newssting
BITING NEWS :
*తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుంది... లాక్ డౌన్ కొనసాగించాలని మోడీకి చెబుతా*-కేసీయార్ *ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 303 *ఎంపీల వేతనాల్లో 30 శాతం కొోత *న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మొత్తంగా 364కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

ఆర్టీసీ సమ్మెతో జనం విలవిల

07-10-201907-10-2019 08:59:47 IST
2019-10-07T03:29:47.580Z07-10-2019 2019-10-07T03:28:27.589Z - - 07-04-2020

ఆర్టీసీ సమ్మెతో  జనం విలవిల
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకవైపు దసరా పండుగ.. బతుకమ్మ వేడుకలు.. మరోవైపు తిరగని బస్సులతో స్వంత ఊళ్ళకు వెళ్లేవారి అవస్థలు అన్నీ ఇన్నీ కావు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ ఉద్యోగుల సమ్మె ప్రభావం ప్రయాణీకులకు నరకం చూపిస్తోంది.

ఈ సారి విజయదశమి మంగళవారం రావటంతో సోమవారం ఒక్కరోజు సెలవు పెట్టుకుంటే శని, ఆదివారాల సెలవురోజులు కలిసిరావటం వల్ల నగర వాసులు నాలుగురోజుల పల్లెబాటకు ఎంతో ఉత్సాహపడ్డారు. అయితే వారి ఉత్సాహం ఆర్టీసీ సిబ్బంది సమ్మెతో నీరుగారిపోయిందనే చెప్పాలి.

గతంలో ఆర్టీసీ టిక్కెట్టు చించి పంచ్‌ చేసి ఇచ్చేది. కానీ ఇప్పుడంతా టిమ్స్ మెషీన్లే. దీంతో వాటిని ఉపయోగించడం రాని ప్రైవేట్ సిబ్బంది అందినకాడికి దండుకుంటున్నారు.

ప్రయాణీకులనుంచి నేరుగా చార్జీలు వసూలు చేసే అవకాశం అధికారులు కల్పించారు. ఎంత మంది ఏ స్టేజి వరకూ ప్రయాణిస్తారో చార్జీ వసూలు చేస్తున్న కండెక్టర్‌ చిత్తుకాగితంపై టిక్ వేసి చార్జీ వసూలు చేస్తున్నారు. దీంతో టికెట్ ఎంత తెలీక ప్రయాణికులకు జేబుకు చిల్లుపడుతోంది. 

హైదరాబాద్‌ నుంచి ఇటు రాయలసీమ, అటు కోస్తాంధ్ర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేటు బస్సుల్లో అదనపు చార్జీల పేరుతో ప్రయాణీకులను నిలువునా పిండేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి రూ.16వందలు, హైదరాబాద్-భీమవరం రూ.1500 వసూలు చేస్తున్నారు.  హైదరాబాద్‌ నుంచి విజయవాడకు కూడా రూ.1100వసూలు చేస్తున్నారు.

అయితే ఈ చార్జీలు ఒక్కో ప్రైవేటు ఆపరేటర్‌ ఒక్కో విధంగా వసూలు చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి భద్రాచలంకు వెయ్యిరూపాయలు వసూలు చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.  వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు నడిచే బస్సుల్లో రూ.300 పైగా వసూలు చేస్తున్నారు. 

ఇటు ఆర్టీసీ కార్మికుల సమ్మె అటు ప్రైవైటు ఆపరేటర్ల చార్జీల దోపిడి భరించలేక కొందరు పండగ ప్రయాణాలను వాయిదావేసుకుంటున్నారు. తప్పని సరిగా వెళ్లాల్సివస్తే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. ఆర్టీసీ సమ్మె కారణంగా రైళ్ళలో రద్దీ ఏర్పడింది. సికింద్రాబాద్, లింగంపల్లి, నాంపల్లి రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో ప్రయాణికులను క్యూ లైన్లలో పంపేందుకు లాఠీలకు పని చెప్పారు రైల్వే పోలీసులు. 

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

   4 hours ago


కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

   9 hours ago


తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

   9 hours ago


కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

   11 hours ago


ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

   14 hours ago


బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

   14 hours ago


‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

   15 hours ago


డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

   15 hours ago


గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

   17 hours ago


లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

   17 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle