newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

ఆ వైభవం గతమేనా? టీడీపీ అంటే అంతేనా?

21-08-201921-08-2019 08:09:04 IST
Updated On 21-08-2019 15:47:14 ISTUpdated On 21-08-20192019-08-21T02:39:04.716Z21-08-2019 2019-08-21T02:38:56.871Z - 2019-08-21T10:17:14.912Z - 21-08-2019

ఆ వైభవం గతమేనా? టీడీపీ అంటే అంతేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ తెలుగుదేశం పని అయిపోయినట్టేనా? 

ఇక తెలంగాణ టీడీపీలో మిగిలేది ఎవరు?

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ త్వరలో ఫంక్షన్ హాల్‌గా మారబోతోందా?

టీటీడీపీ...తెలంగాణలో దిక్కులేని పార్టీగా మారిందా?

ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ పరిస్థితిపై తలెత్తుతున్న ప్రశ్నల్లో మచ్చుకి కొన్ని ఇవి.  వీటికి సమాధానం చెప్పడానికి తెలుగుదేశం నేతలే కరువయ్యారు. ఒకరిద్దరు నేతలు వున్నా వారంతా ఎప్పుడు జెండా చుట్టేస్తారో తెలీని పరిస్థితి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో  తెలుగుదేశం బలీయమయిన శక్తిగా ఉండేది? లీడర్ల మాటెలా ఉన్నా క్యాడర్ మాత్రం గతంలో పుష్కలంగా ఉండేది.

పార్టీని నేతలు వీడినా తెలుగు తమ్ముళ్ళు మాత్రం తమ గుండెల్లో పెట్టుకుని కాపాడారు, రాష్ట్ర విభజన అనంతరం పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. 2014 ఎన్నికల్లో అంతో ఇంతో ప్రభావం చూపిన పార్టీ మహాకూటమి పేరుతో 2018 ముందస్తు ఎన్నికల్లో బరిలోకి దిగి చేతులు, కాళ్ళు కాల్చుకుంది, 

కనీసం రెండు సీట్లు సాధించిన తెలుగుదేశం పార్టీ ఆ ఎమ్మెల్యేలైనా ఇప్పుడు ఎక్కడున్నారో వెతుక్కునే పరిస్థితి ఏర్పడింది. చుక్కాని లేని నావలా తెలంగాణ టీడీపీ కొట్టుమిట్టాడుతోంది. ఒకప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అంటే రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్. కానీ ఇప్పుడు జనం లేక వెలవెలబోతోంది. ట్రస్ట్ భవన్ కి వచ్చేవారి సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది.

అసలు ఒక పార్టీ ఆఫీసు ఎలా వుండాలో గతంలో చూపించిన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ చూసి అంతా నిర్ణయించుకునేవారు. వచ్చీపోయే కార్యకర్తలు, నేతలతో నిత్యకళ్యాణం-పచ్చతోరణంగా భాసిల్లేది. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముఖం చూసే నాథుడే కరువయ్యాడు. ఏ నేత ఎప్పుడు పార్టీని వీడి వెళ్లిపోతాడో తెలీని పరిస్థితి. తెలంగాణలో ఇప్పటికే బలహీనంగా ఉన్న టీ టీడీపీని వీడేందుకు అనేక మంది నేతలు సిద్ధమవుతున్నారు. రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఎల్. రమణ వంటి నాయకులు పార్టీని నమ్ముకుని ఉన్నా... చాలామంది ఇతర నాయకులు మాత్రం బీజేపీ వైపు చూస్తున్నారు.

‘‘పార్టీ కోసం రాత్రింబవళ్లు ఎంతో కష్టపడ్డా.. తీరని అన్యాయం జరగడంతో తల్లి లాంటి పార్టీని వీడాల్సి వచ్చింద’’ని కన్నీటి పర్యంతమయ్యారు. మనసు చంపుకొని బీజేపీలో చేరుతున్నాను’’ హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో రెండురోజుల క్రితం బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఒకప్పటి టీడీపీ ఎంపీ ..ప్రస్తుతం బీజేపీలో చేరిన గరికపాటి మోహనరావు మాట్లాడిన మాటలు ఇవి.

అంతేకాదు ‘‘37 ఏళ్లు టీడీపీలో ఉండి బీజేపీలో చేరడానికి వచ్చాం. బాధతోనే ఆ పార్టీని వీడుతున్నాం. 23 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ పిలుపుతో నాతో పాటు చాలా మంది నేతలం టీడీపీలో చేరాం. నాకు తెలిసి ఒకరిద్దరు మినహా ప్రస్తుతం ఆ నేతలెవరూ టీడీపీలో లేరు. పరిస్థితి ఇంతలా దిగజారడానికి కారణం కొంత మంది నేతలే..’ అని విమర్శలు చేశారు. ఇటీవల బీజేపీలో చేరిన నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీల్లో ఈయన ఒకరు. 

తెలంగాణలోని టీడీపీ నేతలను బీజేపీలోకి తీసుకొచ్చే బాధ్యతలను బీజేపీ ఎంపీ గరికపాటి మోహన్ రావు భుజస్కంధాలపై వేసింది. తెలంగాణలో టీడీపీలో మిగిలి ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులను కలిసి చర్చలు జరుపుతున్నారు. తెలంగాణలోని అనేక జిల్లాలకు చెందిన టీడీపీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు ఇప్పటికే టీడీపీని వీడుతున్నట్టు ప్రకటించారు.తాజాగా మాజీ ఎంపీ దేవేందర్ గౌడ్ ఢిల్లీ టూర్ కూడా ఆసక్తిని కలిగిస్తోంది. 

ఇనుగాల పెద్దిరెడ్డి, చాడ సురేశ్‌రెడ్డి, బోడ జనార్దన్‌ భారతీయ జనతా పార్టీ గూటికి చేరిపోయారు. ఇక మిగిలిన నేతలు కూడా త్వరలో బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు. దీంతో తెలంగాణలో టీడీపీ కథ క్లోజ్ అయినట్టే? ఇటు ఏపీలోనూ తెలుగుదేశం వైభవం పోయింది. అక్కడ కూడా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ వలలో తెలుగుతమ్ముళ్ళు పడిపోయారు. చివరకు తండ్రీకొడుకులు మాత్రమే మిగులుతారేమో అని కామెంట్లు పడుతున్నాయి. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle