newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

ఆ ఎంపీల‌కు ఇజ్జ‌త్ కా స‌వాల్‌..!

06-01-202006-01-2020 07:32:53 IST
Updated On 06-01-2020 12:40:02 ISTUpdated On 06-01-20202020-01-06T02:02:53.532Z06-01-2020 2020-01-06T02:02:46.780Z - 2020-01-06T07:10:02.944Z - 06-01-2020

ఆ ఎంపీల‌కు ఇజ్జ‌త్ కా స‌వాల్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ మున్సిప‌ల్ ఎన్నిక‌లు బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల‌కు ఇజ్జ‌త్ కా స‌వాల్‌గా మారాయి. త‌మ పార్ల‌మెంటు ప‌రిధిలోని కార్పొరేష‌న్‌, మున్సిపాలిటీల్లో త‌మ పార్టీల‌ను గెలిపించుకునే బాధ్య‌త ఇప్పుడు వారిపైనే ప‌డింది.

దీంతో కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీలు మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకొని ప‌ని చేస్తున్నారు. ఎంపీలంతా కీల‌క నేతలు కావ‌డం, బీజేపీలో, కాంగ్రెస్‌లో రాష్ట్ర పార్టీ ప‌గ్గాల కోసం ప్ర‌య‌త్నిస్తుండ‌టంతో మున్సిప‌ల్ ఎన్నిక‌లు వారికి కీల‌కంగా మారాయి.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ హ‌వా వీచినా పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణ‌లో బ‌లం చాటుకున్నాయి. పార్టీల కంటే అభ్య‌ర్థుల వ్య‌క్తిగ‌త ఇమేజ్ ఈ ఎన్నిక‌ల్లో ఎక్కువ‌గా ప‌ని చేయ‌డంతో రెండు పార్టీల నుంచి కీల‌క నేత‌లు విజ‌యం సాధించారు.

దీంతో బీజేపీ నాలుగు సీట్లు, కాంగ్రెస్ మూడు సీట్ల‌ను గెలుచుకుంది. బీజేపీ ఎంపీల్లో కిష‌న్‌రెడ్డి కేంద్ర మంత్రి కాగా, బండి సంజ‌య్‌, ధ‌ర్మ‌పురి అర్వింద్ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. పైగా నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల‌లో బీజేపీని గెలిపించుకోవ‌డం వీరిద్ద‌రికీ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మారింది. ఈ రెండు పెద్ద కార్పొరేష‌న్ల‌లో టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ అన్న‌ట్లుగా ప‌రిస్థితి ఉంది.

ఈ రెండు కార్పొరేష‌న్ల‌ను మ‌ళ్లీ గెలుచుకొని ఇద్ద‌రు బీజేపీ ఎంపీల దూకుడుకు అడ్డుక‌ట్ట వేయాల‌ని టీఆర్ఎస్ కంక‌ణం క‌ట్టుకుంది. వీటితో పాటు నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్ లోక‌స‌భ స్థానాల ప‌రిధిలో ఉన్న అన్ని మున్సిప‌పాలిటీల్లో పార్టీని గెలిపించే బాధ్య‌త‌ను ఈ ఇద్ద‌రు ఎంపీలు తీసుకొని ప‌ని చేస్తున్నారు.

ఇక‌, కిష‌న్ రెడ్డి కూడా హైద‌రాబాద్ శివారుల్లోని మున్సిప‌ల్ కార్పొరేష‌న్లు, మున్సిపాలిటీల ఎన్నిక‌ల బాధ్య‌త‌ల‌ను తీసుకోబోతున్నారు. ఇక‌, కాంగ్రెస్ ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి కూడా మున్సిప‌ల్ ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి.

హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో ఓట‌మితో ఢీలా ప‌డ్డ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చి మ‌రోసారి త‌న ప‌ట్టు నిలుపుకోవాల‌ని భావిస్తున్నారు. న‌ల్గొండ పార్ల‌మెంటు ప‌రిధికి మాత్ర‌మే ప‌రిమిత‌మై ఆయ‌న ఎన్నిక‌ల‌కు పార్టీని స‌న్న‌ద్ధం చేస్తున్నారు.

పీసీసీ పీఠంపై క‌న్నేసిన రేవంత్ రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డికి కూడా మున్సిప‌ల్ ఎన్నిక‌లు కీల‌కంగా మారాయి. రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంటు ప‌రిధిలోనే ఎక్కువ మున్సిప‌ల్ కార్పొరేష‌న్లు, మున్సిపాలిటీలు ఉండ‌టంతో ఆయ‌న పూర్తిగా వీటిపైనే దృష్టి పెట్టారు.

కోమ‌టిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం భువ‌న‌గిరి పార్ల‌మెంటు ప‌రిధిలోని నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని మున్సిపాలిటీల‌తో పాటు న‌ల్గొండ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్‌ను గెలిపించే బాధ్య‌త‌ల‌ను త‌ల‌కెత్తుకున్నారు.

కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీలు అంతా త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌కే ప‌రిమితం అవుతున్నారు. అయితే, రాష్ట్ర‌వ్యాప్తంగా ఇమేజ్ ఉన్న వీరు అన్ని మున్సిపాలిటీల్లో ప్ర‌చారం చేయ‌కుండా కేవ‌లం వారి నియోజ‌క‌వ‌ర్గాల‌కే ప‌రిమితం అవ‌డం స‌రికాద‌ని కొంద‌రు నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మొత్తానికి త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎక్కువ స్థానాల‌ను గెలిపించుకొని త‌మ స‌త్తా మ‌రోసారి చాటుకోవాల‌ని కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీలు బాగానే క‌ష్ట‌ప‌డుతున్నారు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle