newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

ఆర్టీసీ సమ్మెపై ఎన్జీవోల ఊగిసలాటకు కారణమేమిటి?

17-10-201917-10-2019 17:45:09 IST
2019-10-17T12:15:09.599Z17-10-2019 2019-10-17T12:15:07.520Z - - 25-02-2020

ఆర్టీసీ సమ్మెపై ఎన్జీవోల ఊగిసలాటకు కారణమేమిటి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ఆర్టీసీ సమ్మె విషయంలో టీఎన్జీవోలు ఊగిసలాటకు కారణమేమిటి? ఆర్టీసీ పరిరక్షణకు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు అన్ని వర్గాల నుంచీ మద్దతు లభిస్తున్నప్పటికీ ఎన్జీవోలు మాత్రం ఎందుకు ముందువెనుకలాడుతున్నారు. ఆర్టీసీ విలీనం, పీఆర్పీ వంటి డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు గత 13 రోజులుగా  సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.  ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ సహా అన్ని రాజకీయ పార్టీలూ (టిఆర్ఎస్ మినహా) మద్దుతుగా నిలిచాయి. అన్ని కార్మిక సంఘాలూ ఆర్టీసీ సమ్మెకు సంఘీభావం ప్రకటించాయి. ఎన్జీవోలు మాత్రం ఈ విషయంలో భిన్నంగా స్పందించారు.

తొలుత మద్దుతు ఉండదని ప్రకటించిన ఎన్జీవోల సంఘం ఆ తరువాత అన్ని వైపుల నుంచి వచ్చిన విమర్శలకు తలొగ్గి సమ్మెకు మద్దతు ప్రకటించింది. అయితే మళ్లీ ఈ నెల 18న ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా జరగనున్న రాష్ట్ర బంద్ లో పాల్గొనే విషయంలో ద్వైదీ భావంతో ఉంది. మద్దతు ప్రకటించి మిన్నకుంటే మేలని భావిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. ఇందుకు కారణమేమిటి? ఆర్టీసీ రాష్ట్ర బంద్ పిలుపునకు మద్దతు ప్రకటించడమే కాకుండా ప్రత్యక్షంగా పాల్గొనాలని ఇప్పటికే  బీజేపీ సహా ప్రధాన రాజకీయ పార్టీలూ, విద్యార్థి, యువజన, కార్మిక సంఘాలు  నిర్ణయించుకున్నాయి. అయితే ఎన్జీవోల సంఘం మాత్రం ఈ విషయంలో ముందు వెనుకలాడుతున్నది.

ఇందుకు ప్రధాన కారణం...సుదీర్ఘ కాలంగా ఎన్జీవోల సంఘం నాయకులకు కనీసం అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆర్టీసీ బంద్  నేపథ్యంలో అడిగిందే తడవుగా అప్పాయింట్ మెంట్ ఇవ్వడమే కాకుండా పీఆర్సీపై త్వరలో నిర్ణయం తీసుకుంటామంటూ అడగకుండానే హామీ కూడా ఇచ్చేశారు. దీంతో ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా బంద్ లో పాల్గొని ధర్నాలూ, రాస్తారోకోలకు దిగితే...కేసీఆర్ ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని వారి భయంగా తోస్తున్నది. అలాగని ఆర్టీసీ సమ్మె విషయంలో సానుకూలంగా ఉండకపోతే ఇతర సంఘాలు, ప్రజా సంఘాల ఆగ్రహానికి గురి కావలసి ఉంటుంది. ఈ కారణంగానే ఎన్జీవో నాయకులలో ఈ ఊగిసలాట.

రాజకీయా పార్టీల చేతుల్లోకి ఉద్యమాన్ని నెట్టవద్దంటూ టీఎన్జీవో సంఘం ఆర్టీసీ కార్మికులకు చేసిన సూచనపై సర్వత్రా విమర్శలు చెలరేగాయి. స్వయంగా టీఎన్జీవోలే నాయకుల ప్రకటన పట్ల ఆసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అప్పాయింట్ మెంట్ ఇచ్చి పీఆర్సీపై నోటి మాటగా ఒక హామీ ఇవ్వగానే ఆర్టీసీ కార్మికుల సమ్మె వెనుక రాజకీయం కనిపించిందా అన్న ప్రశ్నలకు టీఎన్జీవో నేతలు ఉక్కిరి బిక్కిరయ్యారు. దీంతో సమ్మెకు మద్దతు ప్రకటించేస్తే అంతా సద్దుకుంటుందని భావించారు.

కానీ బంద్ విషయంలో అలా ఒక ప్రకటన చేసి ఊరుకునే పరిస్థితి లేకపోవడంతో ఏం చేయాలో తేల్చుకోలేని పరిస్థితులలో ఉన్నారు. ప్రభుత్వం ఇంత కాలం పట్టించుకోకుండా ఇప్పుడు అవసరం కనుక పిలిచి హామీ పారేస్తే అన్ని మరచిపోయి ప్రభుత్వ పక్షాన నిలవడం ఎంత వరకూ సబబని టీఎన్జీవోలే నాయకులను నిలదీస్తున్న పరిస్థితి. బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొనాల్సిందే అన్న డిమాండ్ అన్ని వైపుల నుంచీ వస్తుండటంతో  టీఎన్జీవో నేతలలో అంతర్మథనం మొదలైంది. సీఎం ఆగ్రహించి పీఆర్సీ విషయంలో వెనక్కు మళ్లితే తాము కూడా ఆందోళన బాట పట్టాల్సి వస్తుంది. అప్పుడు అన్ని సంఘాల నుంచీ మద్దతు లభిస్తుంది కదా అలా కాకుండా ఇప్పుడు ఆర్టీసీ సమ్మె విషయంలో తటస్థంగా ఉంటే భవిష్యత్ లో ఇతరుల నుంచి అవసరమైనప్పుడు మద్దతు లభించదన్న భావన కూడా టీఎన్జీవోలు వ్యక్తం చేస్తున్నారు.  ఏది ఏమైనా ఆర్టీసీ బంద్ కు సంఘీభావం ప్రకటించి బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా మాత్రమే కార్మిక ఐక్యతకు కట్టుబడి ఉన్నామని టీఎన్జీవోలు చాటి చెప్పాల్సిన అవసరం ఉంది.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle