newssting
BITING NEWS :
* దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1,51,767.. 4337 మరణాలు * ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 474 సస్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన డాక్టర్ శైలజ *లాక్‍డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై పిటిషన్‍ను హైకోర్టులో విచారణ *విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు నివాళి. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ50వేల ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రబాబు *ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ *సీఆర్డీఏ చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ.. జూలై 22 కి వాయిదా *గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం *ఏపీలో మరో 68 కరోనా కేసులు.. మొత్తం కేసులు 2787 *తెలంగాణలో 71 పాజిటివ్ కేసులు .... ఇప్పటి వరకు 1991 కేసులు*ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య .. అస్వస్థతకు గురై ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వెంకాయమ్మ..మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి

ఆ జిల్లాపై సీఎం కేసీఆర్ స్పెష‌ల్ ఫోక‌స్‌..!

21-03-202021-03-2020 08:00:01 IST
2020-03-21T02:30:01.487Z21-03-2020 2020-03-21T02:29:46.386Z - - 27-05-2020

ఆ జిల్లాపై సీఎం కేసీఆర్ స్పెష‌ల్ ఫోక‌స్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాజ‌కీయ వ్యూహాలు ర‌చించ‌డంలో దిట్ట‌. ఆయ‌న తీసుకునే నిర్ణ‌యాల వెనుక భ‌విష్య‌త్ రాజ‌కీయ ప్ర‌ణాళిక‌లు ఉంటాయి. తాజాగా త‌న కూతురు క‌విత‌ను ఎమ్మెల్సీ చేయ‌డం వెనుక కూడా ప‌క్కా రాజ‌కీయ వ్యూహం ఉంది. కవిత‌ను మంత్రివ‌ర్గంలోకి తీసుకుంటార‌ని, కేటీఆర్‌ను ముఖ్య‌మంత్రిని చేసి క‌విత‌ను మంత్రి చేస్తార‌ని, అందుకే ఆమెను ఎమ్మెల్సీ చేశార‌ని ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు జ‌రుగుతున్నాయి. కానీ, వీట‌న్నింటికీ మించి నిజామాబాద్ జిల్లా రాజ‌కీయాలను దృష్టిలో పెట్టుకొనే క‌విత‌ను ఎమ్మెల్సీ చేయాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించిన‌ట్లు క‌నిపిస్తోంది.

నిజామాబాద్ జిల్లాలో ఒక‌ప్పుడు కాంగ్రెస్ పార్టీ బ‌లంగా ఉండేది. టీఆర్ఎస్ ఆవిర్భావం త‌ర్వాత కూడా చాలాకాలం పాటు జిల్లాలో ఆ పార్టీకి ప‌ట్టు దొర‌క‌లేదు. 2014 ఎన్నిక‌ల్లోనే జిల్లా రాజ‌కీయాలు మారిపోయాయి. ఆ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లాలోని మొత్తం తొమ్మిది నియోజ‌క‌వ‌ర్గాల‌ను గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసింది. నిజామాబాద్ ఎంపీగా క‌విత పోటీ చేయ‌డం ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. ఆమెను కూడా ఇక్క‌డి ప్ర‌జ‌లు ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించారు.

ఐదేళ్ల పాటు ఎంపీగా నిజామాబాద్ పార్టీ వ్య‌వ‌హారాలు మొత్తం క‌విత చెప్పిన‌ట్లుగానే జ‌రిగాయి. జిల్లా పార్టీ మొత్తం ఆమె చేతుల్లోనే ఉండేది. అయితే, 2018 ఎన్నిక‌ల్లోనూ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఎనిమిది సీట్లు గెలిచి స‌త్తా చాటింది. కానీ, 2019 పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో మాత్రం ఎంపీగా క‌విత అనూహ్యంగా ఓట‌మిపాల‌య్యారు.

ఇది టీఆర్ఎస్ పార్టీకి, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు భారీ షాక్ లాంటిది. నిజామాబాద్ ఎంపీగా ధ‌ర్మ‌పురి అర్వింద్ విజ‌యం సాధించారు. ఆయ‌న క్ర‌మంగా జిల్లాలో బీజేపీని బ‌లోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. నిజామాబాద్ న‌గ‌రంతో పాటు కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీకి చెప్పుకోద‌గ్గ స్థాయిలో ఓటు బ్యాంకు ఉంది.

దీంతో నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి భ‌విష్య‌త్‌లో బీజేపీ బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థిగా మారుతోంది. బీజేపీ దెబ్బ ఇప్ప‌టికే ఎంపీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఇక్క‌డ రుచి చూసింది. దీంతో బీజేపీకి ఇక్క‌డ చెక్ పెట్టాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు. క‌విత‌కు జాతీయ రాజ‌కీయాల ప‌ట్ల ఆస‌క్తి, అవ‌గాహ‌న ఎక్కువ‌. దీంతో ఆమెను రాజ్య‌స‌భ‌కు పంపిస్తార‌ని అంతా అనుకున్నారు.

కానీ, నిజామాబాద్‌లో టీఆర్ఎస్ బ‌లంగా కొన‌సాగాలంటే, బీజేపీ దూకుడుకు అడ్డుక‌ట్ట వేయాలంటే క‌విత జిల్లా రాజ‌కీయాల్లో కీరోల్ పోషించాల‌ని కేసీఆర్ భావించారు. అందుకే ఆమెను నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీని చేస్తున్నారు. త‌ద్వారా ఆమె మ‌ళ్లీ జిల్లా రాజ‌కీయాల్లో కీరోల్ పోషించ‌బోతున్నారు.

ఇప్ప‌టికే మెద‌క్ జిల్లాలో మంత్రి హ‌రీష్‌రావు కీల‌క నేత‌గా ఉన్నారు. మెద‌క్ జిల్లా పార్టీ బాధ్య‌త‌లు మొత్తం ఆయ‌నే చూసుకుంటున్నారు. ఎన్నిక‌లు ఏవైనా జిల్లాలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని గెలిపించే బాధ్య‌త ఆయ‌నే తీసుకుంటున్నారు. జిల్లా నుంచే ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్నారు.

దీంతో మెద‌క్ జిల్లాలో టీఆర్ఎస్ బలంగా ఉంటోంది. క‌రీంన‌గ‌ర్‌లో కేటీఆర్, ఈటెల రాజేంద‌ర్ కీల‌క నేత‌లుగా ఉన్నారు. వీరే జిల్లా పార్టీ వ్య‌వ‌హారాలు చూసుకుంటున్నారు. మెద‌క్‌, క‌రీంన‌గ‌ర్‌లానే నిజామాబాద్‌లోనూ కేసీఆర్ కుటుంబానికే చెందిన క‌విత ఉంటే పార్టీ బ‌లంగా ఉంటుంద‌నే ఆలోచ‌న‌తోనే ఆమెను మ‌ళ్లీ జిల్లా రాజ‌కీయాల్లోకి దింపారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle