newssting
BITING NEWS :
* ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్ గరం గరం *సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన శివసేన.. ఇవాళ విచారణ *సమ్మెపై హైకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటాం: అశ్వథ్థామరెడ్డి.*ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ అగ్రస్థానంలో కోహ్లీ, బుమ్రా *గురుగ్రామ్ లో తైక్వాండో క్రీడాకారిణి సరిత దారుణ హత్య *మిషన్ భగీరథ అవినీతిపై సీబీఐతో విచారణ జరపాలి : భట్టి విక్రమార్క*నా పెళ్లిళ్ల వల్లే జగన్ జైలుకెళ్లారా ? : పవన్*ఆర్టీసీ సమ్మెపై ఇవాళ హైకోర్టులో విచారణ *ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ

ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

13-10-201913-10-2019 12:36:29 IST
2019-10-13T07:06:29.554Z13-10-2019 2019-10-13T07:06:26.514Z - - 14-11-2019

ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సమ్మె చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రదర్శిస్తున్న పరమ నియంతృత్వ పూరిత వైఖరి ఆర్టీసీ ఉద్యోగాలు ప్రాణాలను బలిగొంటోంది. సమ్మె ప్రారంభమైన తొలి రోజునుంచి ఆర్టీసీ సిబ్బందికి కేసీఆర్ చేస్తున్న హెచ్చరికలు, బెదిరింపులు, ఉద్యోగాలనుంచి తొలగించినట్లు పదే పదే చేస్తున్న ప్రకటనలు సిబ్బందిని వారి కుటుంబ సభ్యులను భీతావహ పరిస్థితిలోకి నెట్టాయి. 

ఇప్పటికే ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లు, ఒక మహిళా కండక్టర్ భర్త కేసీఆర్ అమానుషత్వానికి బలైపోయారు. సమ్మె మొదలైన ఆరోరోజున ఇద్దరు డ్రైవర్లు తీవ్ర వేదనతో గుండెపోటుతో కుప్పగూలి ప్రాణాలు కోల్పోయారు. ఇక తన భార్య,. మహిళా కండక్టర్ వేతనంపైనే ఆధారపడి జీవిస్తున్న ఆమె భర్త అంగవైకల్యంతో బాధపడుతూ భార్య ఉద్యోగం పోయిందన్న వార్త విని ఉన్నఫళాన కుప్పగూలిపోయి మరణించాడు.

Image result for KCR's arrogance claiming lives of RTC staff now!

తెలంగాణ ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకునే దసరా పండుగ ఉత్సవాలకు 50 వేలమంది ఆర్టీసీ ఉద్యోగులు ఈసారి దూరమయ్యారు. సమ్మె చేస్తున్న 50 వేలమంది సిబ్బందికి జీతాలను ప్రభుత్వం నిలిపివేయడంతో ఆర్టీసీ సిబ్బందికి, వారి కుటుంబాలకు కన్నీళ్లే మిగిలాయి. 

వారం రోజులపైగా సమ్మె కొనసాగిస్తున్నప్పటికీ ఫలితం కనుచూపుమేరలో కనిపించకపోవడంతో ఆర్టీసీ సిబ్బందిలో వారి కుటుంబ సభ్యుల్లో పేరుకుపోతున్న ఆవేదన, నిస్పహ చివరికి వారి ప్రాణాలను బలిగొంటున్న పరిస్థితిని కొనితెస్తోంది.

బతుకమ్మ సంబురాలు, దసరా ఉత్సవాలు పేరిట కోట్లరూపాయలను ఖర్చుపెడుతూ ఆనందంగా గడుపటంలో కాలం గడిపేసిన తెలంగాణ సమాజానికి 50 వేలమంది తమ సోదరులు జీతాలు కూడా లేకుండా, ప్రభుత్వ కాఠిన్యానికి నిస్సహాయంగా బలవుతుంటే కనీసం స్పందించే హృదయం కూడా లేకపోవడం, మీడియా ద్వారానైనా సంఘీభావం తెలుపకపోవడం తెలంగాణ ఉద్యమ సంస్కృతికి తీరని అపచారం అవుతుందని పరిశీలకులు చెబుతున్నారు.

ప్రాణత్యాగాలకు సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్ర ప్రజలు తమ తోటి సోదరులు 50 వేలమంది ఆర్టీసీ సిబ్బంది పట్ల తెలంగాణ ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తుంటే కనీస హృదయ స్పందనలు కూడా ప్రకటించకుండా ఎలా పండుగ సంబరాల్లో మునిగిపోయిందన్నది యావత్ తెలంగాణ సమాజంపై ఎక్కుపెడుతున్న ప్రశ్న

ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యం, మరొకవైపు నమ్ముకున్న న్యాయవ్యవస్థ సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్నా తమాషా చూస్తూ విచారణను వాయిదా వేసుకుంటూ కాలం గడుపుతుంటే సిబ్బంది ఆర్తనాదాలను పట్టించుకునే వారెవరు ఉద్యోగుల ప్రాణాలను హరింపజేయడానికే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిందా అనే ప్రశ్నలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.

ఈ ప్రశ్నలకు బదులేదీ... సమాధానం చెప్పేవారేరీ.. 

 

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

   11 hours ago


చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

   12 hours ago


ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

   13 hours ago


ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

   13 hours ago


మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

   14 hours ago


పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

   14 hours ago


జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

   14 hours ago


న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

   15 hours ago


జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

   15 hours ago


అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

   16 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle