newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

ఆ న‌లుగురిలో ముగ్గురికి ప‌ద‌వులు గ్యారంటీ..!

20-07-201920-07-2019 08:48:19 IST
2019-07-20T03:18:19.773Z20-07-2019 2019-07-20T03:17:58.667Z - - 14-08-2020

ఆ న‌లుగురిలో ముగ్గురికి ప‌ద‌వులు గ్యారంటీ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ‌లో పార్టీ ఫిరాయింపుల‌తో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ స్థానాల‌ను త్వ‌ర‌లోనే భ‌ర్తీ చేసే యోచ‌న‌లో ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు ఉన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ఇప్ప‌టికే ఇద్ద‌రి పేర్ల‌ను ఖ‌రారు చేశార‌నే ప్ర‌చారం పార్టీలో జ‌రుగుతోంది.

వీరిలో గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, దేశ‌ప‌తి శ్రీనివాస్ పేర్లు ప్ర‌ధానంగా వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు రాములు నాయ‌క్‌, భూప‌తి రెడ్డి, యాద‌వ‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వీరిపై మండ‌లి ఛైర్మ‌న్ అన‌ర్హ‌త వేటు వేశారు. త‌మ‌పై అన‌ర్హ‌త వేటు చెల్ల‌ద‌ని వీరు కోర్టుకు వెళ్లారు. కోర్టులో వీరికి వ్య‌తిరేకంగా తీర్పు వ‌చ్చింది. భూప‌తిరెడ్డి విష‌యం ఇంకా తేల‌క‌పోయినా రాములు నాయ‌క్‌, యాద‌వ‌రెడ్డిపై అన‌ర్హ‌త వేటు ప‌డ్డ‌ట్లే. త్వ‌ర‌లో భూప‌తిరెడ్డి వ్య‌వ‌హారం కూడా తేల‌నుంది.

ముందుగా గ‌వ‌ర్న‌ర్‌, ఎమ్మెల్యే కోటాల కింద యాద‌వ‌రెడ్డి, రాములు నాయ‌క్‌తో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ రెండింటిలో ఒక‌టి న‌ల్గొండ మాజీ ఎంపీ, ప్ర‌స్తుత రైతు స‌మ‌న్వ‌య స‌మితి ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డికి ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది.

కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరేట‌ప్పుడే ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌ని కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ, గ‌త ప్ర‌భుత్వంలో ఆయ‌న‌ను మంత్రివ‌ర్గంలోకి తీసుకోలేదు. ఈసారి మంత్రి ప‌ద‌విపై ఆస‌క్తితో ఆయ‌న న‌ల్గొండ ఎంపీగా కూడా పోటీ చేయ‌లేదు. దీంతో మంత్రి ప‌ద‌వి సంగ‌తి ఎలా ఉన్నా ముందు ఆయ‌న‌కు ఎమ్మెల్సీ అయితే ఇస్తార‌ని తెలుస్తోంది.

ఇక‌, మ‌రో ఖాళీలో ప్ర‌స్తుతం ముఖ్య‌మంత్రి ఓఎస్డీగా ఉన్న దేశ‌ప‌తి శ్రీనివాస్‌కు అవ‌కాశం ఇవ్వ‌వ‌చ్చు. కేసీఆర్‌కు స‌న్నిహితుడిగా ముద్ర‌ప‌డ్డ ఆయ‌న ఉద్య‌మంలోనూ కేసీఆర్‌తో క‌లిసి ప‌నిచేశారు.

దీంతో ఆయ‌న‌కు కూడా ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇవ్వ‌నున్నార‌ని టీఆర్ఎస్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల కోటాలో భూప‌తిరెడ్డి అన‌ర్హ‌త‌పై కూడా త్వ‌ర‌లోనే కోర్టు తీర్పు రానుంది. ఈ ఎమ్మెల్సీ కూడా ఖాళీ అయ్యే అవ‌కాశం ఉంది. ఈ స్థానం నుంచి జిల్లాలో ప్ర‌ధానంగా ఇద్ద‌రి పేర్లు వినిపిస్తున్నాయి.

అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు కాంగ్రెస్ నుంచి మాజీ స్పీక‌ర్ కేఆర్ సురేష్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. పోటీ కూడా చేయ‌కుండా టీఆర్ఎస్ అభ్య‌ర్థుల విజ‌యానికి స‌హ‌క‌రించారు. ఈయ‌న‌కు అప్పుడే హామీ ఇచ్చారు.

ఇక‌, పార్ల‌మెంటు ఎన్నిక‌ల ముందు నిజామాబాద్ జిల్లాలో టీడీపీ సీనియ‌ర్ నేత‌గా ఉన్న మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావు టీఆర్ఎస్‌లో చేరారు. ఆయ‌న‌ను కేసీఆర్ స్వ‌యంగా ఇంటికి వెళ్లి మ‌రీ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఆయ‌న కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. వీరిద్ద‌రిలో ఒక‌రికి ఎమ్మెల్సీ ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశం ఉంది. త్వ‌ర‌లోనే ఈ న‌లుగురిలో ముగ్గురికి ఎమ్మెల్సీ ప‌ద‌వులు ద‌క్కే అవ‌కాశం ఉంది.

వీళ్ళు మనుషులేనా? రాత్రంతా వానలోనే కరోనా మృతదేహాలు

వీళ్ళు మనుషులేనా? రాత్రంతా వానలోనే కరోనా మృతదేహాలు

   6 hours ago


ఒకవైపు కరోనా ఉధృతి.. జెఎన్టీయూ కీలక నిర్ణయం

ఒకవైపు కరోనా ఉధృతి.. జెఎన్టీయూ కీలక నిర్ణయం

   7 hours ago


టీడీపీనేత అచ్చెన్నకు కరోనా పాజిటివ్

టీడీపీనేత అచ్చెన్నకు కరోనా పాజిటివ్

   8 hours ago


మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం

   12 hours ago


హర్షకుమార్ వెనుక చంద్రబాబే.. . మంత్రి విశ్వరూప్ ఫైర్

హర్షకుమార్ వెనుక చంద్రబాబే.. . మంత్రి విశ్వరూప్ ఫైర్

   13 hours ago


ఈసారి గోల్కొండ కాదు.. ప్రగతి భవన్‌లో పంద్రాగస్తు వేడుకలు

ఈసారి గోల్కొండ కాదు.. ప్రగతి భవన్‌లో పంద్రాగస్తు వేడుకలు

   14 hours ago


ముగిసిన మాజీమంత్రి ఖలీల్ బాషా అంత్యక్రియలు

ముగిసిన మాజీమంత్రి ఖలీల్ బాషా అంత్యక్రియలు

   14 hours ago


ఏపీలో 26 లక్షలు దాటిన టెస్టులు..  ప్రతి జిల్లాలో వైరస్ విజృంభణ

ఏపీలో 26 లక్షలు దాటిన టెస్టులు.. ప్రతి జిల్లాలో వైరస్ విజృంభణ

   14 hours ago


ఏజెన్సీని కమ్మేసిన మేఘాలు.. భారీవర్షాలు

ఏజెన్సీని కమ్మేసిన మేఘాలు.. భారీవర్షాలు

   15 hours ago


జూనియర్ డాక్టర్లకు జగన్ గుడ్ న్యూస్ ...స్టైఫండ్ పెంపు

జూనియర్ డాక్టర్లకు జగన్ గుడ్ న్యూస్ ...స్టైఫండ్ పెంపు

   16 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle