newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

ఆర్టీసీ రూటు ఇక ప్రైవేటేనా.. వెనక్కు తగ్గని సిబ్బంది

06-11-201906-11-2019 09:05:15 IST
2019-11-06T03:35:15.833Z06-11-2019 2019-11-06T03:35:09.636Z - - 22-02-2020

 ఆర్టీసీ రూటు ఇక ప్రైవేటేనా.. వెనక్కు తగ్గని సిబ్బంది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తాను పెట్టిన గడువు తేదీలోగా విధుల్లో చేరితే సరి.. లేకపోతే ఆర్టీసీకి చెందిన మొత్తం పదివేల బస్సుల స్థానంలో ప్రైవేటుకు పర్మిట్లు ఇచ్చేస్తా అంటూ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ హెచ్చరించినా ఆర్టీసీ సిబ్బంది సమ్మె బాట వీడలేదు. ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేసినా, 48 వేలమంది సిబ్బంది ఉద్యోగాలు పోతాయని బెదిరించినా తిరిగి విధుల్లో చేరిన వారి సంఖ్య మంగళవారం రాత్రికి కూడా 300కు మించకపోవడంతో ప్రభుత్వానికి ఘోరావమానం జరిగినట్లే. దీంతో రాష్ట్రంలోని అన్ని బస్సు రూట్లనూ ప్రైవేటుకు అప్పగించి న్యాయవివాదంలోనే తాడో పేడో తేల్చుకునే దిశగా కేసీఆర్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. వచ్చే రెండు రోజుల్లో పర్మిట్లపై నిర్ణయం తీసుకుని ఆ మేరకు హైకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు అధికార వర్గాల ఉవాచ.

ఉద్యోగాల్లో చేరాలని ఇచ్చిన గడువును కార్మికులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఇక తనదైన దారిలోనే ముందుకు సాగాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించుకున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు సమాచారం. ‘‘ఇక ఆర్టీసీ కథ ముగిసిపోయినట్లే. ఆర్టీసీ ఇప్పుడున్న రూపంలో ఇక ఎంతమాత్రం కొనసాగదు. ఇది ఖాయం. ఇందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధపడుతోంది’’ అని ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి.

సమ్మె పట్ల ఇంత మొండిగా వ్యవహరించాక ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు తలొగ్గితే భవిష్యత్తులో వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఒత్తిళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఆర్టీసీ సమ్మెను తన పరువు ప్రతిష్టల కిందికి తీసుకున్న కేసీఆర్ ఏది ఏమైనా కఠినంగానే వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఆర్టీసీ విషయంలో ముఖ్యమంత్రి వెనక్కు తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. అలాగని కార్మికుల డిమాండ్లకు తలొగ్గే పరిస్థితి కూడా లేదు. అవసరమైతే ఈ సమ్మెను, దానిపై నిర్ణయాన్ని న్యాయస్థానాలకు వదిలి వేయాలని, ప్రజలకు రవాణా సౌకర్యాల విషయంలో తమదైన ప్రత్యామ్నాయ నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ న్యాయ వివాదం ఎంత సుదీర్ఘంగా కొనసాగినా అందుకు సిద్ధపడాలని, అక్కడే అమీ తుమీ తేల్చుకోవాలని కూడా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు వివరించాయి. అత్యంత పకడ్బందీగా అఫిడవిట్లు దాఖలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 

మొత్తంమీద, 49,733 మంది ఆర్టీసీ సిబ్బందిలో 300 లోపు కార్మికులు మాత్రమే విధుల్లో చేరారు. విధుల్లో చేరినవారికి గత రెండుముూడు రోజులుగా పనులు అప్పగించకపోవడంతో వారిలో కొందరు మళ్లీ సమ్మె బాటపట్టారు. దీంతో తాను ఇచ్చిన డెడ్‌లైన్‌ ఏ ఫలితాన్నీ సాధించకపోవడంతో సీఎం కేసీఆర్‌ అవమానంగా భావిస్తున్నట్లు సమాచారం. డెడ్‌లైన్‌లోగా విధుల్లో చేరకపోతే.. 6న మరో కీలక నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్‌ అప్పుడే హెచ్చరించారు. మిగిలిన 5000 బస్సులకూ ప్రైవేటు పర్మిట్లు ఇచ్చేస్తామని హెచ్చరించారు. తాజా పరిణామాల నేపథ్యంలో, సీఎం కేసీఆర్‌ తన వైఖరికే కట్టుబడి ఉండాలని నిర్ణయించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

ఒకటి మాత్రం నిజం. దేశ చరిత్రలో దాదాపు 50 వేలమంది ఉద్యోగులను విధులనుంచి తొలగించిన ఘటన ఎన్నడూ జరగలేదు. తమిళనాడులో జయలలిత లక్షకుపైగా ప్రభుత్వ ఉద్యోగులను తొలగించినా తర్వాత కోర్టు ఆదేశంతో వారి వద్ద క్షమాపణ పత్రం రాయించుకుని అందరికి ఉద్యోగాలను ఇవ్వక పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ మొండి పట్టు పట్టినా న్యాయవ్యవస్థ గుడ్డిగా ప్రభుత్వాన్ని సమర్థించదని చాలామంది ఆశాభావంతో ఉన్నారు.

ప్రభుత్వం మొడిపట్టు పట్టి సుప్రీంకోర్టు వరకు వెళితే ఆర్టీసీ సిబ్బంది పరిస్థితి దారుణంగా ఉంటుంది. పైగా నవంబర్ 9 తర్వాత రాష్ట్రంలో ప్రైవేట్ బస్సులను తిరగనీయమని విద్యార్థి, ఉద్యోగ సంఘాలు ప్రకటించడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పే ప్రమాదం పొడసూపుతోంది.

న్యాయవ్యవస్థ ఎంత త్వరగా స్పందించి ఈ సమస్యను పరిష్కరించకపోతే వ్యవహారం ప్రభుత్వం మెడకు చుట్టుకునే  ప్రమాదం తప్పదనిపిస్తోంది. కాగా కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఆర్టీసీని ప్రైవేటీకరించడం సాధ్యం కాదని జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి స్పష్టంచేశారు. మంగళవారం హైదరాబాద్‌లో రాజకీయ పక్షాలతో సమావేశమైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రకటనలు చూసి భయాందోళనకు గురికావద్దని కార్మికులకు సూచించారు. కోర్టులో సాగుతున్న న్యాయపోరాటాన్ని బలహీన పరచడానికి ముఖ్యమంత్రి వేస్తున్న ఎత్తుగడలనే సంగతి గ్రహించాలని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం భేషజాలకు పోకుండా జేఏసీతో చర్చలు జరిపి కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. 

 

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   an hour ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   2 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   3 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   4 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   4 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   5 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   6 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   7 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   7 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   8 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle