newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆస్పత్రుల్లో పడకలు భారీగా ఖాళీ.. ప్రజల్లో భయం పోయిందా

23-09-202023-09-2020 13:14:19 IST
2020-09-23T07:44:19.809Z23-09-2020 2020-09-23T07:44:15.409Z - - 22-04-2021

ఆస్పత్రుల్లో పడకలు భారీగా ఖాళీ.. ప్రజల్లో భయం పోయిందా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందో లేదో స్పష్టం కాలేదు కానీ, కరోనా చికిత్స చేసే సాధారణ పడకల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు కేవలం ఆక్సిజన్, ఐసీయూ పడకలపైనే ప్రత్యేకంగా దృష్టి సారించడం గమనార్హం. 

గతంలో కరోనా పాజిటివ్‌ వస్తే చాలు బాధితులు ఉరుకులు పరుగుల మీద ఆసుపత్రులకు వచ్చేవారు. వైరస్‌ తీవ్రత ఉన్నా లేకున్నా భయంతో చేరేవారు. లక్షణాలు లేకపోయినా పాజిటివ్‌ తేలితే ఆసుపత్రులకు వచ్చి సాధారణ పడకల్లో ఉంటూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందేవారు. వారికి ఆసుపత్రులు సాధారణ వైద్యం చేసి 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి పంపేవి. 

కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కరోనా అంటే భయం పోయిందా అనే లాగా ప్రజలు హోం క్వారంటైన్‌కే ప్రాధాన్యమిస్తున్నారు. సాధారణ లక్షణాలుంటే ఇళ్లలోనే ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులకు వచ్చే సాధారణ రోగుల సంఖ్య తగ్గుతోంది. కేవలం ఆక్సిజన్‌ లేదా ఐసీయూ అవసరమైన రోగులు మాత్రమే ఆసుపత్రికి వస్తున్నట్లు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం ప్రతినిధి ఒకరు తెలిపారు. 

ఇప్పటివరకు కరోనా సాధారణ పడకలుగా ఉన్నవాటిలో కొన్నింటిని ఇతర వైద్య సేవల కోసం కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఇది మంచి పరిణామమేనని, ప్రజల్లో కరోనాపై అవగాహన పెరగడం, తక్షణమే వైద్యం తీసుకోవడంతో ఆసుపత్రులకు రావాల్సిన అవసరం ఏర్పడటం లేదని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో బెడ్ల కోసం వెతుకులాడే పరిస్థితి పోయిందని ఆయన చెబుతున్నారు.  

రాష్ట్రంలో ఈ నెల 10వ తేదీన 42 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2,055 కరోనా రెగ్యులర్‌ (సాధారణ) పడకలున్నాయి. వాటిల్లో 821 పడకలు నిండిపోగా, 1,234 ఖాళీగా ఉన్నాయి. అయితే సెప్టెంబర్ 21వ తేదీ నాటికి 62 ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ పడకల సంఖ్య ఏకంగా 1,689కి పడిపోగా, వాటిల్లో సాధారణ రోగుల సంఖ్య కూడా 501కి పడిపోయింది. అంటే పది రోజుల కాలంలో ప్రభుత్వ ఆసుపత్రుల సంఖ్య పెరిగినా సాధారణ పడకలు 366 తగ్గాయి. 

అలాగే ఈ నెల 10న 199 ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో సాధారణ పడకల సంఖ్య 3,779 ఉండగా, వాటిల్లో 1,439 నిండిపోయాయి. ఇంకా 2,340 మిగిలిపోయాయి. తాజాగా 222 ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 2,716 సాధారణ కరోనా పడకలుండగా, వాటిల్లో 995 నిండిపోయాయి. అంటే ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కరోనా సాధారణ పడకల సంఖ్య ఈ పది రోజుల్లో ఏకంగా 1,603 తగ్గాయి.

మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో సాధారణ కరోనా పడకలు 1,969 తగ్గాయి. అయితే ఆ మేరకు ఐసీయూ, ఆక్సిజన్‌ పడకల సంఖ్య ప్రైవేట్‌లో పెద్దగా పెరగలేదు. ఎందుకంటే మొత్తం పడకల్లో సగానికిపైగా ఖాళీగా ఉంటున్నాయి. ప్రస్తుతం ప్రైవేట్‌లో అన్ని రకాల పడకలు కలిపి 10,484 ఉండగా, వాటిల్లో 4,423 రోగులతో నిండిపోగా, ఇంకా 6,061 ఖాళీగా ఉన్నాయి. 

సాధారణ కరోనా వైద్యానికి బాధితులు ముందుకు రాకపోవడంతో జూబ్లీహిల్స్‌లో ఉన్న ఓ ప్రముఖ ఆసుపత్రిలో రెగ్యులర్‌ కరోనా పడకలను ఎత్తేశారు. అలాగే సికింద్రాబాద్‌లో ఉన్న మరో ప్రముఖ ఆసుపత్రిలోనూ సాధారణ పడకలను ఎత్తేసినట్లు మంగళవారం వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. సూపర్‌ స్పెషాలిటీ స్థాయి ఆసుపత్రుల్లో చాలాచోట్ల కరోనా సాధారణ పడకలను ఎత్తేశాయి. వాటిని ఇతర వైద్య సేవలకు కొన్ని చోట్ల ఉపయోగిస్తుండగా, కొన్నిచోట్ల ఆక్సిజన్‌ బెడ్లుగా మార్చుతున్నట్లు ఆయా ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.  

 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   8 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   11 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   14 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   14 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   15 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   12 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   21-04-2021


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle