newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

ఆ ఇద్దరికే ఛాన్స్... రేసునుంచి రేవంత్ ఔటేనా?

02-03-202002-03-2020 08:04:01 IST
Updated On 02-03-2020 13:28:48 ISTUpdated On 02-03-20202020-03-02T02:34:01.602Z02-03-2020 2020-03-02T02:33:55.956Z - 2020-03-02T07:58:48.858Z - 02-03-2020

ఆ ఇద్దరికే ఛాన్స్... రేసునుంచి రేవంత్ ఔటేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడి ఎంపిక నేడో, రేపో జ‌రుగుతుంద‌నే వార్త‌లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్ పీసీసీ అధ్య‌క్షుడిని నియ‌మించిన కాంగ్రెస్ అధిష్ఠానం త్వ‌ర‌లో తెలంగాణ‌కు కూడా నియ‌మించేందుకు క‌స‌ర‌త్తు చేసింది. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కూడా తాను ఈ ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటాన‌ని తేల్చేయ‌డంతో పీసీసీ కొత్త అధ్య‌క్షుడి నియామ‌కానికి సంబంధించి జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది.

పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి కోసం సుమారు ఏడెనిమిది మంది నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే, నేత‌లు అభిప్రాయాలు, అనేక స‌మీక‌ర‌ణాలు బేరీజు వెసుకున్నాక మ‌ల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, మంథ‌ని ఎమ్మెల్యే శ్రీధ‌ర్‌బాబు మ‌ధ్యే ప్ర‌ధాన పోటీ ఉన్న‌ట్లు తెలుస్తోంది. వీరు ముగ్గురిలోనే ఒక‌రికి పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ద‌క్కుతుంద‌నే ప్ర‌చారం పార్టీలో సాగుతోంది.

ఇంత‌లో గోప‌న్నపల్లి భూఆక్ర‌మ‌ణ వ్య‌వ‌హారం తెర‌మీద‌కు రావ‌డం, పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి కోసం ప్ర‌య‌త్నిస్తున్న రేవంత్ రెడ్డిపై ఆరోప‌ణ‌లు రావ‌డం ఆయ‌న‌కు మైన‌స్‌గా మారింది. ఇప్ప‌టికే రేవంత్‌రెడ్డికి పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ఇవ్వొద్ద‌ని పార్టీలోని కొంద‌రు సీనియ‌ర్లు అధిష్ఠానానికి చెబుతూ వ‌స్తున్నారు. కొంద‌రైతే రేవంత్‌రెడ్డి త‌ప్ప ఎవ‌రికి ఇచ్చినా ఓకే అన్న‌ట్లు ప్ర‌చారం ఉంది. ఇందుకు గ‌తంలో ఆయ‌న‌పై న‌మోదైన ఓటుకు నోటు కేసును చూపించారు.

అయినా కూడా రేవంత్ రెడ్డి పీసీసీ రేసులో ఉన్నారు. ఇంత‌లో గోప‌ల్‌ప‌ల్లి భూఆక్ర‌మ‌ణ‌ల ఆరోప‌ణ‌లు రావ‌డం ఆయ‌న‌కు మైన‌స్‌గా మారింది. ఆయ‌న‌కు పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి రాకుండా అడ్డుకుంటున్న నేత‌లు కొంద‌రు ఈ విష‌యాన్ని అధిష్ఠానం దృష్టికి కూడా తీసుకెళ్లిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

అయితే, రేవంత్ రెడ్డి మాత్రం ప్ర‌భుత్వంపై తాను ఎక్కువ‌గా కొట్లాడుతున్నందుకే త‌న‌పై కేసులు పెడుతున్నార‌ని, అధిష్ఠానానికి కూడా ఈ విష‌యం తెలుస‌ని అంటున్నారు.

అయితే, ఉన్న‌ట్లుండి ఇప్పుడే ఈ భూఆక్ర‌మ‌ణ‌ల వ్య‌వ‌హారాన్ని ప్ర‌భుత్వం తెర‌పైకి తెచ్చిందా అని రేవంత్ రెడ్డి అనుచ‌రులు భావిస్తున్నారు. త‌మ నేత‌కు పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ద‌క్క‌కుండా టీఆర్ఎస్ వ్యూహాత్మ‌కంగా ఈ ఆరోప‌ణ‌లు చేయిస్తుంద‌ని చెబుతున్నారు. మిగ‌తా అంద‌రు కాంగ్రెస్ నేత‌ల‌ను టీఆర్ఎస్ ప్ర‌త్య‌ర్థులుగా భావిస్తుంది.

కానీ, రేవంత్‌రెడ్డిని మాత్రం శ‌త్రువుగా చూస్తుంది. అందుకే రేవంత్‌రెడ్డికి చెక్ పెట్టేందుకే ఈ కేసులు ఇప్పుడు తెర‌పైకి తెచ్చార‌ని అంటున్నారు. ఏదేమైనా ఈ కేసుల వ్య‌వ‌హారం రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌విని దూరం చేసే ప‌రిస్థితి తీసుకొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది.

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   4 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   6 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   9 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   10 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   11 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   12 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   12 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   13 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   13 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   13 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle