newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆర్టీసీ సిబ్బందికి కేసీయార్ శుభవార్త.. అందరికీ ఇంక్రిమెంట్లు

01-01-202001-01-2020 09:08:40 IST
Updated On 02-01-2020 17:36:56 ISTUpdated On 02-01-20202020-01-01T03:38:40.227Z01-01-2020 2020-01-01T03:32:47.259Z - 2020-01-02T12:06:56.405Z - 02-01-2020

ఆర్టీసీ సిబ్బందికి కేసీయార్ శుభవార్త.. అందరికీ ఇంక్రిమెంట్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ సీఎం న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ తీపికబురు అందించారు. ఇంక్రిమెంట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఉద్యోగులందరికీ ఇవ్వబోయే ఇంక్రిమెంట్లు రూ350 నుంచి రూ. 1000వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. ఆర్టీసీ సమ్మెలో పాల్గొన్నవారితో పాటు ఆర్టీసీ ఉద్యోగులందరికీ ఇంక్రిమెంట్‌ ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని సీఎం ఆదేశించారు. ఈ మేరకు ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్‌శర్మ మంగళవారం సర్క్యులర్‌ జారీచేశారు.

ఇటీవల సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఆధారంగా ఒక్కో హామీ నెరవేరుతోంది. ఇప్పటికే పాత పెండింగ్ శాలరీలు పరిష్కారం పొందుతున్నాయి. మహిళా ఉద్యోగులకు రాత్రి 8 గంటల లోపు వరకే డ్యూటీలు చేసే అవకాశం ఇస్తున్నారు.

ఉద్యోగులు డ్యూటీలో వుండగా ఇబ్బందులు లేకుండా సంచార బయో టాయిలెట్లు అందుబాటులోకి తెచ్చారు. తాజా ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగి మూలవేతనం ఆధారంగా రూ.350 నుంచి రూ.1000 వరకు వివిధ క్యాటగిరీల ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు అందుతాయి. 

ఈ ఇంక్రిమెంట్ ప్రభావం ఉద్యోగి జీతంపై పడనుంది. డీఏ సహా పలు బెనిఫిట్స్‌ కూడా అంతమేర పెరుగుతాయని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు.. ఆర్టీసీ కార్మికులు గత ఏడాది అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 28 వరకు సమ్మెలో ఉన్న సంగతి తెలిసిందే. సాధారణంగా సమ్మె చేసిన సమయానికి ‘నో వర్క్‌- నో పే’ విధానంలో వేతనం ఇవ్వరు.

కానీ ఆర్టీసీ ఉద్యోగులకు 52 రోజుల సమ్మెకాలాన్ని కూడా విధుల్లో ఉన్నట్టు పరిగణిస్తూ వేతనం ఇస్తామని అంగీకరించిన సంగతి తెలిసిందే. మొత్తం మీద 2020 నూతన సంవత్సరం ఇంక్రిమెంట్ వార్తతో ప్రారంభమయిందని, తమకు చాలా సంతోషంగా ఉందని ఆర్టీసీ కండక్టర్ ఒకరు ‘న్యూస్ స్టింగ్’తో చెప్పారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle