newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆ డాక్టర్‌కి షోకాజ్..తెలంగాణ సర్కార్ తీరుపై విమర్శలు

20-07-202020-07-2020 09:33:56 IST
Updated On 20-07-2020 09:39:19 ISTUpdated On 20-07-20202020-07-20T04:03:56.882Z20-07-2020 2020-07-20T04:02:14.002Z - 2020-07-20T04:09:19.899Z - 20-07-2020

ఆ డాక్టర్‌కి షోకాజ్..తెలంగాణ సర్కార్ తీరుపై విమర్శలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆ డాక్టర్ చేసిన పని దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. జాతీయ మీడియా కూడా ఫోకస్ పెట్టింది. అయితే, ప్రభుత్వానికి అతని చురుకుదనం నచ్చలేదు. తెలంగాణలోని పెద్దపల్లిలో ఓ వ్యక్తి కరోనాతో చనిపోయాడు. అతడి మృతదేహాన్ని శ్మశానికి తరలించడానికి మున్సిపల్ ట్రాక్టర్ ను ఆసుపత్రికి రప్పించారు. అయితే ఆ డెడ్ బాడీని శ్మశానానికి తీసుకెళ్లడానికి సదురు ట్రాక్టర్ డ్రైవర్ ససేమిరా అన్నాడు. గంటల పాటు ఆ శవం అక్కడే వుంది. కానీ ఆ డాక్టర్ మానవత్వంతో ఆలోచించాడు. పరిస్థితిని అర్థం చేసుకున్న కరోనా వైరస్ డిస్ట్రిక్ట్ సర్వీలెన్స్ అధికారి డాక్టర్ శ్రీరామ్ ముందుకొచ్చాడు. 

పరిమళించిన మానవత్వం.. డాక్టర్ సాహసం

ఆట్రాక్టర్ ను నడుపుకుంటూ శ్మశానానికి తరలించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. పీపీఈ కిట్ వేసుకొని అంత్యక్రియలు నిర్వహించిన డాక్టర్ శ్రీరామ్ మానవతా దృక్ఫథానికి అంతా హ్యాట్సాఫ్ చెప్పారు. తెలంగాణ సర్కార్ మాత్రం ఆ డాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేయడం, షోకాజ్ నోటీసులు జారీచేయడంపై సర్వత్రా విమర్శలు చోటుచేసుకుంటున్నాయి.

తెలంగాణ సర్కార్ తాజాగా కరోనా శవాన్ని తీసుకెళ్ళేందుకు ట్రాక్టర్ నడిపిన డాక్టర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంవం అయింది. శవాన్ని తరలించడంలో ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఎందుకు పాటించలేదని.. డాక్టర్ అయ్యుండి శవాన్ని ఎందుకు తరలించారో వివరణ ఇవ్వాలని జిల్లా వైద్యశాఖ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

దీనికి మానవత్వంతోనే తాను ఇలా వ్యవహరించానని.. తనకు ఎటువంటి దురుద్దేశాలు లేవని డాక్టర్ శ్రీరామ్ సంజాయిషీ ఇచ్చారు. కరోనా వారియర్ గా ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించిన డాక్టర్ శ్రీరామ్ కు షోకాజ్ నోటీసులు జారీ చే్యడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కరోనా వైరస్ వ్యాప్తి వేళ తమ ప్రాణాలకు తెగించి పోరాడుతున్న డాక్టర్ల పట్ల  తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అందరూ మండిపడుతున్నారు. ప్రభుత్వం తీరు డాక్టర్ల మనో స్థయిర్యాన్ని దెబ్బతీస్తుందని అంటున్నారు. 

 

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   an hour ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   39 minutes ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   2 hours ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   2 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   5 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   3 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   6 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   20 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle