newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆషాఢ బోనాలు.. కరోనా మహమ్మారితో సందడి కరువు

20-07-202020-07-2020 12:44:37 IST
Updated On 20-07-2020 12:44:31 ISTUpdated On 20-07-20202020-07-20T07:14:37.404Z20-07-2020 2020-07-20T07:13:51.913Z - 2020-07-20T07:14:31.881Z - 20-07-2020

ఆషాఢ బోనాలు.. కరోనా మహమ్మారితో సందడి కరువు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో బోనాల పండుగంటే అదో పెద్ద సంరంభం. శివ స‌త్తుల పూన‌కాల‌తో.. పోతురాజుల ఆట‌పాట‌ల‌తో.. ప్ర‌తి ఏటా అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతుండేవి ఆషాఢ మాస బోనాలు. కానీ ఈసారి బోనాల సందడి బోసిపోయింది. కరోనా కల్లోలం క్ర‌మంలో చరిత్రలో తొలిసారిగా బోనాల పండుగ నిరాడంబరంగా, జనం లేకుండానే కొనసాగింది. తెలంగాణ సంస్కృతీసాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ మాసం బోనాల పండుగ చివరి దశకు చేరింది. 

Bonalu off to colourful start in the city- The New Indian Express

పాతబస్తీ లాల్ ‌దర్వాజలో ఎక్కువమంది భక్తులు లేకుండానే మహంకాళి అమ్మవారికి  బోనాలు సమర్పించారు. భారీ జనసందోహం, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల ఆటపాటలు లేకుండానే ఈ దఫా పండుగ గడిచిపోయింది. లాల్ దర్వాజ బోనాల వేడుకలు ఆదివారం తెల్లవారు జామున మూడు గంటలకే ప్రారంభమయ్యాయి. మొదట అమ్మవారికి అర్చకులు జల కడవ సమర్పించారు.

ఇటు సికింద్రాబాద్ లోనూ ఎలాంటి సందడి లేకుండా ఈ ఏడాది బోనాలు ముగిశాయి. ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరాలంటేనే గంటల సమయం పట్టేది. యువతులు,గృహిణులు తలమీద బోనం పెట్టుకుని నడుస్తుంటే ఆ సందడే వేరుగా వుండేది. 

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ప్రభుత్వం నిరాడంబరంగా బోనాల వేడుక నిర్వహించాలని ఆయా ఆలయాలకు సూచించింది. చారిత్రాత్మక గోల్కొండ కోటలో  ప్రారంభం అయిన బోనాల వేడుక లాల్ దర్వాజలో ముగుస్తాయి. లక్షలాది భక్తులతో జరిగే ఈ పండుగ ఈసారి భక్తజనం సందోహం లేకుండా ముగిసింది. చరిత్రలో ఇలా జరగడం ఇదే ప్రథమం అంటున్నారు భక్తులు.

సికింద్రాబాద్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబం బోనాలు తెచ్చి ఆలయం బయట ఈవోకి అందచేశారు. అమ్మవారి పూజలన్నీ యథావిధిగా ఆలయ అధికారులు, పూజారులే నిర్వహించారు. గత సోమవారం స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ జాతరలో జంటనగరాల వాసులే కాకుండా తెలంగాణలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివ‌చ్చేవారు. లష్కర్ అంతా భక్తజన సంద్రంగా వుండేది. కరోనా వ్యాప్తి కారణంగా బోనాల జాతరకు బ్రేక్ ప‌డింది. బోనాలు స‌మ‌ర్పించే భ‌క్తులు.. వారి ఇళ్ల‌లోనే బోనం చేసి స‌మ‌ర్పించుకున్నారు.ఉత్సవాలను ప్రజలంతా వీక్షించేలా ఆలయాల నుంచే ప్రత్యక్ష ప్రసారం చేసింది ప్రభుత్వం. 

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   13 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   14 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   13 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   17 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   18 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   17 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   19 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   20 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   15 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle