newssting
Radio
BITING NEWS :
శరన్నవరాత్రోత్సవాల్లో మూడో రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. * నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన. ఏపీ తీరానికి దక్షిణంగా పశ్చిమ వాయువ్య మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం. రెండ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అధికారులు. భారీ వర్షాలకు బెంబేలెత్తిపోతున్న హైదరాబాద్ వాసులు. భారీ వర్షాలపై మైకుల్లో నగరవాసులను అలర్ట్ చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. * దుర్గమ్మకు విజయవాడ ఎన్‌ఆర్ఐ తాతినేని శ్రీనివాస్ అనే భక్తుడి కానుక. రూ.45 లక్షల విలువైన ఏడువారాల వజ్రాల నగలు దుర్గగుడి ఈవో సురేశ్ బాబుకు అందజేత. * భారీ వర్షాలకు కుంగిన పురానాపూల్ బ్రిడ్జి. వరద నీటి ఉద్ధృతి పెరగడంతో పిల్లర్ కుంగుబాటు. వాహనాల రాకపోకలు నిలిపివేత. మరమ్మతులు పూర్తయిన అనంతరం వాహనాల రాకపోకల పునరుద్ధరణ. * అసోం, మిజోరం గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ. సరిహద్దుల వద్ద పరిస్థితి ఉద్రిక్తం. అసోం ప్రజలపై మిజోరం వాసుల దాడి. గుడిసెలు, స్టాల్స్‌కు నిప్పు పెట్టిన అసోం వాసులు. ప్రధాని, హోంశాఖకు సమాచారం అందించిన అసోం ముఖ్యమంత్రి. * కడప జిల్లా రాజాంలో గంజాయి ముఠా గుట్టురట్టు. 8 మంది అరెస్ట్, 53 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం.

ఆర్టీసీ సమ్మెపై సర్కారీ పట్టు... విపక్షాల విమర్శలు

05-10-201905-10-2019 18:28:11 IST
2019-10-05T12:58:11.684Z05-10-2019 2019-10-05T12:56:02.687Z - - 20-10-2020

ఆర్టీసీ సమ్మెపై సర్కారీ పట్టు... విపక్షాల విమర్శలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
డిమాండ్ల సాధనకు సమ్మెబాట పట్టిన ఆర్టీసీ కార్మికులకు విపక్షాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది.  కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు పలికారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

మరోవైపు, కార్మికుల న్యాయమైన హక్కులను కేసీఆర్‌ కాలరాస్తున్నారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  మండిపడుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను అణచివేయాలని చూస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికులను బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగులు, ప్రజలు ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవాలన్నారు.

ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులతో చర్చించి సమ్మె విరమింపజేయాలన్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ జనసమితి సైతం ఆర్టీసీ ఉద్యోగులకు తన మద్ధతు ప్రకటించడం విశేషం. ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం కేసీఆర్‌ అహంకార ధోరణి సరికాదని  కోదండరామ్‌ అన్నారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు జన సమితి మద్దతు తెలుపుతోందన్నారు. ఆర్టీసీ కార్మికులు దిగి రాకపోతే ఉద్యోగాలుండవ్‌ అనడం ప్రజాస్వామ్యంలో చెల్లదన్నారు. పండగవేళ ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. 

ప్రభుత్వం బెదిరింపులకు తాము బెదరడం లేదని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వథామ రెడ్డి అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

విధులకు హాజరుకాని వారిని తొలగించాలంటే.. ముందు తననే తొలగించాలని కోరారు. ఆదివారం బతుకమ్మలతో డిపోల ముందు నిరసన తెలియచేస్తామన్నారు. సోమవారం ఇందిరాపార్కు నిరాహారదీక్ష చేపడతామన్నారు. మొత్తం మీద ఆర్టీసీ సమ్మె తెలంగాణలో కాకరేపుతోంది. 

హ‌రీశ్ వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్..దుబ్బాక‌లో దుమ్ముదుమారం

హ‌రీశ్ వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్..దుబ్బాక‌లో దుమ్ముదుమారం

   9 hours ago


వ‌ల్ల‌భ‌నేని వంశీ దారెటు..? అనుచ‌రుల కొత్త స‌ల‌హా!

వ‌ల్ల‌భ‌నేని వంశీ దారెటు..? అనుచ‌రుల కొత్త స‌ల‌హా!

   13 hours ago


అమరావతిని తప్పించిన ఎక్స్‌ప్రెస్ వే.. కేంద్రం ఆమోదముద్ర

అమరావతిని తప్పించిన ఎక్స్‌ప్రెస్ వే.. కేంద్రం ఆమోదముద్ర

   16 hours ago


టీడీపీ కొత్త టీమ్

టీడీపీ కొత్త టీమ్

   16 hours ago


తల దూర్చకంటూ బీజేపీ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చిన జేపీ నడ్డా

తల దూర్చకంటూ బీజేపీ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చిన జేపీ నడ్డా

   17 hours ago


కరోనా కేసుల రికవరీలో దేశంలోనే నంబర్‌వన్‌ ఏపీ..

కరోనా కేసుల రికవరీలో దేశంలోనే నంబర్‌వన్‌ ఏపీ..

   18 hours ago


మీలో మాస్క్ మహారాజు ఎవరు.. తెలంగాణ సర్కార్ కొత్త ప్రచారం

మీలో మాస్క్ మహారాజు ఎవరు.. తెలంగాణ సర్కార్ కొత్త ప్రచారం

   19 hours ago


బీసీ నేతలు చేయలేని మేలు ఏపీ సీఎం చేశారు.. ఆర్‌. కృష్ణయ్య

బీసీ నేతలు చేయలేని మేలు ఏపీ సీఎం చేశారు.. ఆర్‌. కృష్ణయ్య

   19 hours ago


పాకిస్థాన్ ప్ర‌ధానికి మూడిన‌ట్లే ఉంది

పాకిస్థాన్ ప్ర‌ధానికి మూడిన‌ట్లే ఉంది

   19 hours ago


ఆంధ్రప్రదేశ్ కు పొంచి ఉన్న వరుణ భీభత్సం

ఆంధ్రప్రదేశ్ కు పొంచి ఉన్న వరుణ భీభత్సం

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle