newssting
BITING NEWS :
*న్యూస్ స్టింగ్ వీక్షకులకు, శ్రేయోభిలాషులకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు *మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు *నేడు మహాశివరాత్రి... శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మర్మోగుతున్న ఆలయాలు *వేములవాడ రాజన్న ఆలయానికి హెలికాప్టర్ సేవలు *శ్రీశైలంలో రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, అమ్మవార్ల కల్యాణోత్సవం *పంచాయితీరాజ్ చట్టంలో సవరణలపై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ. గత కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని తగ్గించిన ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆర్డినెన్స్ *వైఎస్ వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్ పై విచారణ. సిట్ విచారణను సీల్డ్ కవర్ లో అందజేసిన ఏజీ. సిట్ విచారణ దాదాపుగా పూర్తి కాబోతుందని, ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదన్న ఏజీ.కేసు జనరల్ డైరీ, కేసు డైరీ ఫైల్స్ ను సోమవారానికి సమర్పించాలని ఏజీని ఆదేశించిన ఏపీ హైకోర్టు*అమరావతి: చంద్రబాబు, లోకేష్ అత్యంత అవినీతిపరులు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఆస్తుల ప్రకటన-ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి *తిరుపతి: రుయా హాస్పిటల్ లో ఆవరణలో సైకోల వీరంగం. రుయా సెక్యూరిటీ సిబ్బందితో సైకోల వాగ్వాదం. బ్లేడులతో గాయపరుచుకున్న నలుగురు సైకోలు. భయంతో పరుగులు తీసిన నర్సులు *నేతలపై దాడులు చేస్తే ఎవరైనా వస్తారా..? పెట్టుబడులు వస్తాయా..? రైతుల ముసుగులో టీడీపీ గుండాలు నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు-వైసీపీ ఎమ్మెల్యే రోజా

ఆ నేత కోరిక నెరవేరుతుందా..?

29-11-201929-11-2019 13:18:04 IST
Updated On 29-11-2019 16:04:23 ISTUpdated On 29-11-20192019-11-29T07:48:04.304Z29-11-2019 2019-11-29T07:47:44.422Z - 2019-11-29T10:34:23.018Z - 29-11-2019

ఆ నేత కోరిక నెరవేరుతుందా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజకీయాల్లో బీజేపీ జాతీయ స్థాయి నేత ఇంధ్రసేనారెడ్డి రూటే సపరేటు. ముక్కుసూటి మనస్తత్వం, ఆది నుంచి బీజేపీని అంటిపెట్టుకొని పార్టీ అభివృద్ధికోసం బలంగా పనిచేస్తున్న నేత. కానీ ఇప్పుడు ఆయన పార్టీ అధిష్టానం పట్ల అలకపాన్పువేసినట్లు చర్చ సాగుతుంది. తనకంటే జూనియర్‌లకుసైతం కీలక పదవులు దక్కుతుంటే తనను మాత్రం కార్యాలయంకే పరిమితం చేశారని ఇంద్రసేనారెడ్డితో పాటు ఆయన వర్గీయులు ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది.

విద్యార్థి విభాగంలో పనిచేసిన ఇంద్రసేన, 1980 నుంచే పార్టీలో యాక్టివ్‌ రోల్‌ పోషిస్తున్నారు. 1983లోనే మలక్ పేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన తన 33ఏళ్ల వయస్సులో ఏపీ అసెంబ్లీలోకి ప్రవేశించారు. తరువాత 1987, 1999 సంవత్సరాల్లో కూడా మలక్ పేట నుంచి విజయం సాధించారు. 1999లో ఏపీ బీజేపీ శాసనసభాపక్షనేతగా ఇంధ్రసేనారెడ్డి పనిచేశారు. బీజేపీ ఏ రాష్ట్రంలో అధికారంలో లేని సమయంలో కష్టనష్టాలకు ఓర్చి బీజేపీ అధ్యక్షుడుగా పనిచేశారు.

జాతీయస్థాయిలో పని చేసిన ఆయన, ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేశారు. ప్రస్తుత రాష్ట్ర బీజేపీ కార్యాలయ భవనం ఇంద్రసేనా రెడ్డి అధ్యక్షుడిగా పని చేసినప్పుడు నిర్మించిందే. తెలంగాణలో ప్రత్యక్ష ఎన్నికల్లో బీజేపీ నుంచి మూడుసార్లు గెలిచిన అతికొద్ది మందిలో ఆయన ఒకరు. అలాంటి సీనియర్‌ కి పార్టీలో దక్కాల్సినంత గుర్తింపు దక్కలేదన్నది ఆయన సన్నిహితుల వాదన.

ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన అనేక మంది సీనియర్లు వివిధ పదవుల్లో ఉన్నారు. విద్యాసాగరరావు మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిరాగా, దత్తాత్రేయ హిమాచల్‌ గవర్నర్‌గా వెళ్ళారు. కిషన్‌ రెడ్డి కేంద్రమంత్రి బాధ్యతల్లో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇంద్రసేనా రెడ్డి జాతీయ కార్యవర్గ సభ్యుడి హోదాలో పని చేస్తున్నారు. పార్టీ కోసం బలంగా పనిచేసిన ఇంద్రసేనా రెడ్డికి, పార్టీ సరైన గౌరవం ఇవ్వట్లేదని, ఆయనను ఆఫీస్‌ కే పరిమితం చేయడం పట్ల ఆయన సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముక్కు సూటితనం, నిక్కచ్చిగా ఉండటమే ఆయన ఎదుగుదలకు ఆటంకం గా మారాయన్నది ఆయన సన్నిహితుల అభిప్రాయం. సుమారు 20రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, ఏదొక రాష్ట్రంలో ఆయనను గవర్నర్‌ గా నియమిస్తే ఆయనకు సముచిత స్థానం కల్పించినట్లు అవుతుందని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రాల్లో అధికారంలో లేని సమయంలో పార్టీ బలోపేతానికి తాను చేసిన కృషిని మోడీ, అమిత్‌ షాలు గుర్తిస్తారన్న నమ్మకం తనకుందని ఇంధ్రసేనారెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారంట.

తమిళనాట బీజేపీ శాఖకు అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళసై కు తెలంగాణ గవర్నర్‌ గా కేంద్రం బాధ్యతలు అప్పగించింది. అదే విధంగా వివిధ రాష్ట్రాలకు అధ్యక్షులుగా పనిచేసిన వారికి సైతం బీజేపీ జాతీయ నాయకత్వం గవర్నర్లుగా ప్రమోషన్లు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇంద్రసేనారెడ్డికి సైతం అవకాశమొస్తుందన్న ఆశలో ఆయన వర్గీయులు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇంధ్రసేనారెడ్డి, ఆయన వర్గీయుల మొరను మోదీ, అమిత్‌షాలు ఏమేరకు ఆలకిస్తారు. ఇంద్రసేనారెడ్డి కోరిక ఎప్పుడు తీరుతుందోనని ఆయన సన్నిహితులు ఆశగా ఎదుచుచూస్తున్నారు.  

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

   5 hours ago


గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

   6 hours ago


చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

   8 hours ago


వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

   8 hours ago


గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

   9 hours ago


ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

   10 hours ago


‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

   13 hours ago


ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

   13 hours ago


శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

   14 hours ago


వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

   15 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle