newssting
BITING NEWS :
*తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుంది... లాక్ డౌన్ కొనసాగించాలని మోడీకి చెబుతా*-కేసీయార్ *ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 303 *ఎంపీల వేతనాల్లో 30 శాతం కొోత *న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మొత్తంగా 364కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

ఆర్టీసీ సమ్మె ఇంకెన్నాళ్లు? ఆగని బలిదానాలు

13-11-201913-11-2019 12:33:55 IST
Updated On 13-11-2019 12:58:34 ISTUpdated On 13-11-20192019-11-13T07:03:55.677Z13-11-2019 2019-11-13T07:03:34.388Z - 2019-11-13T07:28:34.705Z - 13-11-2019

ఆర్టీసీ సమ్మె ఇంకెన్నాళ్లు? ఆగని బలిదానాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ సమ్మె కొనసా....గుతూనే వుంది. ఇప్పటికే 40 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు కార్మికులు. ఆర్టీసీ సమ్మె, రూట్లకు పర్మిట్ల విషయంలో హైకోర్టులో సుదీర్ఘ వాదోపవాదనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం తగ్గడం లేదు. అలాగని ఆర్టీసీ కార్మికులు మెట్టుదిగి రావడం లేదు. దీంతో అటు ఆర్టీసీ-ఇటు ప్రభుత్వం మధ్యలో నలిగిపోతున్నారు సాధారణ ప్రయాణికులు.

గతంలో ఒక బస్సులో  తక్కువ ఖర్చుతో గమ్యస్థానం చేరే ప్రయాణికులు ఇప్పుడు డబుల్, ట్రిఫుల్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో వారి జేబు గుల్లవుతోంది. సందట్లో సడేమియాలా ఆటోవాలాలు దోపిడీకి కళ్ళెం పడడం లేదు. పదిరూపాయల ఛార్జితో మినిమం రూట్లో దింపాల్సిన ఆటో వాలాలు 20 నుంచి 30 రాత్రిళ్ళు అయితే 50 రూపాయలు కూడా వసూలు చేస్తున్నారు.

వారానికి సరిపోయే ఛార్జీలు సమ్మె కారణంగా రెండురోజులకే అయిపోతున్నాయి. రోజుకి గతంలో యాభై రూపాయలు ఖర్చయితే ఇప్పుడది డబుల్ అవుతోంది. దీంతో తమ కష్టార్జితం అంతా ఆటోలకు పెట్టాల్సి వస్తోందని వాపోతున్నారు.

దీనికి తోడు ఆర్టీసీ కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్లు తాము కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఆర్టీసీ డిపోమేనేజర్లు గతంలో తమతో ఎంతో హుందాగా ఉండేవారని, ఇప్పుడు ఈసడింపులకు గురిచేస్తున్నారని ‘న్యూస్ స్టింగ్’తో వాపోయారు.

ఆర్టీసీ సమ్మె ప్రారంభంలో ఎనిమిది గంటలు పనిచేసే వారమని, కానీ ఇప్పుడు డిపోలో ఉదయం 5 గంటలకు క్యూలో నిలబడితే టిమ్స్ మెషీన్ ఇచ్చేసరికి 2 గంటల వరకూ టైం పడుతోందని ఆర్టీసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కండక్టర్ ఒకరు చెప్పారు.

8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ పనిచేయించుకుంటున్నారని రూ.1000 రూపాయలు కండక్టర్ కు, రూ.1500 డ్రైవర్ కు ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 8 గంటల డ్యూటీకి మించి చేస్తే ఆర్టీసీ పర్మినెంట్ ఉద్యోగులకు ఓవర్ టైం అలవెన్స్ ఇస్తారని, కానీ తాము శ్రమదోపిడీకి గురవుతున్నామని  ‘న్యూస్ స్టింగ్’తో అంటున్నారు. 

ఇదిలా ఉంటే ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మరో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహబూబాబాద్ డిపోకు చెందిన నరేష్ అనే డ్రైవర్ సమ్మెపై ప్రభుత్వ తీరుకు మనస్థాపానికి గురై బుధవారం ఉదయం పురుగుల మందు తాగాడు.

గమనించి కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ డ్రైవర్ నరేష్ మృతి చెందాడు. దీంతో డ్రైవర్ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇప్పటికే సమయం మించిపోయిందని ఇంకెన్ని రోజులు సమ్మె చేయాలో తెలీక ఆర్టీసీ కార్మికులు కూడా నిర్వేదానికి గురవుతున్నారు. 

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

   6 hours ago


కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

   10 hours ago


తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

   10 hours ago


కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

   13 hours ago


ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

   16 hours ago


బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

   16 hours ago


‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

   16 hours ago


డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

   17 hours ago


గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

   19 hours ago


లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

   19 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle