newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి కరోనా కలకలం

25-05-202025-05-2020 12:49:41 IST
Updated On 25-05-2020 15:42:23 ISTUpdated On 25-05-20202020-05-25T07:19:41.546Z25-05-2020 2020-05-25T07:19:27.757Z - 2020-05-25T10:12:23.773Z - 25-05-2020

ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి కరోనా కలకలం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ జిల్లాల్లో గ్రేటర్ హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే అకస్మాత్తుగా ఆసిఫా బాద్ జిల్లాలో కరోనా కలకలం రేగింది. కాగజ్ నగర్ లో మహారాష్ట్ర నుండి వచ్చిన దంపతులకు  ఇద్దరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. 

వారిని హుటాహుటిన హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసిఫాబాద్ జిల్లాలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇటీవలే మహారాష్ట్ర నుంచి కాగజ్ నగర్ వచ్చిన ఇద్దరు దంపతులకు వైరస్ నిర్ధారణ అయింది. ఈ నెల 20 న స్వస్థలానికి చేరిన వీరిని వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఇద్దరి షాంపిళ్లు సేకరిం చి పరీక్షల నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ ఆస్ప త్రికి పంపగా ఈ రోజు  వచ్చిన రిపోర్టులో పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు డీఎంహెచ్వో కుమురం బాలు  తెలిపారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులను  ప్రత్యేక అంబులెన్సులో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.

కుమురం భీం జిల్లాలో దాదాపు నెల రోజుల అనంతరం కరోనా పాజిటివ్ కేసులు నమోద య్యాయి. గతంలో జైనూర్ మండలానికి చెం దిన ఏడుగురికి కరోనా సోకింది. వారంతా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకుని ఇళ్లకు కూడా చేరుకున్నారు. అంతా సర్దుకున్న సమయంలో తాజాగా రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. కాగజ్ నగర్ లో ఓ వైపు హెల్త్ సర్వే నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరికి పాజిటివ్ గా తేలడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle