newssting
BITING NEWS :
* ఇండియాలో కరోనా కేసులు 1,38,845, మరణాలు 4021 .. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 1854, మరణాలు 53, ఏపీలో కరోనా కేసులు 2627, మరణాలు 55* శంషాబాద్ విమానాశ్రయంలో ప్రారంభమైన విమాన సర్వీసులు..హైదరాబాద్ నుంచి మొదటి ప్లేన్ బయలుదేరింది..బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన మొదటి విమానం *మరోమారు వివాదంలో చిక్కుకున్న కూనరవి..పొందూరు తహశీల్దార్ ను దుర్భాషలాడిన కూన రవి..కూనరవి మీద పొందూరు పీఎస్ లో ఫిర్యాదు చేసిన తహశీల్దార్...కూన రవి అరెస్ట్ కి రంగం సిద్దం*టీటీడీకీ షాక్‌ ఇచ్చిన క్రైం పోలీసులు..దొంగలను పట్టుకోవాలంటే ఫోర్ వీలర్ కావాలని కండీషన్.. మంచి ఫోర్ వీలర్ కావాలని కోరుతూ టీటీడీ ఉన్నతాధికారులకు లేఖ..లేఖ చూసి షాక్‌తిన్న అధికారులు..నిన్న జేఈవో ఇంట్లో భారీ దొంగతనం..6లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు మాయం *కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ మరో రికార్డు..3లక్షలు దాటిన ఏపీలో కరోనా పరీక్షల సంఖ్య..ఇప్పటివరకు 3,40,326 కరోనా టెస్టులు..10 లక్షల జనాభాకు 5,699 పరీక్షలతో దేశంలోనే నెంబర్‌వన్*తెలంగాణలో ఈరోజు కొత్తగా 41 కరోనా కేసులు. తెలంగాణలో మొత్తం 1854కి చేరిన కరోనా కేసులు. తెలంగాణలో ఈరోజు 24 మంది డిశ్చార్జ్. మొత్తం 1092 మంది ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 709 యాక్టివ్ కేసులు*వరంగల్ జిల్లా 9 హత్యల కేసులో వీడిన మిస్టరీ. పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన నిందితుడు. స్నేహితులతో కలిసి హత్యలకు పాల్పడ్డ నిందితుడు. నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయాక హత్యలు* ఏపీలో తిరుమల లడ్డూ విక్రయాలు. 13 జిల్లా కేంద్రాల్లో టీటీడీ కల్యాణ మండపాల్లో లడ్డూ విక్రయాలు. లడ్డూ ప్రసాద సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు. 1800 425 4141, 1800 425 333 333 నెంబర్లు ఏర్పాటు

ఆసిఫాబాద్‌లో మానవత్వం చాటుకున్న జెడ్పీటీసీ

15-05-202015-05-2020 20:06:30 IST
2020-05-15T14:36:30.375Z15-05-2020 2020-05-15T14:36:19.423Z - - 25-05-2020

ఆసిఫాబాద్‌లో మానవత్వం చాటుకున్న జెడ్పీటీసీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అసలే లాక్ డౌన్ నిబంధనలు.. వలస కార్మికుల ఆక్రందనల నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక రైళ్ళ ద్వారా వారిని తమ స్వస్థలాలకు పంపుతోంది. మరికొందరు లారీలు, ఇతర వాహనాల ద్వారా తమ ప్రాంతాలకు బయలుదేరారు. తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లాలో ఓ జెడ్పీటీసీ వలస కార్మికురాలి పట్ల ఉదారత చూపించారు. ఆమె ప్రసవ వేదనతో బాధపడుతుంటే.. తనవంతు సాయం చేసి ఆస్పత్రిలో చేర్పించారు. 

కొమురం భీం అసిఫాబాద్ జిల్లా వాంకిడి జడ్పీటీసీ డా.అజయ్ కుమార్ చేసిన పనిని అంతా అభినందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్టానికి చెందిన కొంతమంది వలస కూలీలు తమ స్వంత గ్రామాలకు లారీ మీద వెళ్తున్న సందర్భంలో వలస కూలీలలో ఓ గర్భిణికి  కొమురంభీం అసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో హిందూస్థాన్ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే అకస్మాత్తుగా పురిటి నొప్పులు రావడంతో వెంటనే ఆ విషయం లారీలోని భర్తకు తెలిపింది.

దీంతో వెంటనే భర్త లారీని ఆపించారు. తన భార్యకు పురిటి నొప్పులు వస్తున్నాయని చెప్పినా ఎవరు పట్టించుకోలేదు. రోడ్డుపక్కన లారీని ఆపి సాయం కోసం ఎదురుచూస్తున్న వేళ అటువైపుగా వస్తున్న ఒక మీడియా ప్రతినిధి విషయం తెలుసుకుని వెంటనే స్పందించి స్థానిక జడ్పీటీసి డా.అజయ్ కుమార్ కి విషయం వివరించారు. ఆయనతో మాట్లాడి సమస్యను వివరించిన మరుక్షణమే తను ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్  వెంటనే అక్కడికి పంపించారు జెడ్పీటీసీ అజయ్ కుమార్.

అంబులెన్స్ లో ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి అక్కడ ఉన్న వైద్య సిబ్బందితో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ రాష్టానికి చెందిన వలస కూలీ అయిన ఆమెకు ఏ సమస్య రాకుండా ప్రసవం క్షేమంగా చేయాలని సూచించారు. తర్వాత ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనివ్వడంతో ఆనందం వ్యక్తం చేశారు. జడ్పీటీసీ చేసిన సాయానికి ఆమె భర్త మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జడ్పీటీసీ అజయ్ కుమార్ వైద్య సిబ్బంది సేవలను కొనియాడారు. వారిని అభినందించారు. ప్రతికూల పరిస్థితుల్లో స్పందించిన జెడ్పీటీసీని స్థానికులు అభినందిస్తున్నారు. 

సమ్మర్ ఎఫెక్ట్ .. శ్రీశైలంలో  కుడిగట్టు జలవిద్యుత్ ఉత్పత్తి నిలిపివేత

సమ్మర్ ఎఫెక్ట్ .. శ్రీశైలంలో కుడిగట్టు జలవిద్యుత్ ఉత్పత్తి నిలిపివేత

   39 minutes ago


ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి కరోనా కలకలం

ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి కరోనా కలకలం

   5 hours ago


60 రోజుల తర్వాత విమానాలు. శంషాబాద్‌లో ప్రయాణికుల పడిగాపులు

60 రోజుల తర్వాత విమానాలు. శంషాబాద్‌లో ప్రయాణికుల పడిగాపులు

   5 hours ago


ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

   7 hours ago


విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

   8 hours ago


ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

   9 hours ago


మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

   9 hours ago


గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

   10 hours ago


భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

   10 hours ago


ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

   10 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle