ఆ ఇద్దరికే అవకాశం... కేసీయార్ మార్క్ రాజకీయం
11-03-202011-03-2020 08:04:07 IST
Updated On 11-03-2020 11:50:45 ISTUpdated On 11-03-20202020-03-11T02:34:07.375Z11-03-2020 2020-03-11T02:33:48.819Z - 2020-03-11T06:20:45.525Z - 11-03-2020

తెలంగాణలో రెండు రాజ్యసభ సీట్ల కోసం సీయం కేసీయార్ ఇద్దరికి అవకాశం ఇచ్చారు. ఎప్పటినుంచో పార్టీని నమ్ముకుంటున్న వారికి కాకుండా పాతకాపులకే అదృష్ణం దక్కింది. అందులో ఒకరు ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా వున్న కె.కేశవరావు కాగా, మరొకరు వైసీపీ నుంచి 2014 ఎన్నికల్లో గెలిచి తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్ర కోటాలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. పార్టీ తరఫున పలువురు నేతలు రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశించినా చివరకు ఈ ఇద్దరు నేతలకు కేసీఆర్ అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. నిజామాబాద్ మాజీ ఎంపీలు కవిత, ప్రొఫెసర్ సీతారాం నాయక్, మందా జగన్నాథం రాజ్యసభ ఆభ్యర్థిత్వాన్ని ఆశించారు. వీరే కాకుండా దామోదర్‌రావు, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, హెటిరో సంస్థల అధినేత పార్థసారథిరెడ్డి పేర్లను కూడా సీఎం పరిశీలించారు. అయితే వివిధ సమీకరణాలను, పార్టీ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్న కేసీయార్ చివరాఖరికి కేకే, పొంగులేటి అభ్యర్థిత్వం వైపు కేసీఆర్ మొగ్గు చూపారు. ఈ నెల 13న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నామినేషన్‌కు తుది గడువు ఉండటంతో రాజ్యసభ అభ్యర్థుల పేర్లను బుధవారం ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు శాసనమండలి నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా అభ్యర్థిగా అసెంబ్లీ మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, గవర్నర్ కోటా అభ్యర్థిగా సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ పేర్లను సైతం సీఎం ఖరారు చేశారు. ఈ నెల 12న మండలి నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా స్థానానికి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. రాజ్యసభ హడావిడి ప్రారంభం అయినప్పుడే ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో కేసీఆర్ డైలమాలో పడ్డారు. తొలుత కే.కేశవరావు కు లైన్ క్లియర్ చేశారు. రెండవ అభ్యర్ధి కోసం ఒకానొక సందర్భంలో కవిత పేరు కూడా పరిశీలించారు. అయితే కవితను రాజ్యసభకు పంపడం కంటే శాసనమండలికి పంపాలని భావిస్తున్నారని తెలుస్తోంది. దీంతో రెండవ అభ్యర్ధిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఛాన్స్ కొట్టేశారు.సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని ఎస్సీ,ఎస్టీ వర్గాల వారికి ప్రాధాన్యం ఇవ్వాలని కూడా కేసీయార్ భావించారు. కానీ ఇద్దరినే ఎంపిక చేయాల్సి వచ్చిందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రాజ్యసభ సీటుకోసం మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి ఎదురుచూశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సురేష్ రెడ్డికి కీలక పదవి దక్కుతుందని..టీఆర్ఎస్ అధినేత జిల్లాలో జరిగిన ప్రచార సభలో చెప్పారు. దీంతో అందరూ ఆయనకు మండలి ఛైర్మన్ వస్తుందనుకున్నారు. కానీ అది కాస్తా గుత్తా సుఖేందర్ రెడ్డిని వరించింది. అది కాకుంటే రాజ్యసభ పక్కా అనుకున్నారు. కాని అది కూడా దక్కలేదు. సురేష్ రెడ్డి అనుచరులు తమనేతకు పదవి ఎప్పుడొస్తుందని ఆశగా ఎదురుచూస్తుంటే... ఇప్పుడు ఎమ్మెల్సీ సీటు రానుంది.

తిరుపతిలో ఇవాళ అమ్మవారి కటాక్షమే పార్టీలకు ఇంపార్టెంట్
13 minutes ago

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
an hour ago

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
15 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
11 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
13 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
15 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
18 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
19 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
21 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
a day ago
ఇంకా