newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు డెడ్ లైన్.. చర్చలు జరపాలని ఆదేశం

15-10-201915-10-2019 17:39:10 IST
Updated On 15-10-2019 18:12:15 ISTUpdated On 15-10-20192019-10-15T12:09:10.417Z15-10-2019 2019-10-15T12:08:53.371Z - 2019-10-15T12:42:15.426Z - 15-10-2019

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు డెడ్ లైన్.. చర్చలు జరపాలని ఆదేశం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెలో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాలని హైకోర్టు సూచించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఆర్టీసీ సమ్మెపై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం, ఆర్టీసీ యూనియన్ల పట్టుదల మధ్యలో ప్రజలు నలిగిపోతున్నారని న్యాయస్థానం అభిప్రాయపడింది. పండుగలు, పాఠశాలు కొనసాగుతున్న తరుణంలో సమ్మె ఎంతవరకు సమంజసమని కోర్టు తెలిపింది.

అయితే చర్చలు జరిపే వీలు లేకుండా పోయిందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.అలాగే విచారణలో భాగంగా ప్రభుత్వానికి, యూనియన్లకు హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. కార్మికులు నిరసన తెలిపేందుకు అనేక మార్గాలున్నాయని కోర్టు తెలిపింది.  ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయపరమైనవే కావొచ్చు కానీ... సమ్మె చట్ట విరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించిన ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదించారు. ఆర్టీసీని విలీనం చేస్తే మరికొన్ని కార్పొరేషన్‌లు ప్రభుత్వంలో కలపాలని డిమాండ్లు చేస్తాయని ఆయన కోర్టుకు వివరించారు. అయితే కార్మికుల డిమాండ్ల ప్రస్తావన ఇక్కడ అనవసరమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజల ఇబ్బందులనే తమ ముందు ప్రస్తావించాలని తెలిపింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే పాఠశాలలకు సెలవులు ఎందుకు పొడిగించారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

ఆర్టీసీ సమ్మె విరమణకు ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణ సందర్భంగా కార్మికులను ప్రభుత్వం సెల్ఫ్‌ డిస్మిస్‌ చేసిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ నిర్ణయంతో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆర్టీసీ జేఏసీ తెలిపింది. సమ్మె విరమిస్తే తమ సమస్యలు పరిష్కారం కావని జేఏసీ పేర్కొంది. అయితే ఇంకా ఈ అంశంపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. దీంతో కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందో అన్న ఆసక్తి నెలకొంది. 

విచారణ సందర్భంగా మహారాష్ట్ర, గుజరాత్ లో రవాణ వ్యవస్థ బాగుందని, అందుకే అక్కడ పెట్టుబడులు వస్తున్నాయి.. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు ప్రారంభించాలి.  రెండు రోజుల్లో కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించింది. ఆర్టీసీ సమ్మెపై తదుపరి విచారణను అక్టోబర్ 18 కి వాయిదా వేసింది హైకోర్ట్.  సమ్మె విరమించే ప్రసక్తే లేదని, అయితే చర్చలకు తాము సిద్ధమని ఆర్టీసీ జేఏసీ పేర్కొంది. హైకోర్టులో విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం రెండు రోజుల్లో చర్చల ప్రక్రియను ముగించాలని సూచించిందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో అటు కార్మికులు-ఇటు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle