newssting
BITING NEWS :
*ప్రధాని మోదీని కలిసిన వైఎస్ఆర్సీఎల్పీ నేత జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర సమస్యలపై చర్చ, ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం * వాల్డ్ కప్ వార్మప్ మ్యచ్ లో టీమిండియా పేలవ ప్రదర్శన, న్యూజీల్యాండ్ చేతిలోఓటమి * నరేంద్ర మోదీని పీఎం ఎలక్ట్ గా నియమించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ * రాష్ట్రపతి కోవింద్ కు కొత్త ఎంపీల జాబితా సమర్పించిన ఈసీ * ఎవరెస్ట్ పర్వతంపై ఈ వారం మరణించిన పర్వతారోహకుల సంఖ్య 10కి చేరిక * తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు ఏపీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితా సమర్పించిన సీఈఓ జీకే ద్వివేది

ఆ రెండు సీట్లు గెలుస్తారట!

16-05-201916-05-2019 12:45:54 IST
Updated On 16-05-2019 13:28:04 ISTUpdated On 16-05-20192019-05-16T07:15:54.106Z16-05-2019 2019-05-16T07:15:47.867Z - 2019-05-16T07:58:04.236Z - 16-05-2019

ఆ రెండు సీట్లు గెలుస్తారట!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కర్నాటకలో లోక్ సభ ఎన్నికల్లో అధిక సీట్లు సాధించే పనిలో పడ్డ ఆ రాష్ట్ర బీజేపీ నేతలు అడపాదడపా పక్క రాష్ట్రాలపై కన్నేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఎంపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ బీజేపీ. టీఆర్ఎస్‌ని ఓడించడమే లక్ష్యంగా బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి..బీజేపీ అగ్రనేతలతో ప్రచారం నిర్వహించింది. మొత్తం 17 స్థానాల్లో నాలుగైదు స్థానాలపై భారీ ఆశలు పెట్టుకుంది కమలదళం. 

ఈ క్రమంలో తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికలపై కర్నాటక మాజీ సీఎం యడ్యూరప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సికింద్రాబాద్, మహబూబ్ నగర్ లోక్‌సభ సీట్లను బీజేపీ గెలుచుకుంటుంకని జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు గెలుచుకున్న బీజేపీ రెండు ఎంపీ సీట్లు గెలుచుకుంటామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని టీఆర్ఎస్ నేతలు కామెంట్ చేస్తున్నారు.

సికింద్రాబాద్ లోక్ సభ స్థానంలో సిట్టింగ్ ఎంపీ బండారు దత్తాత్రేయను కాదని అంబర్ పేటలో ఓడిపోయిన కిషన్ రెడ్డికి పార్టీ టికెట్ ఇచ్చింది. అలాగే మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత గద్వాలలో ఓడిపోయిన డికె అరుణకు సీటిచ్చింది. ఈ రెండు సీట్లు తమఖాతాలో పడతాయని బీజేపీ నేతలు కోటి ఆశలు పెట్టుకున్నారు. 

అంతేకాదు, కేంద్రంలో మరోసారి బీజేపీ జెండా ఎగురుతుందని ధీమావ్యక్తం చేశారు యడ్యూరప్ప. బీజేపీ 280 సీట్లు సాధించి మోదీ మరోసారి ప్రధాని కాబోతున్నారని చెప్పారు. అసలే గతంలో కంటే 100 సీట్లు తగ్గుతాయని బెంబేలెత్తిపోతున్న బీజేపీ నేతలకు ఈ మాటలు రుచించడం లేదు. కర్నాటకలో బీజేపీకి 20-22 ఎంపీ సీట్లు వస్తాయని యడ్యూరప్ప చెబుతున్నారు.

BJP will get 280 MP seats: Yeddyurappa

వికారాబాద్‌ జిల్లా తాండూరులో పర్యటించిన యడ్యూరప్ప..భావిగి భద్రేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. అంతేకాదు,కర్నాటకలో త్వరలో జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని...అందులో తమ ప్రమేయం ఏమీ ఉండదని స్పష్టంచేశారు. ప్రభుత్వం కూలిపోతుందని లోక్ సభ ఎన్నికల ముందే ఆయన ప్రకటించారు. మళ్ళీ అదేమాట మాట్లాడారు. దక్షిణాదిన కాస్తో కూస్తో కమలం వికసిస్తోందంటే అది కర్నాటక గడ్డమీదే. మరి తెలంగాణ విషయంలో యడ్యూరప్ప జోస్యం ఎంతవరకూ ఫలిస్తుందో చూద్దాం. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle