newssting
BITING NEWS :
*కాకినాడలో ముగిసిన జనసేన రైతు సౌభాగ్యదీక్ష*పౌరసత్వ బిల్లుకి రాష్ట్రపతి ఆమోదం *అసోం, మేఘాలయ, త్రిపురల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు *ఐదో రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు..ఉపాధి హామీ నిధుల విడుదల కోరుతూ..నేడు అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేల ధర్నా*నేడు విశాఖలో సీఎం జగన్‌ పర్యటన..ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరు*దిగివస్తున్న ఉల్లి ధరలు...కిలో ఉల్లి 70-80 లోపే అమ్మకాలు *అమరావతి: ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌ని సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. గత ప్రభుత్వంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పనిచేసిన కృష్ణ కిషోర్*హైదరాబాద్‌: బంజారాహిల్స్ ఎస్‌బీటీ నగర్‌లో రౌడీ షీటర్ హత్య... రౌడీ షీటర్‌ సయీద్ నూర్‌ను హత్య చేసిన నలుగురు వ్యక్తులు, బంజారాహిల్స్ పీఎస్‌లో లొంగుబాటు*తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమల్లోఉంటాయి.. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు మృతదేహాలను భద్రపర్చాలి-సుప్రీంకోర్టు*కూల్చివేతలతో ప్రభుత్వాన్ని ప్రారంభించిన వైసీపీ.. అందరినీ కూల్చివేస్తోంది.. ఎంతోమంది కూలిపోయారు.. మీరెంత...? మీ 151 మంది ఎమ్మెల్యేలెంత?-పవన్*అసెంబ్లీలో మార్షల్ తీరుపై మండిపడ్డ చంద్రబాబు

ఆర్టీసీ సమ్మెపై జేఏసీ కీలక నిర్ణయం.. విరమించడం ఖాయమా?

19-11-201919-11-2019 16:04:58 IST
2019-11-19T10:34:58.873Z19-11-2019 2019-11-19T10:34:44.996Z - - 13-12-2019

ఆర్టీసీ సమ్మెపై జేఏసీ కీలక నిర్ణయం.. విరమించడం ఖాయమా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్టీసీ సమ్మె విరమించనున్నారా?

హైకోర్టు వ్యాఖ్యల ఫలితమేనా?

ఇంతకాలం సమ్మె చేసినా ఫలితం శూన్యమేనా?

లేబర్ కోర్టులో న్యాయం జరుగుతుందా?

కార్మికుల వత్తిడితో జేఏసీ ఏం చేయబోతోంది?

తెలంగాణ వ్యాప్తంగా ఇవే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. 45 రోజులుగా ఎడతెగని పోరాటం చేస్తున్న ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించడం ఖాయంగా కనిపిస్తోంది. హైకోర్టు వ్యాఖ్యలు, లేబర్ కోర్డులో తేల్చుకోమనడం.. లేబర్ కోర్టు ఏం చెబుతుందోననే ఉత్కంఠతో ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది.

ఆర్టీసీ సమ్మె కొనసాగింపుపై కార్మిక సంఘాల నేతలు ఆలోచిస్తున్నారు. సమ్మె వివాదాన్ని లేబర్‌ కోర్టుకు నివేదించడంతో ఇరకాటంలో పడ్డాయి కార్మిక సంఘాలు.

సమ్మె కొనసాగించాలా? వద్దా.. ఆపేస్తే ఎలా వుంటుందనే అంశాలపై ఆలోచిస్తున్నాయి. ఒకవేళ సమ్మె విరమించినా కార్మికులను విధుల్లోకి తీసుకునేందుకు ప్రభుత్వం నిరాకరిస్తే.. ఏం చేయాలనే దానిపైనా కార్మిక సంఘాల నేతలు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. టీఎంయూ, ఈయూ కార్మిక సంఘాల నేతలలు విడివిడిగా భేటీ అయి చర్చలు జరుపుతున్నారు.

మొత్తం 97 డిపోల ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఆర్టీసీ సమ్మె కొనసాగింపుపై కార్మిక సంఘాలు మంగళవారం కీలక ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది. ఆర్టీసీ సమ్మె విషయంలో కోర్టు పదే పదే చర్చలకు అవకాశం ఇచ్చింది. అయితే ప్రభుత్వమే నిస్సహాయత వ్యక్తం చేసింది. 

గత 45 రోజులుగా ఆర్టీసీ కార్మికుల ఆకాంక్షలను వ్యక్తం చేయడానికి కోర్టు అవకాశం కల్పించిందని అఖిలపక్ష నేతలు చెబుతున్నారు. ఇప్పటికీ సమ్మెను చట్ట వ్యతిరేకంగా గుర్తించడానికి కోర్టు అంగీకరించలేదని,, లేబర్ కోర్టులో తేల్చుకోవాలని కోర్టు సూచించిందన్నారు. సమ్మెపై హైకోర్టు తీర్పు కాపీ వచ్చేవరకు ఆందోళనలు కొనసాగించాలని, ఇవాళ్టి సడక్‌ బంద్‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామన్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle