newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

ఆర్టీసీ సమ్మె ఆగుతుందా? కోర్టు ఏం చెబుతుంది?

18-10-201918-10-2019 09:40:27 IST
Updated On 18-10-2019 15:28:46 ISTUpdated On 18-10-20192019-10-18T04:10:27.623Z18-10-2019 2019-10-18T04:10:07.256Z - 2019-10-18T09:58:46.729Z - 18-10-2019

ఆర్టీసీ సమ్మె ఆగుతుందా? కోర్టు ఏం చెబుతుంది?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె చర్చనీయాంశంగా మారింది. సమ్మె విరమించి చర్చలకు వెళ్లాలంటూ కార్మిక సంఘాలకు, సమస్య పరిష్కారానికి చొరవ చూపాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు సూచించినా రెండు వైపుల నుంచి ఎక్కడా ఆపరిస్థితి కనిపించడంలేదు.

తాము చర్చలకు సిద్ధమేనని, కానీ ఎవరితో చర్చించాలో తేల్చాల్సింది ప్రభుత్వమేనంటూ కార్మిక సంఘాలు చెబుతున్నాయి. తన ఫోన్ ట్యాపింగ్ లో ఉందని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి ఆరోపించడం సమస్యను మరింత జఠిలం చేస్తోంది.

ఇవాళ హైకోర్టు ఇంకోసారి ఈ విషయంలో జోక్యం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. కోర్టు ఏం చెబుతుందోనని ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరో వైపు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆర్టీసీ సమ్మెపై గురువారం వాకబు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ హుటా హుటిన రాజ్‌భవన్‌ చేరుకొని సమ్మె పరిణామాలను ఆమెకు వివరించడం వెనుక ఏం జరుగుతుందనేది చర్చనీయాంశంగా మారింది. 

ఇవాళో రేపో ఆర్టీసీ సమ్మె విషయంలో  పరిష్కారం లభించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్టీసీ సమ్మెపై దాఖలైన పిల్‌పై కొనసాగిన వాదనల సమయంలో హైకోర్టు పలు సూచనలు చేసిన సంగతి తెలిసిందే. కానీ హైకోర్టు ఆదేశాలను సైతం ఇరుపక్షాలు పాటించిన దాఖలాలు లేవు. శుక్రవారం మరోసారి ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు.

సమ్మె మొదలైన తొలి రోజు సాయంత్రం 6 గంటల్లోగా విధుల్లో చేరని వారు సెల్ఫ్‌ డిస్మిస్‌ చేసుకున్నట్టేనంటూ తేల్చిచెప్పిన సీఎం.. బుధవారం రాత్రి రవాణాశాఖ మంత్రి, ఆ శాఖ కార్యదర్శితో సుదీర్ఘంగా చర్చించారు. శుక్రవారం కోర్టులో అనుసరించాల్సిన వ్యూహంపై మరోసారి భేటీ కానున్నారు.

కోర్టు చేసే సూచనల ఆధారంగా శుక్రవారం కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని  భావిస్తున్నారు. మరోవైపు, శనివారం ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో కోర్టు ఎలాంటి ఆదేశాలిస్తుందో చూడాలి. విద్యార్ధి సంఘాలు, పార్టీలు ఈ సమ్మెకు సంఘీభావం ప్రకటించడంతో ఏం జరుగుతుందోనని అంతా ఉత్కంఠగా చూస్తున్నారు. 

కార్మిక సంఘాలు మాత్రం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నాయి. 13వ రోజు సమ్మెలో భాగంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద ధూంధాం నిర్వహించారు కార్మికులు.  నిరసనల్లో పాల్గొన్న కార్మికుల కుటుంబ సభ్యులు ప్రభుత్వం వెంటనే సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరుతున్నారు. 

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి పరోక్షంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవి ఒకరికే శాశ్వతం కాదని, కేసీఆర్‌ కంటే బలమైన ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు 1993–94లో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభాన్ని మరిచిపోవద్దని గుర్తుచేశారు. సమ్మెపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసే కొందరు మంత్రులు ఇంటికి వెళ్లి బాధపడుతున్నారన్నారు. 

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ గురువారం రాజ్‌భవన్‌లో సమీక్షించారు. రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌ శర్మను ఆమె పిలిపించుకొని వివరాలను సేకరించారు.

ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లన్నంటినీ చేయాలని సూచించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై రాజకీయ పార్టీలు, వివిధ సంస్థల నుంచి తనకు విజ్ఞప్తులు అందాయని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.

ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్నారన్న ప్రయాణికుల ఫిర్యాదుతో అన్ని బస్సుల్లో టికెట్ల జారీ ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించడంతో గురువారం చాలా బస్సుల్లో ఆ మేరకు చర్యలు తీసుకున్నారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 74 శాతం బస్సులు నడిపినట్లు అధికారులు వెల్లడించారు. టికెట్ల జారీ మెషీన్లకు బదులు టికెట్లు ఇచ్చారు కాంట్రాక్టు కండక్టర్లు. 

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   2 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   3 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   4 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   5 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   5 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   6 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   7 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   8 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   8 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   9 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle