ఆ పదవిపై కేకేకు కాంగ్రెస్ ఆశలు పెంచి మోసం చేసిందా..?
12-09-202012-09-2020 06:56:01 IST
2020-09-12T01:26:01.346Z12-09-2020 2020-09-12T01:25:58.561Z - - 22-04-2021

టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు కేకేను కాంగ్రెస్ మోసం చేసిందా..? ఓ ముఖ్య పదవిపై ఆశలు పెంచి మోసం చేసిందా..? అంటే అవుననే ప్రచారమే జరుగుతోంది. ప్రస్తుతం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. రాజ్యసభలో ఎన్డీఏకు పూర్తి స్థాయిలో బలం లేదు. దీంతో ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిని ఓడించి షాక్ ఇవ్వాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాజ్యసభా పక్ష నేత గులాం నబీ ఆజాద్ టీఆర్ఎస్ ఎంపి కె.కేశవరావుకు ఫోన్ చేశారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆఫర్ గులాం నబీ ఆజాద్ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కేకే పూర్వాశ్రమం కాంగ్రెస్ పార్టీనే. ఆయనకు గులాం నబీ ఆజాద్‌తో సాన్నిహిత్యం ఉంది. కేకేను నిలబెడితే గెలిచే చాన్స్ ఉందని అనుకున్నారో, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయో కానీ పోటీ చేస్తే కాంగ్రెస్ మీకు మద్దతు ఇస్తుందని కేకేకు ఆజాద్ ఆఫర్ ఇచ్చారని చెబుతున్నారు. అంతేకాదు, మీరు పోటీ చేస్తే వైసీపీ, టీడీపీ ఎంపీల మద్దతు కూడా లభిస్తుందని చెప్పారట. దీంతో కేశవరావు ఆలోచనలో పడ్డారు. ఈ పదవికి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయనకు కూడా ఈ ఎన్నిక పార్టీలకు అతీంగా జరిగేది అని అన్నారట. అంటే, పోటీ చేస్తే ఓకే అని క్లియరెన్స్ ఇచ్చినట్లే. ఈ విషయాలను కేకేనే స్వయంగా వెల్లడించారు. దీంతో ఈ ప్రచారం నిజమే అని స్పష్టమైంది. ఇది జరిగిన తెల్లారే శుక్రవారం నాడు యూపీఏ తరపున రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవికి నామినేషన్ దాఖలైంది. ఆర్జేడీ పార్టీకి చెందిన మనోజ్ ఝా నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. అంతేకాదు, కేకేకు ఫోన్ చేసి ఈ పదవికి పోటీ చేయాలని ఆఫర్ ఇచ్చిన గులాం నబీ ఆజాద్ స్వయంగా మనోజ్ ఝాతో నామినేషన్ వేయించారు. కాంగ్రెస్‌తో పాటు ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, శివసేన, జేఎంఎం వంటి మొత్తం 12 పార్టీలు మనోజ్ ఝాకు మద్దతు ఇచ్చారు. ఇక, ఎన్డీఏ తరపున జేడీయూ నేత హరివంశ్ నారయణ్ పోటీ చేస్తున్నారు. ఆయనకు ఎన్డీఏ పక్షాలన్నీ మద్దతు ఇస్తున్నాయి. అయితే, మనోజ్ ఝాను పోటీ చేయించాలనే ముందే అనుకున్న కాంగ్రెస్ పార్టీ కేకేకు ఎందుకు ఆఫర్ ఇచ్చారనే చర్చ జరుగుతోంది. కేకే పోటీ చేస్తే తెలుగువాడు కాబట్టి వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కూడా ఆయనకు మద్దతు ఇస్తాయని గులాం నబీ ఆజాద్ అంచనా వేసి ఉంటారు. టీఆర్ఎస్ మద్దతు ఎలాగూ ఉంటుంది. మూడు తటస్థంగా ఉన్న పార్టీల మద్దతు కూడా లభిస్తే కేకే ఎన్డీఏ అభ్యర్థిని సులువుగా ఓడించగలరని ఆజాద్ లెక్కలు కట్టి ఉంటారు. కానీ, వాస్తవంగా ఆ పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ బీజేపీతో జతకట్టేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఏ మాత్రం సందు దొరికినా వెళ్లి బీజేపీ పంచన చేరేందుకు సిద్ధంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ మద్దతు ఇస్తున్న అభ్యర్థికి టీడీపీ మద్దతు ఇచ్చే అవకాశమే లేదు. వైసీపీది కూడా ఇదే పరిస్థితి. కేంద్రంలోని బీజేపీతో సఖ్యతగా ఉండాలనేది జగన్ ఆలోచన. అనవసరం బీజేపీ పెద్దలకు ఎదురుతిరిగే పని ఆయన ఎట్టి పరిస్థితుల్లో చేయరు. కాబట్టి, ఈ రెండు పార్టీల మద్దతు కేకేకు దక్కడం కష్టమే. అందుకే కేకే విషయంలో కాంగ్రెస్ మళ్లీ వెనకడుగు వేసినట్టుంది. కానీ, పాపం కేకేకు మాత్రం ఈ పదవిపై ఆశలు కల్పించి తెల్లారేసరికి ప్లేట్ ఫిరాయించి షాక్ ఇచ్చారు గులాం నబీ ఆజాద్.

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
6 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
9 hours ago

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
12 hours ago

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
13 hours ago

ఏందయ్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే
13 hours ago

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మరి రాష్ట్రాల మాటేంటి
11 hours ago

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..
21-04-2021

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!
a day ago

కాంగ్రెస్ కి ఇంకా ఆశలు ఉన్నట్లున్నయ్
21-04-2021

తిరుపతి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ తప్పదా
21-04-2021
ఇంకా