newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

ఆలస్యంగా మేల్కొన్నా పోకిరీల పని పట్టనున్న తెలంగాణ పోలీస్..

05-12-201905-12-2019 10:26:06 IST
2019-12-05T04:56:06.554Z05-12-2019 2019-12-05T04:56:04.869Z - - 22-02-2020

ఆలస్యంగా మేల్కొన్నా పోకిరీల పని పట్టనున్న తెలంగాణ పోలీస్..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పోలీసులు చేసిన ఒక చిన్న తప్పిదం డాక్టర్ దిశ పాలిట ఘోరనేరంగా పరిణమించింది. అన్నెం పున్నెం ఎరుగని అమాయక వైద్యురాలిని నలుగురు ముష్కరులు నమ్మించి, వంచించి అత్యాచారం చేసి సజీవ దహనం చేసిన నేరంలో పోలీసుల నిర్లక్ష్యం కూడా పాలుపంచుకుంది. మా అమ్మాయి కనిపించడం లేదని దిశ తల్లిదండ్రులు పోలీసు స్టేషనుకు వచ్చి మొరపెట్టుకుంటే ఎవరితోనైనా లేచిపోయిందేమో చూడండి అంటూ పోలీసులు చేసిన వ్యాఖ్యతో ఆ తల్లిదండ్లుల ప్రాణాలు సగం పోయాయి. కొన్ని గంటల్లో వాళ్ల పెద్దమ్మాయి దిశ కూడా ప్రాణాలు పోగొట్టుకుంది. 

ఫ్రెండ్లీ పోలీసు అంటూ గర్వంగా చెప్పుకున్న తెలంగాణ పోలీసుల పరువు మొత్తం పోవడమే కాకుండా, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు  చట్టవిరుద్ధమని తెలిసి కూడా పోలీసులను బూతులు తిడుతున్నారు. ఇష్టమొచ్చినట్లుగా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఎన్నడూ జనం నుంచి చూడని ఈ రకం తిరుగుబాటులో తల బొప్పి కట్టిన తెలంగాణ పోలీసులు ఆలస్యంగానైనా మేలుకున్నారు. 

ఇప్పటికే దిశ తల్లిదండ్రులను ఘోరంగా అవమానించి అమానుషంగా ప్రవర్తించిన సంబంధిత పోలీసు అధికారిని, హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసిన తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు ఇకనుంచి గ్రామాల్లో, పట్టణాల్లో జులాయిగా తిరిగే పోకిరీల పని పట్టాలని నిర్ణయించుకున్నారు. ‘దిశ’ఘటన దరిమిలా మహిళల భద్రత, రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పోకిరీల డేటా సేకరించనున్నారు. 

వివరాల్లోకి వెళితే తెలంగాణ గ్రామాల్లో జులాయిగా తిరిగే పోకిరీల డేటా రాష్ట్ర  పోలీసుల వద్దకు చేరనుంది. అమ్మాయిలను వేధించే ఆకతాయిల జాబితాను ఇకపై ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. ‘దిశ’ఘటన దరిమిలా మహిళల భద్రత, రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో భాగంగా పోకిరీల డేటా సేకరించనున్నారు. పట్టణాలతో పాటు గ్రామాల్లో పనీపాటా లేకుండా తిరిగేవారిపై పోలీసులు స్పెషల్‌ ఫోకస్‌ పెట్టనున్నారు. మహిళలపై వేధింపులకు సంబంధించిన కేసుల్లో అధిక శాతం నిందితులు పనీపాటా లేనివారే కావడం గమనార్హం. పోలీసుల కీలక నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా పోకిరీల్లో వణుకు మొదలైంది.

పోకిరీల డేటా సేకరణతో పాటు రాష్ట్రంలోని మహిళలపై లైంగిక వేధింపుల నివారణకు.. సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం స్వయం సహాయక గ్రూపు(ఎస్‌హెచ్‌జీ)ల్లోని మహిళకు చట్టాలు, సైబర్‌ క్రైమ్, లైంగిక వేధింపులు, ఈవ్‌టీజింగ్, పోలీసులను ఎలా సంప్రదించాలి.. తదితర సమస్యలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వీరు పాఠశాలలు, కాలేజీల్లో మహిళా రక్షణపై విద్యార్థులను చైతన్యం చేయనున్నారు. వీరికి షీటీమ్స్, పోలీసు కళాబృందాలు తోడవనున్నాయి. విద్యాసంస్థలే కాదు, కార్యాలయాలు, గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించనున్నారు. 

అమ్మాయిలను వేధిస్తే తలెత్తే పరిణామాలు, చట్టపరంగా ఎలాంటి శిక్షలు పడతాయో వివరించేలా పాఠ్యాంశాలు రూపొందించనున్నారు. మహిళా భద్రత కోసం సమాజం ఆలోచనల్లో మరింత మార్పు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. బాలికలపై వివక్షను రూపుమాపడం, లింగసమానత్వం సాధించడానికి స్కూలు పాఠ్యాంశాల్లో కొత్త అంశాలు చేర్చాలని నిర్ణయించారు.  వచ్చే విద్యా సంవత్సరంలో ఈ మేరకు మార్పులు చేయాలని భావిస్తోంది.  

కాగా ఫేస్‌బుక్‌ వేదికగా ‘దిశ’పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో కీలక నిందితుడు సాయినాథ్‌ను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. శనివారం నమోదు చేసిన కేసులో ఇతడే కీలకమని, మంగళవారం చిక్కిన శ్రీరామ్‌ సహ నిందితుడని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఉన్న అమరావతి కొండయ్య కాలనీకి చెందిన సాయినాథ్‌ అలియాస్‌ నాని బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతున్నాడు. ఇటీవల జరిగిన దిశ ఉదంతం నేపథ్యంలో ఆమెను ఉద్దేశించి తన వాల్‌పై నాని అనుచిత వ్యాఖ్యలు పోస్ట్‌ చేశాడు. వీటిని సమర్థిస్తూ శ్రీరామ్‌ సహా మరికొందరు కామెంట్స్‌ పెట్టారు. 

వీటిపై స్పందించిన సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఈ వ్యవహారంపై శనివారం సుమోటోగా కేసు నమోదు చేశారు. ఆధారాలను బట్టి సాయినాథ్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తిం చారు. బుధవారం గుంటూరు వెళ్లిన ఓ ప్రత్యేక బృందం అతడిని అరెస్టు చేసింది. నిందితుడిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు.. జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. 

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   2 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   2 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   3 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   4 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   5 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   5 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   7 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   8 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   8 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   9 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle