newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆ సర్వేతో తేలిన అస‌లు సంగతులు ఇవీ..!

22-08-202022-08-2020 07:55:03 IST
Updated On 22-08-2020 08:36:11 ISTUpdated On 22-08-20202020-08-22T02:25:03.306Z22-08-2020 2020-08-22T02:24:59.960Z - 2020-08-22T03:06:11.814Z - 22-08-2020

ఆ సర్వేతో తేలిన అస‌లు సంగతులు ఇవీ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలోని 6 శాతం జ‌నాభాకు క‌రోనా వైర‌స్ సోకింది అనే ఓ వార్త ఇప్పుడు బాగా చ‌ర్చ‌నీయాంశ‌మవుతోంది. హైద‌రాబాద్ కేంద్రంగానే ప‌ని చేసే సెంట‌ర్ ఫ‌ర్ మాలిక్యూల‌ర్ బ‌యాల‌జీ(సీసీఎంబీ), ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమిక‌ల్ టెక్నాల‌జీ(ఐఐసీటీ) సంస్థ‌లు సంయుక్తంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అంచ‌నా వేయ‌డానికి ఓ అధ్య‌య‌నం జ‌రిపింది. 

న‌గ‌రంలో ఇప్ప‌టికే 6.60 ల‌క్ష‌ల మందికి క‌రోనా వైర‌స్ వ‌చ్చి వెళ్లింద‌నేది ఈ అధ్య‌య‌నంలో తేలింది. నిజానికి ఈ వార్త బాగా భ‌య‌పెట్టేలానే ఉంది. కానీ, ఇందులో క‌రోనా వైర‌స్‌కు సంబంధించి ప్ర‌జ‌లు తెలుసుకోవాల్సిన కొన్ని కీల‌క విష‌యాలు ఉన్నాయి.

తెలంగాణ ప్ర‌భుత్వవ‌ర్గాలు చెబుతున్న వివ‌రాల ప్ర‌కారం... క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఎంత‌మేర‌కు ఉందో గుర్తించ‌డానికి ఉన్న ప‌ద్ధ‌తుల్లో సీరో స‌ర్వే, మురుగునీటి అధ్య‌య‌నం రెండూ కీల‌క‌మైన‌వి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ రెండు ప‌ద్ధ‌తుల ద్వారానే క‌రోనా వైర‌స్ ఏ మేర‌కు వ్యాప్తి చెందిందో అంచ‌నా వేస్తున్నారు. ఇప్పుడు సీసీఎంబీ, ఐఐసీటీ సంస్థ‌లు మురుగునీటిని అధ్య‌య‌నం చేయ‌డం ద్వారా క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అంచ‌నా వేశాయి.

క‌రోనా వైర‌స్ అనేది నోటి స్ర‌వాలు, తుంప‌ర్ల నుంచే కాకుండా మ‌ల‌, మూత్రాల నుంచి కూడా బ‌య‌ట‌కు వ‌స్తుంది. అందుకే మురుగునీటిని ప‌రీక్షించ‌డం ద్వారా ఎంత మంది నుంచి ఈ వైర‌స్ బ‌య‌ట‌కు వ‌చ్చింద‌నేది అంచ‌నా వేయొచ్చు. అయితే, ఇది కేవ‌లం ఒక అంచ‌నా మాత్ర‌మే. న‌గ‌రంలో రోజూ విడుద‌ల‌య్యే మురుగునీటిలో 40 శాతం నీటిని శుద్ధి చేస్తారు. ఇక్క‌డి నుంచే సీసీఎంబీ వారు శాంపిళ్ల‌ను తీసుకొని 2 ల‌క్ష‌ల మందికి క‌రోనా సోకింద‌ని తేల్చారు. అంటే శాంపిళ్లు సేక‌రించ‌ని మిగ‌తా 60 శాతం మురుగునీటిలోనూ ఇదే లెక్క‌ను తీసుకుంటే మొత్తం 6.60 ల‌క్ష‌ల మందికి క‌రోనా వ‌చ్చింద‌ని అంచనా వేశారు.

ఈ అధ్య‌య‌నంలో కొన్ని సానుకూల విష‌యాలు కూడా ఉన్నాయి. కేవ‌లం న‌గ‌రంలోనే 6.60 ల‌క్ష‌ల మందికి ఈ వ్యాధి సోకితే అందులో కొన్ని వేల మందిని మాత్రమే ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం వస్తుంది. కొన్ని లక్షల మంది ఏ లక్షణాలూ లేకుండా, అసలు వ్యాధి వచ్చిందని కూడా తెలియకుండానే కోలుకున్నారు.

అంతే కాదు. ఇప్పటిదాకా మనం మరణాల రేటును తెలిసిన కేసుల ఆధారంగా లెక్కిస్తున్నాం. ఇప్పుడు ఇటువంటి పరిశోధనల ద్వారా ఇన్ని లక్షల మందికి ఆల్రెడీ ఈ వ్యాధి సోకింది అని తెలుస్తోంది కాబట్టి అసలు మరణాల సంఖ్యను శాతంగా చూస్తే అతి స్వల్పమైన అంకె అని కూడా మనం భావించవలసి వస్తుంది. ఇలా చూసినప్పుడు కరోనా మనం తొలుత భయపడినంత ప్రమాదకారి కాదని తెలుస్తోంది.

మ‌రో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే హైద‌రాబాద్‌లో 6 శాతం మందికి క‌రోనా వైర‌స్ సోకింద‌నేది వింటే కొంచెం ఆందోళ‌న క‌లుగుతుంది. కానీ, ఇత‌ర న‌గ‌రాల్లో ప‌రిస్థితిని కూడా ఓ సారి గ‌మ‌నించాల్సి ఉంటుంది. న్యూయార్క్‌, లండ‌న్‌, ఢిల్లీ, ముంబై, పూణే వంటి న‌గ‌రాల్లోనూ సీరో స‌ర్వే ద్వారా క‌రోనా వ్యాప్తిని శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేశారు. సీరో స‌ర్వే అంటే ఎంత‌మందిలో క‌రోనా యాంటీబాడీలు ఉన్నాయ‌నేది తెలుసుకుంటారు. యాంటీబాడీలు ఉన్న వారికి క‌రోనా వైర‌స్ వ‌చ్చి, వెళ్లిపోయింది అని అర్థం.

ఢిల్లీలో జులై తొలివారంలో జరిపిన సీరో సర్వేలో 23% మందికి క‌రోనా యాంటీబాడీలు ఉన్న‌ట్లు తెలింది. ముంబై మ‌హాన‌గ‌రంలో సుమారు 33% మందికి యాంటీబాడీలు ఉన్నాయి. 

దేశ రాజ‌ధాని ఢిల్లీ జనాభా 1.9 కోట్లు అనుకుంటే ఈ సర్వే ప్రకారం అప్పటికే 43.7 లక్షల మందికి కరోనా వైరస్ వచ్చి పోయి ఉండొచ్చు. ముంబైలో ఈ సంఖ్య సుమారు 60 లక్షలు. అంతర్జాతీయంగా చూసుకుంటే ఏప్రిల్ నగరంలో లండన్ లో సీరో సర్వే చేస్తే 17.5% మందికి యాంటీ బాడీలు ఉండగా న్యూయార్క్ నగరంలో ఇది 23%గా తేలింది. పూణెలో సీరో సర్వే చేస్తే 51% జనాభాలో యాంటీ బాడీస్ ఉన్నాయని తేలింది.

ఇక్క‌డ ఇంకో విష‌యాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది. సీరో స‌ర్వే అయినా, మురుగునీటి ప‌రీక్ష అయినా తీసుకునే శాంపిళ్లను బ‌ట్టి అంచ‌నాలు ఉంటాయి. ఈ అంచ‌నాలు అన్నీ స‌రైన‌వే అని చెప్ప‌డం కూడా సాధ్యం కాదు. పూర్తిగా త‌ప్పు అని కూడా చెప్ప‌లేము. కాబ‌ట్టి, ఈ వార్త‌ల‌తో భ‌యాందోళ‌న‌ల‌కు గురికాకుండా మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ద్వారా క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేయ‌వ‌చ్చు. క‌రోనా వైర‌స్‌ను జ‌యించ‌డానికి ముఖ్యంగా ధైర్యం అవ‌స‌రం.

శాస్త్ర‌వేత్త‌లు వేస్తున్న అంచ‌నా ప్ర‌కారం చాలా మందికి క‌రోనా వ‌చ్చింది, వెళ్లింది కూడా తెలియ‌డం లేదు. మ‌ర‌ణాల రేటు అత్యంత స్వ‌ల్పంగా ఉంటుంది. చాలా మందిని ఆసుప‌త్రుల‌కు తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం కూడా లేదు. కాబ‌ట్టి, క‌రోనాకు సంబంధించి వ‌చ్చిన ప్ర‌తి వార్త‌కు భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేదు.

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   5 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   6 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   5 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   9 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   10 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   9 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   11 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   12 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   7 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   13 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle