newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆ ఎమ్మెల్యే దూకుడు టీఆర్ఎస్‌కు త‌ల‌నొప్పిగా మారిందా?

22-08-202022-08-2020 07:59:04 IST
Updated On 22-08-2020 08:44:01 ISTUpdated On 22-08-20202020-08-22T02:29:04.036Z22-08-2020 2020-08-22T02:29:01.037Z - 2020-08-22T03:14:01.054Z - 22-08-2020

ఆ ఎమ్మెల్యే దూకుడు టీఆర్ఎస్‌కు త‌ల‌నొప్పిగా మారిందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ప్ర‌భుత్వం - గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య గ్యాప్ పెరుగుతోంది. క‌రోనా వైర‌స్ విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వానికి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై చేసిన సూచ‌న‌లే ఇందుకు కార‌ణ‌మ‌వుతున్నాయి. ఆమె సూచ‌న‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకొని అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించిన ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ సోష‌ల్ మీడియా శ్రేణుల వ‌ల్ల ప్ర‌భుత్వం ఇబ్బంది ప‌డుతుంది. ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌, బీజేపీలు గ‌వర్న‌ర్‌కు మ‌ద్ద‌తుగా రంగంలోకి దిగ‌డంతో ఇప్పుడు ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పులు ఎదుర‌వుతున్నాయి.

తెలంగాణ‌లో గ‌వ‌ర్న‌ర్‌గా న‌ర‌సింహ‌న్ ఉన్న‌ప్పుడు కేసీఆర్ ప్ర‌భుత్వ పాల‌న‌కు ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కాదు. రాష్ట్ర ప్ర‌భుత్వ విధుల్లో ఆయ‌న జోక్యం అస్స‌లు ఉండ‌క‌పోయేది. అలా న‌ర‌సింహ‌న్ ఉన్నంత‌కాలం గ‌వ‌ర్న‌ర్ - రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ధ్య స‌ఖ్య‌త‌తో పాల‌న మొత్తం సాఫీగా సాగిపోయింది.

అయితే, న‌ర‌సింహ‌న్ రాజ‌కీయాల‌తో సంబంధం లేని వ్య‌క్తి. ఆయ‌న త‌ర్వాత త‌మిళ‌సైను తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా కేంద్రం నియ‌మించిన‌ప్పుడు కేసీఆర్ ప్ర‌భుత్వానికి చిక్కులు త‌ప్ప‌వ‌ని అంతా విశ్లేషించారు. త‌మిళిసై బీజేపీ నాయ‌కురాలిగా ప‌ని చేయ‌డ‌మే ఇందుకు కార‌ణం.

కానీ, మొద‌ట్లో అంద‌రూ అనుకున్న‌ట్లుగా ఆమె ఏమీ కేసీఆర్ పాల‌నా వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకోవ‌డం, ఇబ్బంది పెట్ట‌డం చేయ‌లేదు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా గ‌వ‌ర్న‌ర్‌తో ప్ర‌భుత్వానికి స‌ఖ్య‌త ఉండేలానే జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. దీంతో త‌మిళిసై రాక‌తో ఏదో అవుతుంది అనుకున్న బీజేపీ, కాంగ్రెస్ అంచ‌నాలు త‌ప్పాయి.

కానీ, రానురాను ప‌రిస్థితిలో మార్పు వ‌చ్చింది. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై స్వ‌యానా డాక్ట‌ర్‌. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ఆమెలొని డాక్ట‌ర్ వృత్తి బ‌య‌ట‌కు వ‌చ్చింది. వైర‌స్ వ్యాప్తి, టెస్టులు, ప్ర‌భావం, నివార‌ణ వంటి అన్ని అంశాల‌పై త‌మిళిసైకు స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న ఉంది.

దీంతో ఆమె ఈ విష‌యంలో కొంత చొర‌వ తీసుకుంటున్నారు. క‌రోనా వైర‌స్‌పై ప్ర‌భుత్వానికి ఎప్ప‌టిక‌ప్పుడు ప‌లు సూచ‌న‌లు చేస్తున్నారు. వీటిలో ప్ర‌భుత్వం కొన్నింటిని ప‌ట్టించుకుంటుండ‌గా, మ‌రికొన్ని ప‌ట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తోంది. దీంతో గ‌వ‌ర్న‌ర్ కూడా రాష్ట్ర ప్ర‌భుత్వ వ్య‌వ‌హార శైలిపై అసంతృప్తిగా ఉన్నార‌నే ప్ర‌చారం జ‌రిగింది. దీంతో నేరుగానే ఆమె రంగంలోకి దిగారు. క‌రోనా నియంత్ర‌ణ‌, చికిత్స‌పైన ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శిని రాజ్ భ‌వ‌న్‌కు పిలిపించి మాట్లాడి ప‌లు సూచ‌న‌లు చేశారు.

నేరుగా ఆమెనే కోవిడ్ ట్రీట్‌మెంట్ చేస్తున్న ఆసుప‌త్రుల‌ను స్వ‌యంగా ప‌రిశీలించి కోవిడ్ పేషెంట్లు, డాక్ట‌ర్ల‌తో మాట్లాడి ధైర్యాన్ని నింపే ప్ర‌య‌త్నం చేశారు. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుప‌త్రుల్లో క‌రోనా పేషెంట్ల నిలువుదోపిడిపై త‌న దృష్టికి రాగానే స్పందించారు. ఇలా అనేక విధాలుగా క‌రోనా వైర‌స్‌పైన గ‌వ‌ర్న‌ర్ స్వ‌యంగా స్పందిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం టెస్టులు ఎక్కువ చేయాల‌ని ఆమె సూచించారు. నిజానికి, ఇదే మాట హైకోర్టు, కేంద్ర ప్ర‌భుత్వాలు క‌నీసం ఇర‌వై సార్లు చెప్పాయి.

అయితే, గ‌వ‌ర్న‌ర్ చేసిన వ్యాఖ్య‌లు మాత్రం టీఆర్ఎస్ వారికి ఆగ్ర‌హం తెప్పించాయి. కానీ, టీఆర్ఎస్ పెద్ద‌లు ఈ విష‌యంపై స్పందించ‌లేదు. గ‌వ‌ర్న‌ర్ వ్యాఖ్య‌ల‌పై స్పందించ‌డం ద్వారా ఈ విష‌యానికి అన‌వ‌స‌ర ప్రాధాన్య‌త ఏర్ప‌డుతుంద‌ని, గ‌వ‌ర్న‌ర్‌తో ప్ర‌భుత్వానికి విభేదాలు ఉన్నాయ‌నే భావ‌న ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం మంచిది కాద‌ని టీఆర్ఎస్ భావిస్తోంది. అన్నింటికీ మించి గ‌వ‌ర్న‌ర్‌తో స‌ఖ్య‌త‌గా ఉండ‌ట‌మే మంచిద‌ని టీఆర్ఎస్ ఆలోచ‌న‌. కానీ, టీఆర్ఎస్‌కు చెందిన హుజుర్‌న‌గ‌ర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అత్యుత్సాహంతో వ్య‌వ‌హ‌రించారు.

గ‌వ‌ర్న‌ర్ వ్యాఖ్య‌ల‌ను విమ‌ర్శిస్తూ ఆయ‌న ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ వారు కొంద‌రు సోష‌ల్ మీడియా వేదిక‌గా గ‌వ‌ర్న‌ర్‌పై విమ‌ర్శ‌లు చేశారు. ఇవి ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌, బీజేపీకి అవ‌కాశంగా మారాయి. నిజానికి ఒక మంత్రి స్థాయి వ్య‌క్తి లేదా ప్ర‌భుత్వ పెద్దలు ఇలా మాట్లాడితే దానికి ప్రాధాన్య‌త ఉంటుంది. కానీ, ఒక ఎమ్మెల్యే, కొంద‌రు సోష‌ల్ మీడియాలో చేసిన వ్యాఖ్య‌ల‌కు అంత విలువ ఉండ‌దు. అదే టీఆర్ఎస్ విధానం అని చెప్పేందుకు కూడా వీలు ఉండ‌దు.

కానీ, ప్ర‌తిప‌క్షాలు మాత్రం ఈ వ్యాఖ్య‌ల‌ను ఉప‌యోగించుకుంటున్నాయి. దీంతో గ‌వ‌ర్న‌ర్‌నే అంటారా ? మ‌ంచి చెబితే గ‌వ‌ర్న‌ర్‌నే విమ‌ర్శిస్తారా ? అంటూ ప్ర‌శ్న‌లు, విమ‌ర్శ‌లు మొద‌లుపెట్టాయి. ప్ర‌భుత్వం ఏదైతే గ‌వ‌ర్న‌ర్‌తో విభేదాలు ఉన్నాయ‌నే భావ‌న ప్ర‌జ‌ల్లోకి వెళ్లొద్ద‌ని భావించిందో ఇప్పుడు అదే జ‌రుగుతోంది.

ఇది ఇంకా కొన‌సాగ‌డం కూడా మంచిది కాద‌ని టీఆర్ఎస్ పెద్ద‌లు భావిస్తున్నారు. గ‌వ‌ర్న‌ర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి చేసిన ట్వీట్‌ను డిలీట్ చేశారు. టీఆర్ఎస్ శ్రేణులు కూడా సోష‌ల్ మీడియాలో సైలెంట్ అయ్యాయి. మ‌రి, గ‌వ‌ర్న‌ర్ నెక్ట్స్ స్టెప్ ఏంటో, ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   13 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   14 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   14 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   18 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   19 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   17 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   19 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   20 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   15 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   a day ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle