newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆశ నిరాశేనా? ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులకు బ్రేక్

26-06-202026-06-2020 12:47:15 IST
Updated On 26-06-2020 13:44:30 ISTUpdated On 26-06-20202020-06-26T07:17:15.420Z26-06-2020 2020-06-26T07:16:37.826Z - 2020-06-26T08:14:30.291Z - 26-06-2020

ఆశ నిరాశేనా? ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులకు బ్రేక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మరోవారంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిపేందుకు సిద్ధమైన అధికారులకు కరోనా రూపంలో బ్రేకులు పడ్డాయి. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంపట్ల అధికారులు ఆందోళన పడుతున్నారు. టీఎస్‌ఆర్టీసీలో ఆపరేషన్స్‌ విభాగంలో ఓ అధికారికి కరోనా పాజిటివ్‌ తేలడంతో చర్చల్ని వాయిదా వేశారు. దీంతో ఇప్పట్లో ఏపీ, తెలంగాణ మధ్య బస్సులు నడిపే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఈ నెల 17న విజయవాడలో ఏపీఎస్‌ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీ అధికారులు సమావేశమై రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందంపై చర్చలు జరిగాయి. 

తాజాగా ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు వాయిదా పడటంతో బస్సు సర్వీసులను నడిపే అంశంపై సందిగ్ధత నెలకొంది. కాగా, ఈ నెల 1 నుంచి 20 వరకు ఏపీఎస్‌ఆర్టీసీ రోజుకు సగటున 3,266 బస్సు సర్వీసుల్ని నడిపింది. 11.03 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు తిరిగాయి. గత 20 రోజులుగా రోజుకు రూ.2.43 కోట్లు ఆదాయం ఆర్టీసీ ఆర్జించింది. కిలోమీటరుకు రూ.22.06 మాత్రమే పొందింది. కరోనాకు ముందు రోజుకు రూ.12 కోట్ల ఆదాయం ఆర్టీసీకి వచ్చేది. గత మూడునెలలుగా సర్వీసులు సరిగా తిరగకపోవడంతో ఆర్టీసీ నష్టాలు పెరిగిపోతున్నాయి. త్వరలో సిటీ సర్వీసులు నడపాలని ఆర్టీసీ భావిస్తోంది. 

ఏపీఎస్‌ఆర్టీసీ త్వరలో విజయవాడ, విశాఖలో నడిపే సిటీ సర్వీసుల్లో ఎక్కడ్నుంచి ఎక్కడకు వెళ్లినా ఒకే రేటు వసూలు చేసేందుకు ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.సిటీ సర్వీసుల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది ఆర్టీసీ.

కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించింది. త్వరలో అంతర్రాష్ట్ర సర్వీసులపై చర్చించేందుకు అధికారులు ఒక తేదీ నిర్ణయించనున్నారు. ఏది ఏమైనా ఈ చర్చలు వచ్చేవారంలోనే జరుగుతాయని భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై నుంచి ఆర్టీసీ బస్సులు రెండురాష్ట్రాల రోడ్లపై రయ్ రయ్ మంటూ తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. 

ఇదిలా ఉంటే ఏపీఎస్‌ఆర్టీసీలో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి అధికారులు షాకిచ్చారు. కాంట్రాక్ట్‌ ముగిసిందని.. నేటి నుంచి విధులకు రావొద్దంటూ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఏపీఎస్‌ఆర్టీసీ ఆఫీసు నుంచి ఫోన్లు వచ్చాయి. గతంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించబోమని చెప్పిన యాజమాన్యం మాట తప్పిందంటున్నారు.  గతంలో మంత్రి పేర్ని నాని ఇచ్చిన మాటకు విలువ లేకుండా పోయిందని వాపోతున్నారు  ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది. ఈ నిర్ణయంతో ఆందోళనలో 7800 మంది ఔటర్‌సోర్సింగ్ సిబ్బంది ఉపాధి కోల్పోయారు.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle