newssting
BITING NEWS :
*రాష్ట్రాలను కేంద్రం చిన్న చూపు చూస్తోందన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదు-కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ *ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ. 5 గంటల పాటు కొనసాగిన కేబినెట్ మీటింగ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్. పలు కీలక అంశాలపై చర్చించిన కేబినెట్ *కొత్తకోట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. డివైడర్ ఢీ కొట్టి తుఫాన్ వాహనం బోల్తా. ఇద్దరు మృతి. 14 మందికి తీవ్రగాయాలు, హాస్పిటల్ కు తరలింపు * ఇవాళ కెసిఆర్ బర్త్ డే. కెసిఆర్ పుట్టినరోజును మొక్కల పండుగగా జరపాలని తెరాస పిలుపు. రేపు ఉదయం నుంచి మొక్కలు నాటడం... రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపు *జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశం. పనిచేసే కార్యకర్తలకే జనసేన పార్టీలో ప్రాధాన్యత. కార్యకర్తల సలహాలు, సూచనలు తీసుకున్నా-పవన్ *రాజధాని మార్పు, పీఏఏల రద్దు తొందరపాటు నిర్ణయాలు, పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల కోర్టులకు వెళ్లే పరిస్థితి, శాసనమండలి రద్దు నిర్ణయం సరైంది కాదు-దగ్గుబాటి పురంధేశ్వరి*ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం... మూడోసారి సీఎంగా ప్రమాణం

ఆర్టీసీ సమ్మె...హుజూర్ నగర్ సీను మారుతోందా?

16-10-201916-10-2019 17:16:47 IST
2019-10-16T11:46:47.975Z16-10-2019 2019-10-16T11:46:36.712Z - - 17-02-2020

ఆర్టీసీ సమ్మె...హుజూర్ నగర్  సీను మారుతోందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఇప్పుడు తెరాసకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. ఇక్కడ ఏ మాత్రం తేడా జరిగినా ప్రభుత్వ ప్రతిష్ట అమాంతంగా దిగజారిపోయే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ పరిస్థితి రావడానికి తెరాస సర్కార్ స్వయం కృతమే అని చెప్పక తప్పదు. అన్ని రకాలుగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ లో ఒక్క సారిగా అనూహ్యంగా మార్పు రావడానికీ, విభేదాలను పక్కన పెట్టి మరీ హుజూర్ నగర్ లో నేతలంగా సమష్టిగా పని చేయడానికీ తెరాసయే కారణం అని చెప్పక తప్పదు.
 
హుజూర్ నగర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన నాటికీ...ఇప్పటికీ పరిస్థితులలో వచ్చిన మార్పుకు తెరాస సర్కార్ విధానాలే కారణమని చెప్పక తప్పదు. ఒక్కో నేత ఒక్కో అభ్యర్థిని ప్రకటించి విభేదాలతో నేతలు రచ్చకెక్కిన పరిస్థితి నుంచీ అందరూ కలిసి కాంగ్రెస్ అభ్యర్థి విజయం కోసం సమష్టిగా పని చేయడం వరకూ పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇందుకు ప్రధాన కారణం కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ ధోరణే. సమష్టిగా ఎదుర్కొనకుంటే..మనుగడ కష్టం అన్న భావన తెరాసేతర పార్టీలన్నిటిలోనూ కలిగిందనడంలో సందేహం లేదు.
 
ఆర్టీసీ సమ్మె, ఆ సమ్మెపై ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత ధోరణి ప్రజలలో కూడా ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతకు కారణమయ్యాయనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో తెరాసకు హుజూర్ నగర్ ఉప ఎన్నికలో విజయం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. అదే సమయంలో ప్రజా వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుని విజయం సాధించాలన్న పట్టుదలతో కాంగ్రెస్, కమలం పార్టీలు ఉన్నాయి.
 
ఈ రెండు పార్టీల హోరాహోరీ పోటీయే తెరాసకు హుజుర్ నగర్ లో విజయం పట్ల ఆశను ఇంకా మిగిల్చిందని చెప్పాల్సి ఉంటుంది. ఉనికి కోసమే పోటీలో ఉన్న తెలుగుదేశం కూడా ఏదో మేరకు ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఆ కారణంగానే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలక తమను గట్టెక్కిస్తుందన్న ధీమాతో తెరాస ఉంది. అయితే పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ నెమ్మది నెమ్మదిగా సీన్ మారుతున్నదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
 
సమస్యల పరిష్కారం విషయంలో సామరస్య ధోరణికి బదులుగా కేసీఆర్ సర్కార్ కఠినంగా వ్యవహరించడం కారణంగా తెరాసకు రాజకీయంగా నష్టం వాటిల్లే అవకాశాలే మెండుగా ఉన్నాయన్నది పరిశీలకుల విశ్లేషణ.   ఆర్టీసీ సమ్మె ప్రారంభమై 12 రోజులు గడిచినా పరిష్కారం దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇది ప్రజలలో ప్రభుత్వం పట్ల అసంతృప్తికి కారణం అవుతున్నది. కోర్టు  ఆదేశిస్తే తప్ప ఆర్టీసీ సమ్మె పరిష్కారం దిశగా కేసీఆర్ సర్కార్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. చివరికి కేకే వంటి సీనియర్ నేత మధ్యవర్తిత్వానికి ముందుకు వచ్చినా ఆయనకు కేసీఆర్ కనీసం అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. ఈ ధోరణే సర్కార్ ప్రతిష్ట మసకబారడానికి కారణమౌతున్నది. 
 
గత సార్వత్రిక ఎన్నికల సమయం నాటికే కేసీఆర్ సర్కార్ పట్ల ప్రజలలో అసంతృప్తి గూడుకట్టుకుంటున్నదన్న విషయం తేటతెల్లమైంది. అనూహ్యంగా బీజేపీ నాలుగు స్థానాలు కైవసం చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. ఆర్టీసీ సమ్మె ప్రభావం హుజూర్ నగర్ ఎన్నికపై ఏదో మేరకు ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే అది ఏ మేరకు ఉంటుందన్నది తేలేది మాత్రం ఫలితం వెలువడిన తరువాతే. తెలంగాణ ఉద్యమ సమయంలో చురుకుగా కీలకంగా వ్యవహరించిన కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులతో తెలంగాణ సాధన ఘనతను పంచుకోవడానికి తెరాస అధినేత ఇష్టపడడం లేదన్నది సుస్పష్టం. అందుకే ఉద్యోగ సంఘాలనూ, ఆ సంఘాల నాయకులనూ కేసీఆర్ దూరం పెడుతూ వచ్చారు.
 
ఉద్యమ సమయంనాటి పోరాట స్ఫూర్తి ఇప్పుడు సమస్యల పరిష్కారంలో ఎవరూ చూపడానినకి ఆయన ఇష్టపడటం లేదనడానికి చర్చలతో పరిష్కారమవ్వాల్సిన ఆర్టీసీ వ్యవహారం సమ్మె వరకూ వెళ్లడమే కాకుండా...ఉద్యోగుల ఉద్వాసన అంటూ చేసిన ప్రకటనతో కేసీఆర్ జటిలంగా మారిపోయింది. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలూ, వర్గ విభేదాలు లేకుండా సమాజంలోని అన్ని వర్గాలూ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా,  కార్మికులకు బాసటగా నిలవడమే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హుజూర్ నగర్ లో గురువారం ఎన్నికల ప్రచార సభలో ప్రసగించనున్నారు.
 
ఈ సందర్భంగా ఆయన అనివార్యంగా ఆర్టీసీ సమ్మెపై ఏదో ఒక ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఆ ప్రకటన సమస్య పరిష్కారం దిశగా ఉంటుందా?  సమ్మెను అణచివేసే వైఖరిని సమర్ధించుకునేలా ఉంటుందా అన్న ఉత్కంఠ ఇప్పుడు సర్వత్రా నెలకొని ఉంది. హుజుర్ నగర్ ప్రచార సభలో కేసీఆర్ ప్రసంగంపైనే ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సమ్మె పరిష్కారం దిశగా చర్చల ప్రక్రియ ప్రారంభం అయితే పరిస్థితి ఒకింత మారే అవకాశం ఉంది. ఏది ఏమైనా హుజూర్ నగర్ ఉప ఎన్నిక తెరాసకు, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిందనడంలో సందేహం లేదు.
 
చంద్రబాబుని కలిసిన మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ

చంద్రబాబుని కలిసిన మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ

   an hour ago


మాయగాళ్ళకు కేంద్రంగా ఏపీ..!

మాయగాళ్ళకు కేంద్రంగా ఏపీ..!

   an hour ago


మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతారా.. సిద్ధమే: ఒవైసీ

మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతారా.. సిద్ధమే: ఒవైసీ

   3 hours ago


కేజ్రీవాల్ మాటలో మార్పు.. పోరాటం వదిలి సర్దుకుపోయే ధోరణి!

కేజ్రీవాల్ మాటలో మార్పు.. పోరాటం వదిలి సర్దుకుపోయే ధోరణి!

   3 hours ago


అయ్య బాబోయ్.. గాంధీతో కేసీఆర్‌కు పోలికా?

అయ్య బాబోయ్.. గాంధీతో కేసీఆర్‌కు పోలికా?

   5 hours ago


రాజధాని మాటేమో కానీ విశాఖలో రియల్ బూమ్‌..

రాజధాని మాటేమో కానీ విశాఖలో రియల్ బూమ్‌..

   5 hours ago


కేంద్రంతో సయోధ్యకు కేజ్రీవాల్ ప్రయత్నాలు

కేంద్రంతో సయోధ్యకు కేజ్రీవాల్ ప్రయత్నాలు

   7 hours ago


కాశ్మీర్‌పై జోక్యం వద్దు.. ఐక్యరాజ్యసమితికి భారత్ ఘాటు జవాబు

కాశ్మీర్‌పై జోక్యం వద్దు.. ఐక్యరాజ్యసమితికి భారత్ ఘాటు జవాబు

   7 hours ago


అక్షరాస్యత, పరిశుభ్రతలో ఆంధ్రా అమ్మాయిలదే అగ్రపీఠం

అక్షరాస్యత, పరిశుభ్రతలో ఆంధ్రా అమ్మాయిలదే అగ్రపీఠం

   8 hours ago


‘‘తెలంగాణపై వివక్ష ప్రశ్నేలేదు.. మాకన్ని రాష్ట్రాలు సమానమే’’

‘‘తెలంగాణపై వివక్ష ప్రశ్నేలేదు.. మాకన్ని రాష్ట్రాలు సమానమే’’

   9 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle