ఆర్టీసీ బస్సుల్లో శానిటైజర్లు.. కండక్టర్లకు మార్గదర్శకాలు
18-03-202018-03-2020 17:47:48 IST
2020-03-18T12:17:48.893Z18-03-2020 2020-03-18T12:17:45.771Z - - 10-04-2021

కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ, 30డిగ్రీలకు పైగా ఎండలు ఉన్నప్పటికీ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ప్రజారవాణా వ్యవస్థలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మెట్రో రైలు అధికారులు కూడా కరోనా వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనాతో ప్రయాణాలు చేసేవారి సంఖ్య తగ్గిపోయింది. ప్రతి రెండు గంటలకు ఒకసారి మెట్రో రైల్వే స్టేషన్లను శుభ్రం చేస్తున్నారు. ఆర్టీసీ బస్టేషన్లలోనూ ఇదే పరిస్ధితి కనిపిస్తోంది. డ్రైవర్ సీటుకి వెనుక హ్యాండ్ శానిటైజర్ బాటిల్ ఉంచుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పలు సూచనలను చేసి, ఆదేశాలను ఇచ్చింది. ఆ ఆదేశాలను కండక్టర్లు, డ్రైవర్లు తప్పకుండా పాటించాలని తెలిపింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్క కండక్టర్ల తమ వద్ద తప్పనిసరిగా హ్యాండ్ శానిటైజర్లను ఉంచుకోవాలని పేర్కొంది. ప్రయాణికుల వద్ద హ్యాండ్ శానిటైజర్ లేకపోతే కండక్టర్లు వెంటనే ప్రయాణికుల చేతిలో రెండు చుక్కలు వేయాలని తెలిపింది. అయితే కండక్టర్లు హ్యాండ్ శానిటైజర్లను కొననవసరం లేదని వాటిని ఆర్టీసీ యాజమాన్యమే సమకూర్చుతుందని సూచనల్లో పేర్కొన్నారు. కండక్టర్లు కూడా మాస్క్ లతో కనిపిస్తున్నారు. తద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఇలా కూడా సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని, వర్క్ ఫ్రం హోం వినియోగించుకోవాలని ఇటు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా గంట గంటకూ కోవిడ్ 19 మరణాలు పెరిగిపోతున్నాయి. ఇదిలా వుంటే కరోనా దెబ్బకి సీఎన్ఎన్ ఫిలిప్పీన్స్ చానల్ ప్రసారాలకు అంతరాయం ఏర్పడింది. ఆ టీవీ చానల్ ఉన్న బిల్డింగ్లో కరోనా పాజిటివ్ కేసు నమోదుకావడంతో.. ప్రసారాలు నిలిచిపోయాయి. కనీసం 24 గంటల పాటు తమ ప్రసారాలు నిలిచిపోనున్నాయని ఆ ఛానల్ ప్రకటించింది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
5 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
2 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
4 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
8 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
11 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
12 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
a day ago

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా