newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆ ఊరికి క‌లెక్ట‌ర‌మ్మ పేరు.. రుణం తీర్చుకున్న గ్రామ‌స్థులు

14-06-202014-06-2020 08:57:04 IST
Updated On 14-06-2020 10:32:12 ISTUpdated On 14-06-20202020-06-14T03:27:04.114Z14-06-2020 2020-06-14T03:26:22.328Z - 2020-06-14T05:02:12.193Z - 14-06-2020

ఆ ఊరికి క‌లెక్ట‌ర‌మ్మ పేరు.. రుణం తీర్చుకున్న గ్రామ‌స్థులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్ర‌జ‌ల క‌ష్టాలు తీర్చిన అధికారుల‌ను ఆ ప్ర‌జ‌లు ఎప్ప‌టికీ మ‌రిచిపోరు. త‌న జీవితం మొత్తం పేద‌ల కోసం ప‌ని చేసిన దివంగ‌త ఐఏఎస్ అధికారి ఎస్ఆర్ శంక‌ర‌న్‌కు ప్ర‌జ‌లు విగ్ర‌హాలు పెట్టి మ‌రీ ఇప్ప‌టికీ ఆయ‌న సేవ‌ల‌ను గుర్తు చేసుకుంటున్నారు. ఇటువంటి ఒక ఉదాహ‌ర‌ణే ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. త‌మ క‌ష్టాలు తీర్చిన క‌లెక్ట‌ర్ బ‌దిలీ అయి వెళ్లిపోయినా ఆమె త‌మకు చేసిన మేలును గుర్తు చేసుకుంటున్నారు ఓ గ్రామ వాసులు. ఏకంగా త‌మ గ్రామానికి క‌లెక్ట‌ర్ పేరు పెట్టి మ‌రీ ఆమెను గౌర‌వించుకుంటున్నారు. ఆ అధికారి దివ్య దేవ‌రాజన్‌. ప్ర‌స్తుతం ఆమె స్త్రీ, శిశు సంక్షేమ శాఖ క‌మిష‌న‌ర్‌గా విధులు నిర్వ‌హిస్తున్నారు.

2010 బ్యాచ్‌కు చెందిన దివ్య దేవ‌రాజ‌న్ స్వ‌స్థ‌లం త‌మిళ‌నాడు. ఆమె తాత సాధార‌ణ రైతు. ఒక రైతు వ్య‌వ‌సాయం చేయ‌డానికి క‌ష్ట‌ప‌డే విధానం, అప్పులు, బ్యాంకు లోన్లు వంటి రైతు క‌ష్టాల‌న్నీ చూస్తూ ఆమె పెరిగారు. చిన్న‌నాటి నుంచి చ‌దువుల్లో ముందుండే ఆమె బిట్స్ పిలానీలో ప‌ట్ట‌భ‌ద్రుల‌య్యారు. ప్ర‌జ‌ల‌కు క‌ష్టాలు తీర్చాలంటే క‌లెక్ట‌ర్ కావాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న ఆమె 2010లో సివిల్స్‌లో ఆలిండియా 37వ ర్యాంక‌ర్‌గా నిలిచారు. మొద‌ట ఖ‌మ్మం జాయింట్ క‌లెక్ట‌ర్‌గా ప‌ని చేశారు. తెలంగాణ ప్ర‌భుత్వం కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేసిన త‌ర్వాత ఆమెకు ప్ర‌భుత్వం వికారాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్‌గా పోస్టింగ్ ఇచ్చింది.

వికారాబాద్‌లోనే ఆమె త‌న‌దైన ముద్ర వేసుకున్నారు. ఓ గ్రామాన్ని ద‌త్త‌త తీసుకొని ఆ గ్రామం రూపురేఖ‌లే మార్చేశారు. ఆమె ప‌నితీరును ప్ర‌భుత్వం గుర్తించింది. 2017 చివ‌రలో ఆదిలాబాద్ జిల్లాలో ఎస్టీ తెగ‌ల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. రెండు వ‌ర్గాలు గ్రామాల్లో పెద్ద ఎత్తున ప‌ర‌స్ప‌రం దాడుల‌కు దిగుతున్నారు. ఇటువంటి ప‌రిస్థితుల్లో రెండు వ‌ర్గాల ప్ర‌జ‌ల మ‌ధ్య శాంతియుత వాతావ‌ర‌ణం క‌ల్పించాల‌ని భావించిన ప్ర‌భుత్వం దివ్య దేవ‌రాజ‌న్‌పై న‌మ్మ‌కంతో 2017 డిసెంబ‌ర్ 18న ఆదిలాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్‌గా నియ‌మించింది. గిరిజ‌నులు ఎక్కువ‌గా నివ‌సించే ఈ జిల్లాలో దివ్య దేవ‌రాజ‌న్ త‌న‌దైన ముద్ర వేశారు.

క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు తీసుకున్న వెంట‌నే రంగంలోకి దిగి ఘ‌ర్ష‌ణ‌లు ప‌డుతున్న రెండు వ‌ర్గాల వారితో చ‌ర్చ‌లు జ‌రిపి శాంతియుత వాతావ‌ర‌ణ ఏర్ప‌డేలా చొర‌వ తీసుకున్నారు. ఆమె కృషి ఫ‌లితంగా జిల్లాలో గొడ‌వ‌లు త‌గ్గిపోయాయి. అధికార ద‌ర్పానికి దివ్య దేవ‌రాజ‌న్ చాలా దూరంగా ఉంటారు. చిన్న పిల్ల‌ల మ‌న‌స్సులు అర్థం చేసుకోవాలంటే మ‌న‌మూ చిన్న పిల్ల‌ల్లా ఆలోచించాలి అంటుంటారు. దివ్య దేవ‌రాజ‌న్ కూడా ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు. ఆదిలాబాద్ జిల్లాల్లో క‌నీస మౌళిక స‌దుపాయాల‌కు కూడా నోచుకోకుండా ఆడ‌వుల్లో, కొండ‌ల్లో జీవించే గోండుల స‌మ‌స్య‌ల‌ను ఆమె ప‌రిష్క‌రించేందుకు చాలా కృషి చేశారు.

Sanjay Jaju on Twitter: "Collector Adilabad Divya Devarajan has ...

ఆమె గోండు గూడాల్లో ప‌ర్య‌టించారు. క‌నీసం రోడ్లు కూడా లేని ఆ గ్రామాల‌కు అప్ప‌టివ‌ర‌కు ఒక క‌లెక్ట‌ర్ వెళ్లిన చ‌రిత్ర‌నే లేదు. అయితే, ఆమె గిరిజ‌నుల స‌మ‌స్య‌లు తీసుకునేందుకు వెళ్లినా గిరిజ‌నులు మాత్రం ఆమెతో స్వేచ్ఛ‌గా మాట్లాడే వారు కాదు. ఎందుకు ఇలా జ‌రుగుతుంద‌ని ఆలోచించినా ఆమె భాష స‌మ‌స్య ఉంద‌ని గ్రహించింది.

అంత‌కుముందు ఈ జిల్లాలో ప‌ని చేసిన క‌లెక్ట‌ర్లు గోండు భాష నేర్చుకునే ప్ర‌య‌త్నం చేసి మ‌ధ్య‌లో వ‌దిలేశారు. కానీ, దివ్య మాత్రం క‌ఠిన‌మైన ఈ భాష‌ను పూర్తిగా నేర్చుకున్నారు. గోండుల సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను సైతం పూర్తిగా తెలుసుకున్నారు. దీంతో ఆమె గిరిజ‌నుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. ఆమెనే స్వ‌యంగా వెళ్లి గోండు భాష‌లో మాట్లాడుతుంటే వారు స్వేచ్ఛ‌గా ఆమెకు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకునే వారు.

ఆమె ఎంత‌లా అక్క‌డి గిరిజ‌నుల‌తో క‌లిసి పోయారంటే గిరిజ‌నుల‌తో క‌లిసి వారి సంప్ర‌దాయ నృత్యం కూడా వేసేవారు. గిరిజ‌నుల‌కు కావాల్సిన మౌళిక స‌దుపాయాల‌ను క‌ల్పించేందుకు ఆమె చాలా కృషి చేశారు. వారి స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపించాల‌ని త‌పించారు. ఆమె స్థాయిలో ఈ ప‌నిని ఆమె పూర్తి చేశారు.

చించుఘాట్ అనే ఓ గిరిజ‌న గ్రామం వ‌ర‌ద ముంపు ప్రాంతం. ప‌క్క‌నే ఉండే వాగులో వ‌ర‌ద వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఈ గ్రామంలోని ఇళ్ల‌లోకి నీరు చేరేది. ఈ విష‌యాన్ని తెలుసుకున్న దివ్య ప‌క్క‌నే ఐదు ఎక‌రాల స్థ‌లాన్ని ఈ గ్రామ‌స్థులు శాశ్వ‌తంగా ఇళ్లు క‌ట్టుకోవ‌డానికి కేటాయించారు. దీంతో గ్రామ‌స్థుల‌కు ముంపు ముప్పు త‌ప్పింది.

దివ్య దేవ‌రాజ‌న్ వ‌ల్ల‌నే త‌మ స‌మ‌స్య ప‌రిష్కార‌మైనందున ఆమెను ఎప్ప‌టికీ గుర్తించుకునేలా కొత్త‌గా ఏర్పడిన ఈ గ్రామానికి దివ్య‌గూడ‌కు గ్రామ‌స్థులు నామ‌క‌ర‌ణం చేసుకున్నారంటే ఆమె వారికి ఎంత‌లా మేలు చేసిందో, మేలు చేసిన అధికారుల‌ను ప్ర‌జ‌లు ఎంత‌లా గుర్తుంచుకుంటారో అర్థం అవుతుంది. ప్ర‌స్తుతం ఆమె జిల్లాలో క‌లెక్ట‌ర్‌గా లేకున్నా ఆమె పేరును త‌మ గ్రామానికి పెట్టుకొని రుణం తీర్చుకున్నారు. ఈ ఫిబ్ర‌వ‌రిలో ఆమెను తెలంగాణ ప్ర‌భుత్వం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ క‌మిష‌న‌ర్‌గా నియ‌మించింది. 

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle