newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

ఆర్టీసీ సమ్మెపై ఈ మౌనమేల?

19-10-201919-10-2019 07:51:09 IST
2019-10-19T02:21:09.254Z19-10-2019 2019-10-19T02:21:05.473Z - - 25-02-2020

ఆర్టీసీ సమ్మెపై ఈ మౌనమేల?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ఉద్యమ సమయం నుంచీ తెరాస గొంతు బలంగా వినిపించిందెవరయ్యా అంటే..కేసీఆర్ కుటుంబీకులే. అందులో సందేహం లేదు. తెలంగాణ ఆవిర్భావం తరువాత ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధించే విషయంలోనూ, విపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలోనూ బలమైన గొంతు కూడా ‘ ఆ ముగ్గురి’దే. ఆ ముగ్గురూ ఎవరంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తన్నీరు హరీష్ రావు, కల్వకుంట్ల కవిత. ప్రతి విషయంలోనూ ప్రభుత్వం తరఫున కానీ, పార్టీ తరఫున కానీ ఆ ముగ్గురే గట్టిగా మాట్లాడే వారు. అటువంటిది ఆర్టీసీ సమ్మె విషయంలో మాత్రం వారి మౌనం ఆశ్చర్యం కలిగిస్తున్నది.

గత పదిహేను రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. తెరాస ఏతర పార్టీలన్నీ సమ్మెకు సంఘీభావం ప్రకటించాయి. ఆర్టీసీ సమ్మె కు కారణం ప్రభుత్వ వైఖరేనని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి విమర్శలన్నీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు లక్ష్యంగానే చేస్తున్నారు. అయినా ఆ ముగ్గురూ ఇప్పటి వరకూ సమ్మెపై స్పందించ లేదు. విపక్షాల విమర్శలకు సమాధానం చెప్పలేదు. ఈ మౌనం వ్యూహాత్మకమా? లేక విపక్షాల విమర్శలలో పస ఉందని భావిస్తున్నారా?

అసలు ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ సర్కార్ అనుసరిస్తున్న వైఖరీ విపరీతంగానే ఉంది. ఎక్కడైనా డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె జరిగితే...ప్రభుత్వం కార్మిక సంఘ నేతలతో చర్చలు జరిపి పరిష్కార మార్గాలను అన్వేషిస్తుంది. అయితే కేసీఆర్ సర్కార్ మాత్రం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తేనే బాగుంటుంది అన్నట్లుగా వ్యవహరించింది. తీరా వారు సమ్మెకు దిగిన తరువాత...ఏకపక్షంగా సమ్మెకు దిగారనీ, పండుగ సమయం చూసి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడం కోసమే సమ్మె తలపెట్టారనీ విమర్శలు చేస్తూ...సమ్మెలో ఉన్న కార్మికులెవరూ ఆర్టీసీ ఉద్యోగులే కారని ప్రకటించేసింది.

ఆ ప్రకటన కూడా స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారు. తెలంగాణ సాధన కోసం అలుపెరుగని ఉద్యమానికి సారథ్యం వహించిన కేసీఆర్  కార్మికుల ఆందోళనపై ఇలా ఉక్కుపాదం మోపడమే తెలంగాణ వాదులను విస్మయానికి గురి చేస్తున్నది. ఉద్యమాలు, ఆందోళనలకు తెరాసదే పేటెంట్ అన్న చందంగా కేసీఆర్ సర్కార్ తీరు ఉన్నదని పరిశీలకులు సైతం విమర్శలు చేస్తున్నారు.

ఇదంతా ఒకెత్తయితే... తెరాసలో కేసీఆర్ తరువాత ప్రజలను ప్రభావితం చేయగలిగే నాయకులుగా గుర్తింపు పొందిన హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ సమ్మె విషయంలో ఇప్పటి వరకూ పెదవి విప్పలేదు. సమ్మె పరిష్కారానికి చొరవ తీసుకోవడానికి ముందుకు రాలేదు. సమ్మె విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో తమకు ఏ మాత్రం సంబంధం లేదన్నట్లుగా వారు వ్యవహరిస్తున్నారు. సమ్మెమై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి కూడా వారు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఏవైనా కార్యక్రమాలలో పాల్గొని ప్రసంగాలు చేసిన సందర్భాలలో కూడా వారెవరూ ఆర్టీసీ సమ్మె విషయాన్ని కనీసం ప్రస్తావించడం లేదు.

ప్రభుత్వ నిర్ణయాలలోనూ, ప్రభుత్వ పథకాలు, విజయాల ప్రచారంలోనూ అత్యంత కీలకంగా ఉండే కేటీఆర్, హరీష్ రావులు ఆర్టీసీ సమ్మె విషయంలో ఇంత మౌనంగా ఉండటం పార్టీ శ్రేణులను సైతం నివ్వెర పరుస్తున్నది. ఆర్టీసీ కార్మికులకు వ్యతిరేకంగా కేసీఆర్ చేస్తున్న ప్రకటనలు, వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నా...వాటిని ఖండించకుండా హరీష్, కేటీఆర్ మౌనంగా ఉండటం ఏ వ్యూహమో అర్ధం కాక పరిశీలకులు కూడా తలలు పట్టుకుంటున్నారు. అయితే సామాజిక మాధ్యమంలో మాత్రం వీరి మౌనానికి పలు రకాల భాష్యాలు వినిపిస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా ఆర్టీసీ సమ్మె విషయంలో ముఖ్యమంత్రి వైఖరి సరైనది కాదని వీరు భావిస్తుండటం వల్లనే మౌనంగా ఉన్నారన్న వార్త విస్తృతంగా ప్రచారం అవుతున్నది. హరీష్ రావును ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు దేవుడిగా అభివర్ణిస్తూ...అదే సమయంలో కేసీఆర్ పై విమర్శలు గుప్పించడం ఈ అనుమానాలకు తావిస్తున్నది.

తెరాసలో ఏ సంక్షోభం వచ్చినా దానిని అధిగమించేందుకు ముందుగా అడుగు కదిపేది తన్నీరు హరీష్ రావే...ఆ తరువాత కేటీఆర్. అయితే గత 15 రోజులుగా ప్రజలు అష్టకష్టాలూ పడటానికి కారణమైన ఆర్టీసీ సమ్మె పరిష్కారం విషయంలో వారిరువురూ ఎటువంటి ప్రయత్నం చేయకపోవడం వల్లనే ఆర్టీసీ సమ్మె పట్ల వారు సాను భూతితో ఉన్నారన్న ఊహాగానాలకు తావిస్తున్నది. ఏది ఏమైనా సమ్మె పరిష్కారానికి వీరిరువురూ చొరవ తీసుకుంటేనే ఏదో మేరకు పురోగతి ఉంటుందన్న భావన జన బాహుల్యంలోనే కాదు, పార్టీ శ్రేణుల్లో కూడా బలంగా వ్యక్తమౌతున్నది.

 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle