newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

ఆ రాష్ట్రాలనుంచి తెలంగాణలోకి నో ఎంట్రీ

17-05-202017-05-2020 08:57:57 IST
Updated On 17-05-2020 09:38:42 ISTUpdated On 17-05-20202020-05-17T03:27:57.235Z17-05-2020 2020-05-17T03:27:50.673Z - 2020-05-17T04:08:42.676Z - 17-05-2020

ఆ రాష్ట్రాలనుంచి తెలంగాణలోకి నో ఎంట్రీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు సరిహద్దున ఉన్న ఏపీ. మహారాష్ట్ర,తో పాటు గుజరాత్ రాష్ట్రాల నుంచి రాకపోకలు నిషేధించింది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు వచ్చే రాకపోకలపై ఆంక్షలు విధించింది.

తెలంగాణలో నిన్న ఒక్కరోజే 55 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 44 కేసులు నమోదయ్యాయి. వలస కార్మికుల వల్ల 8 కేసులు నమోదయినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ఈ మూడు రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వారందరికీ మూడు రోజులుగా ప్రభుత్వం పాసుల జారీ నిలిపి వేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు పాసులు జారీ చేయొద్దని స్పష్టం చేసింది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు, మరణాల రేటు తక్కువ ఉన్నప్పటికీ.. ఇరు రాష్ట్రాల మధ్య విస్తృత రాకపోకలను దృష్టిలో పెట్టుకోవడమే కాకుండా సరిహద్దు ప్రాంతాలైన కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉండటం వల్లే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ నిర్ణయంతో ఏపీ వాసులు షాక్ తిన్నారు. ఏపీ నుంచి తెలంగాణకు బస్సు సర్వీసులు ప్రారంభం అవుతాయని భావిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం ప్రభావం చూపుతుందని అంటున్నారు. 

ఇటు దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన సుమారు 80 వేల మంది తెలంగాణ వాసులు అత్యవసర పాసుల ద్వారా తిరిగి వారి స్వస్థలాలకు చేరుకున్నారు. ఇక అలా వచ్చిన వారికి వైద్య అధికారులు చెక్ పోస్ట్ వద్ద థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తారు. ఎవరికైనా జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉంటే తిరిగి పంపించేస్తారు. అటు లక్షణాలు లేనివారి చేతులపై 14 రోజుల హోం క్వారంటైన్ ముద్రను వేసి ఇళ్లకు పంపుతారు. నిబంధనలను ఖచ్చితంగా అమలుచేస్తామని అధికారులు తెలిపారు. ఏపీనుంచి తెలంగాణకు ఎవరినీ అనుమతించవద్దని అధికారులు సూచించారు. 

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

   6 hours ago


తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

   11 hours ago


భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

   14 hours ago


మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

   14 hours ago


నిమ్మగడ్డ  ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

నిమ్మగడ్డ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

   15 hours ago


మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

   17 hours ago


యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

   17 hours ago


‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

   18 hours ago


తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

   18 hours ago


డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

   30-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle