newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సాహసోపేత నిర్ణయాలు అవసరం

01-05-202001-05-2020 19:14:20 IST
Updated On 01-05-2020 19:29:12 ISTUpdated On 01-05-20202020-05-01T13:44:20.448Z01-05-2020 2020-05-01T13:44:10.330Z - 2020-05-01T13:59:12.362Z - 01-05-2020

ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సాహసోపేత నిర్ణయాలు అవసరం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్థిక వ్యవస్థ తిరిగి బలం పుంజుకునేందుకు వెంటనే సాహసోపేత సంస్కరణలను అత్యవసరంగా చేపట్టాలన్నారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. కరోనా సంక్షోభం వల్ల దేశఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయింది. ఈమేరకు నష్టనివారణ చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కి లేఖ రాశారు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు. దేశంలోని మౌలిక వసతులు, నైపుణ్య అభివృద్ధి పైన అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, దేశంలో హైదరాబాద్ ఫార్మా సిటీ, కాకతీయ టెక్స్  టైల్ పార్క్ లాంటి మరిన్ని భారీ పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలన్నారు. 

పాతబడిన లేబర్ మరియు బ్యాంక్ రప్టసి ( bankruptcy) చట్టాలను వెంటనే మార్చాలని, భారత ఎగుమతుల విషయంలో పోటీ తత్వాన్ని ప్రపంచ దేశాల స్థాయికి తీసుకు వెళ్లాలన్నారు. దేశంలోని ఎంఎస్ఎంఈ లకు నేరుగా ఆర్థిక సహాయం చేయడంతో పాటు వాటి బకాయిల వసూలుకు కొంత విరామం ప్రకటించాలని కేటీయార్ సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థ పారిశ్రామికరంగం పైన మార్గదర్శనం చేసేందుకు కు ఎంపవర్డ్ స్ట్రాటజీ గ్రూప్ ని ఏర్పాటు చేయాలన్నారు. 

ప్రస్తుత సంక్షోభ సమయాన్ని సమయంలోనూ మరిన్ని కొత్త అవకాశాలు ఉన్నాయంటూ గత కొంత కాలంగా తనదైన మాట వినిపిస్తున్న మంత్రి కే. తారకరామారావు ఈ రోజు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు ఈ మేరకు ఒక లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున భారతదేశంలోకి మరిన్ని పెట్టుబడులను తీసుకురావడంతో పాటు ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు అవసరమైన కొన్ని సూచనలను ఈ లేఖలో మంత్రి కే తారకరామారావు చేశారు. భారతదేశం ఎదుర్కొంటున్న కరొనా వైరస్ మహమ్మారిని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి సమిష్టిగా ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితులు ఎత్తేసిన అనంతరం ఈ సంక్షోభ  సమయంలో ఉన్న అవకాశాలను అందుకోవాల్సిన అవసరం ఉన్నదని ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం మరిన్ని విప్లవాత్మకమయిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

ముఖ్యంగా భారతదేశంలో ప్రభుత్వ విధానాల్లో సమూల మార్పులు తీసుకొచ్చి ఈ ఓ డి బి (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ర్యాంకింగ్లో ప్రపంచంలోనే టాప్ 20 జాబితాలోకి తీసుకువచ్చేందుకు ఉండే పలు నిర్ణయాలు తీసుకోవాలన్నారు. దేశంలో పాతపడిన లేబర్ లా తో పాటు బ్యాంకు రప్ట సి (బ్యాంకు లోన్ల ది వాలకి) కు సంబంధించిన చట్టాలను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు.

దీంతోపాటు ప్రభుత్వాలకు మార్పుకు సంబంధం లేకుండా పెట్టుబడుల పట్ల స్థిరమైన, ఖచ్చితమైన, నమ్మకమైన విధానాలు ఉండేలా చూడాలన్నారు. భారతదేశంలో మౌలిక వసతులు మరియు నైపుణ్య అభివృద్ధి పైన ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉన్నదని ఇందుకోసం మెగా ఇండస్ట్రీయల్ పార్కు అయినటువంటి హైదరాబాద్ ఫార్మా సిటీ మరియు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వంటివాటికున్న జాతీయ ప్రాధాన్యతను అర్థం చేసుకొని వాటికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

దేశంలో భారీ ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేస్తూ అందులోనే అన్ని వసతులు ఉండేలా,  శిక్షణ సంస్థలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేయాలన్నారు. భారీ ఆర్థిక వ్యవస్థలకు ప్రపంచంతో పోటీ పడే ఇటువంటి వీలుంటుందని ఆ దిశగా భారత దేశాన్ని ముందుకు తీసుకు పోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రపంచంలోని ఏ దేశంతో అయినా పోటీ పడే విధంగా భారతదేశ ఎగుమతుల యొక్క పోటీతత్వాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఫార్మా రంగం, ఏరోస్పేస్, టెక్స్టైల్స్, లెదర్, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు సంబంధించి ఈ విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

భారతదేశంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలంటే ఎప్పటికప్పుడు ప్రపంచంలోని పెట్టుబడి అవకాశాలు పైన నిరంతరం పరిశీలన చేస్తూ, ఇతర దేశాలతో పోటీ పడి మరి ఇక్కడికి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోకి ఆయా పెట్టుబడులు వచ్చిన తర్వాత వారికి అవసరమైన శిక్షణను అంతర్జాతీయ ప్రమాణాలతో అందించాలని, వీటితోపాటు ఆయా పెట్టుబడులు భారతదేశంలోకి తరలివచ్చే అవసరమైన ప్రోత్సాహకాలను ముఖ్యంగా ఎగుమతులకు సంబంధించి ప్రోత్సాహకాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. 

ప్రస్తుతం భారీ పెట్టుబడులను దేశంలోకి రప్పించడం తో పాటు దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించే సూక్ష్మ మరియు మధ్య తరహా పరిశ్రమలకు  కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, భారతదేశ ఎస్ ఎం ఈ లు ఆర్థిక వ్యవస్థ కి వెన్నుముక లాంటి వన్నారు. ప్రస్తుత ఆపత్కాలంలో సూక్ష్మ మరియు మధ్య తరహా పరిశ్రమల కి నేరుగా ఆర్థిక సాయం అందించే అంశాన్ని పరిశీలించాలని అవసరమైతే ఆయా సంస్థలకు ఉన్నటువంటి బకాయిలకు వసూలుకు కొంత విరామం ఇవ్వాలని సూచించారు. 

ప్రస్తుతం దేశంలోని ఆర్థిక వ్యవస్థతో పాటు దేశానికి సంబంధించి రానున్న పెట్టుబడులు, పరిశ్రమల పైన ఒక ఎంపవర్డ్ స్ట్రాటజీ గ్రూప్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సూచించిందని ఈ విషయాన్ని పరిశీలించాలని మంత్రి కే తారకరామారావు కేంద్ర మంత్రి కోరారు. ఈ కమిటీలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులతో పాటు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు బ్యాంకర్లు, ఆర్థికవేత్తలు పాలసీ నిపుణులు ఉండాలని సూచించారు

 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   11 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   7 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   9 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   12 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   14 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   16 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   17 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   18 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   19 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle