newssting
BITING NEWS :
*కాకినాడలో ముగిసిన జనసేన రైతు సౌభాగ్యదీక్ష*పౌరసత్వ బిల్లుకి రాష్ట్రపతి ఆమోదం *అసోం, మేఘాలయ, త్రిపురల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు *ఐదో రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు..ఉపాధి హామీ నిధుల విడుదల కోరుతూ..నేడు అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేల ధర్నా*నేడు విశాఖలో సీఎం జగన్‌ పర్యటన..ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరు*దిగివస్తున్న ఉల్లి ధరలు...కిలో ఉల్లి 70-80 లోపే అమ్మకాలు *అమరావతి: ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌ని సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. గత ప్రభుత్వంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పనిచేసిన కృష్ణ కిషోర్*హైదరాబాద్‌: బంజారాహిల్స్ ఎస్‌బీటీ నగర్‌లో రౌడీ షీటర్ హత్య... రౌడీ షీటర్‌ సయీద్ నూర్‌ను హత్య చేసిన నలుగురు వ్యక్తులు, బంజారాహిల్స్ పీఎస్‌లో లొంగుబాటు*తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమల్లోఉంటాయి.. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు మృతదేహాలను భద్రపర్చాలి-సుప్రీంకోర్టు*కూల్చివేతలతో ప్రభుత్వాన్ని ప్రారంభించిన వైసీపీ.. అందరినీ కూల్చివేస్తోంది.. ఎంతోమంది కూలిపోయారు.. మీరెంత...? మీ 151 మంది ఎమ్మెల్యేలెంత?-పవన్*అసెంబ్లీలో మార్షల్ తీరుపై మండిపడ్డ చంద్రబాబు

ఆ మాజీ ఎమ్మెల్యే పొలిటిక‌ల్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్ ప‌డ్డ‌ట్టే..!

17-11-201917-11-2019 09:37:03 IST
2019-11-17T04:07:03.334Z17-11-2019 2019-11-17T04:06:57.662Z - - 13-12-2019

ఆ మాజీ ఎమ్మెల్యే పొలిటిక‌ల్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్ ప‌డ్డ‌ట్టే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప‌ఠాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వ‌ర్‌గౌడ్ రాజకీయ జీవితం ప్ర‌స్తుతం ప్ర‌శ్నార్ధ‌కంగా మారింద‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృతంగా జ‌రుగుతోంది. అయితే, మినీ ఇండియాగా పేరుపొందిన ప‌ఠాన్‌చెరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి నందీశ్వ‌ర్‌గౌడ్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా 2009లో తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే.

అదే స‌మ‌యంలో నందీశ్వ‌ర్‌గౌడ్ కాస్త దూకుడుగా వ్య‌వ‌హ‌రించి అటు సొంత పార్టీ నేత‌ల నుంచి.. ఇటు ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకున్నారు. అయినా కూడా జీవితాంతం నియోజ‌క‌వ‌ర్గానికి తానే ఎమ్మెల్యేగా ఉండిపోవాల‌ని ఆశ‌ప‌డ్డారు. అంత వ‌ర‌కు బాగానే ఉన్నా ఆ త‌రువాత త‌న‌కు తానుగా చేసిన కొన్ని పొర‌పాట్లు ప్ర‌స్తుతం ఆయ‌న‌కే త‌ల‌నొప్పిగా మారాయి.

ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక‌వాడ‌లు ఉన్న ప‌ఠాన్‌చెరుకు నాడు ఎమ్మెల్యేగా ఉన్న నందీశ్వ‌ర్‌గౌడ్  ఆ స‌మ‌యంలో ఆ ప్రాంత ప‌రిశ్ర‌మ‌ల అధిప‌తుల‌కు కూడా త‌ల‌నొప్పిగా మారాడ‌న్న టాక్ ఉంది. దాంతో ఆయ‌న 2014 ఎన్నిక‌ల్లో ఏకంగా మూడో స్థానానికి ప‌డిపోయారు.

ఆ త‌రువాత ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా కాంగ్రెస్ జిల్లా అధ్య‌క్షుడి స్థాయిలో ప‌నిచేసిన ఆయ‌న క్ర‌మంగా పార్టీకి  దూర‌మై గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కొద్ది రోజుల‌కు ముందు టీడీపీ కండువా క‌ప్పుకున్నారు. ఇక సీటు తెచ్చేసుకుని కుమ్మేద్దామ‌ని అనుకుని.. త‌న వియ్యంకుడైన ఏపీ మాజీ ఉప ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి ద్వారా ప‌ఠాన్‌చెరు టీడీపీ నుంచి బ‌రిలో నిల‌వాల‌ని ప్ర‌య‌త్నాలు చేసి ఫెయిల్ అయ్యారు.

గ‌త ఏడాది చివ‌ర్లో జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో టీడీపీ - కాంగ్రెస్ పొత్తు కార‌ణంగా ప‌ఠాన్‌చెరు సీటు కాస్తా కాంగ్రెస్‌కు వెళ్లిపోయింది. దీంతో నందీశ్వ‌ర్‌గౌడ్ మ‌ళ్లీ సైలెంట్ అయిపోయారు.

ఇక లాభం లేద‌నుకుని భావించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ల‌క్ష్మ‌ణ్ ఆధ్వ‌ర్యంలో ఢిల్లీ వెళ్లి అమిత్ షా స‌మక్షంలో ఆ పార్టీ కండువా క‌ప్పుకున్నారు. ఇలా మూడు పార్టీలో ప‌నిచేసిన నందీశ్వ‌ర్‌గౌడ్ బీజేపీలో చేరిన కొద్ది రోజుల‌కే పార్టీకి దూరంగా ఉండ‌టం మొద‌లు పెట్టారు. నందీశ్వ‌ర్‌గౌడ్ తీరును చూసి బీజేపీలో అన‌వ‌స‌రంగా చేర్చుకున్నామే అంటూ ల‌క్ష్మ‌ణ్ ఫీల‌య్యార‌ని పార్టీ కార్య‌క‌ర్త‌లు చెబుతున్నారు.

ఇదిలా ఉండ‌గా, ఇట్టా పార్టీలు మారుతూ పోతే ఆయ‌న్ను ఎట్టా న‌మ్ముకుని ఉండాల‌న్న అనుమానాన్ని కేడ‌ర్ వ్య‌క్తం చేస్తోంది. మ‌రికొంద‌రు ఆయ‌న‌తో ఉంటే క‌ష్ట‌మేన‌ని భావించి సైలెంట్‌గా సైడైపోతున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం నందీశ్వ‌ర్‌గౌడ్ ఎక్కువగా బెంగ‌ళూరులో ఉంటూ త‌న రియ‌ల్ ఎస్టేట్ బిజినెస్ సూప‌ర్‌గా చేసుకుంటున్నార‌ని, త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేదంటూ కేడ‌ర్ ఆరోపిస్తోంది.

అయితే, ఇటీవ‌ల టీడీపీ రాష్ట్ర నాయ‌కుడు గ‌డిల శ్రీ‌కాంత్ గౌడ్‌ బీజేపీలో చేర‌డంతో నందీశ్వ‌ర్‌కు షాక్ త‌గిలిన‌ట్ల‌యింది. బీజేపీలో ఉండి వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు సంపాదించుకోవాల‌నుకుంటే శ్రీ‌కాంత్ గౌడ్ అది త‌న్నుకుపోయేలా ఉన్నాడ‌ని నందీశ్వ‌ర్ గౌడ్ ఇప్పుడు త‌ల‌ప‌ట్టుకుంటున్నాడ‌ని ప‌టాన్‌చెరు నియోజ‌క‌వ‌ర్గాలో వినిపిస్తున్న టాక్‌. ఇటువంటి స‌మ‌యంలోనైనా నందీశ్వ‌ర్‌గౌడ్‌ వ్యాపారాల‌ను ప‌క్క‌న‌పెట్టి పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారా..?  లేదా..? అని జ‌నాలు ఎదురు చూస్తున్నారు. 

 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle