ఇంటింటికి వెళ్లి ప్రత్యేక వైద్య బృందాలు స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం కట్టడిప్రాంతాల్లో 41 వైద్య బృందాలు 1464 ఇళ్లకు వెళ్లి 5,730 మందికి స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. 

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

   3 hours ago


చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!

   4 hours ago


షర్మిల ఆరోగ్య పరిస్థితి ఇది..!

షర్మిల ఆరోగ్య పరిస్థితి ఇది..!

   2 hours ago


తిరుపతి పార్లమెంట్ ఎన్నికను రద్దు చేయాలి.. పెద్దిరెడ్డిపై విరుచుకుపడ్డ చంద్రబాబు

తిరుపతి పార్లమెంట్ ఎన్నికను రద్దు చేయాలి.. పెద్దిరెడ్డిపై విరుచుకుపడ్డ చంద్రబాబు

   5 hours ago


జానారెడ్డి చేతిలో.. రేవంత్ రెడ్డి భ‌విష్య‌త్

జానారెడ్డి చేతిలో.. రేవంత్ రెడ్డి భ‌విష్య‌త్

   6 hours ago


అబ్బో స‌మ‌స్య‌ల‌పై కూడా జ‌గ‌న్ ఫోక‌స్ చేస్తున్నారా

అబ్బో స‌మ‌స్య‌ల‌పై కూడా జ‌గ‌న్ ఫోక‌స్ చేస్తున్నారా

   6 hours ago


కోవిడ్ ను ఎదుర్కోవడంలో మోడీ సర్కారు విఫలం.. సోనియా గాంధీ

కోవిడ్ ను ఎదుర్కోవడంలో మోడీ సర్కారు విఫలం.. సోనియా గాంధీ

   19 hours ago


కోరలుచాస్తున్న కరోనా.. బెంగాల్ లో ఐదో దశ పోలింగ్ .. నిబంధనలు పట్టని పార్టీలు

కోరలుచాస్తున్న కరోనా.. బెంగాల్ లో ఐదో దశ పోలింగ్ .. నిబంధనలు పట్టని పార్టీలు

   a day ago


దొంగ ఓట్ల రచ్చ.. స్పందించిన పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి

దొంగ ఓట్ల రచ్చ.. స్పందించిన పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి

   21 hours ago


Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   17-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle