newssting
BITING NEWS :
*రాష్ట్రాలను కేంద్రం చిన్న చూపు చూస్తోందన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదు-కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ *ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ. 5 గంటల పాటు కొనసాగిన కేబినెట్ మీటింగ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్. పలు కీలక అంశాలపై చర్చించిన కేబినెట్ *కొత్తకోట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. డివైడర్ ఢీ కొట్టి తుఫాన్ వాహనం బోల్తా. ఇద్దరు మృతి. 14 మందికి తీవ్రగాయాలు, హాస్పిటల్ కు తరలింపు * ఇవాళ కెసిఆర్ బర్త్ డే. కెసిఆర్ పుట్టినరోజును మొక్కల పండుగగా జరపాలని తెరాస పిలుపు. రేపు ఉదయం నుంచి మొక్కలు నాటడం... రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపు *జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశం. పనిచేసే కార్యకర్తలకే జనసేన పార్టీలో ప్రాధాన్యత. కార్యకర్తల సలహాలు, సూచనలు తీసుకున్నా-పవన్ *రాజధాని మార్పు, పీఏఏల రద్దు తొందరపాటు నిర్ణయాలు, పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల కోర్టులకు వెళ్లే పరిస్థితి, శాసనమండలి రద్దు నిర్ణయం సరైంది కాదు-దగ్గుబాటి పురంధేశ్వరి*ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం... మూడోసారి సీఎంగా ప్రమాణం

ఆర్టీసీ ప్రైవేటీకరణ సిబ్బందికి, ప్రజలకూ పిడుగుపాటే

01-11-201901-11-2019 09:20:33 IST
Updated On 01-11-2019 17:50:50 ISTUpdated On 01-11-20192019-11-01T03:50:33.117Z01-11-2019 2019-11-01T03:50:31.389Z - 2019-11-01T12:20:50.581Z - 01-11-2019

ఆర్టీసీ ప్రైవేటీకరణ సిబ్బందికి, ప్రజలకూ పిడుగుపాటే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తమ డిమాండ్ల సాధనకు సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపట్ల అమానవీయంగా కఠిన వైఖరి ప్రదర్శిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఏడు దశాబ్దాలకుపైగా తెలంగాణలో ఎనలేని సేవలందించిన ప్రజారవాణా సంస్థను ప్రైవేట్ వ్యక్తుల చేతికి అప్పగించే పథకంలో భాగంగా ముందుకెళుతున్నారు. తాజా సమాచారం ప్రకారం రాష్ట్రంలో 4 వేల బస్సు రూట్లను ప్రైవేట్ పార్టీలకు కేసీఆర్ అప్పగించనున్నట్లు తెలుస్తోంది. 

కానీ కేసీఆర్ చర్యను తీవ్రంగా నిరసిస్తూ ఆర్టీసీ ప్రైవేటీకరణను ప్రాణాలున్నంతవరకు అడ్డుకుంటామని ఆర్టీసీ సిబ్బంది ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ తమకే కాకుండా ప్రజలకు కూడా పిడుగుపాటే కాబట్టి ఆర్టీసీ సిబ్బంది పోరాటానికి ప్రజలుకూడా మద్దతివ్వాలని కోరుతున్నారు.

టిఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నేత అశ్వత్ధామ రెడ్డి ఆర్టీసీ ప్రైవేటీకరణను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించమని శపథం చేశారు. 2014లో ఇదే కేసీఆర్ టీఎస్సార్టీసీని ప్రగత రథంగా అభివర్ణించారు. రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ తగినంత స్థాయిలో లేనందున టీఎస్ఆర్టీసీ మాత్రమే రాష్ట్రం నలుమూలలను అనుసంధానిస్తోందని ఆనాడు ప్రశంసించిన కేసీఆర్ ఇప్పుడు తనమాటల్ని తానే వెనక్కు తీసుకుని సంస్థనే మూసేయాలని చూస్తున్నారు అని థామస్ రెడ్డి ఆరోపించారు. 

ప్రభుత్వం మొండితనానికి పోయి కొన్ని రూట్లను ప్రైవేట్ పార్టీలకు అప్పగిస్తే తమకంటే ప్రజలే తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. ఒకసారి ప్రైవేట్ పార్టీలు రంగంలోకి దిగి రూట్లను కైవసం చేసుకున్నాక వారు సకాలంలో బస్సులు నడపరని, ప్రయాణీకులతో బస్సుపూర్తిగా నిండిన తర్వాతే దాన్ని కదిలిస్తారని, నష్టాలను వారు అసలు సహించరని థామస్ చెప్పారు. బస్సు చార్జీలను కూడా తమ ఇష్టానుసారం పెంచుతారని, వారిని నియంత్రించే వారే ఉండరని తెలిపారు. 

దాదాపు నాలుగు వారాల నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నా ఖాతరు చేయని కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ సర్వీసులను ప్రైవేట్ పరం చేయడానికే ముందుకు వెళుతుండటంతో ఆర్టీసీ కార్మికులు రగిలిపోతున్నారు.

ప్రస్తుతం ప్రభుత్వం పరిమిత స్థాయిలో ఆర్టీసీని ప్రైవేటీకరించడానికి పూనుకుంటున్నప్పటికీ ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేట్ బస్సులను రోడ్లపై తిరగనివ్వమని సమ్మెలోపాల్గొంటున్న టీఎస్ఆర్టీసీ డ్రైవర్ జి వెంకటేష్ చెబుతున్నారు. ఈరోజు 2 వేల బస్సులను ప్రైవేట్ పార్టీలకు ఇస్తామని ప్రభుత్వం అంటోంది కానీ రేపు రేపు మొత్తం ఆర్టీసీనే ప్రైవేట్ పార్టీల స్వాధీనపర్చడానికి కూడా ప్రభుత్వం సిద్ధమవుతుందని, దీన్ని అడ్డుకోవలసిన బాధ్యత మొత్తం సమాజంపైనే ఉందని పేర్కొన్నారు.

ఆర్టీసీ కొనసాగడం సిబ్బందికీ, ప్రజలకు కూడా ముఖ్యమే. మేం మాకోసం మాత్రమే పోరాడటం లేదు. ప్రజారవాణా సంస్థను కాపాడటానికి పోరాడుతున్నాం. ప్రజారవాణా సంస్థ ప్రైవీటీకరణకు గురయితే  లాభాలురాని గ్రామీణ ప్రాంతాలకు ప్రైవేట్ పార్టీలు ఒక్క బస్సును కూడా పంపరని, స్కూల్ బస్ పాస్‌లను అంగీకరించరని ఒకవేళ అంగీకరించినా రద్దీ సమయాల్లో విద్యార్థులను ప్రైవేట్ బస్సులవారు అసలు అనుమతించరని,. ఇతర రాష్ట్రాలుకూడా ఇదే అనుభవాలను ఎదుర్కొంటున్నాయని వెంకటేష్ చెప్పారు.

జేఏసీ నేత అశ్వత్ధామ రెడ్డి ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. నష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ లాభాలురాని రూట్లలో ఆర్టీసీ కార్మికులు సర్వీసులను నడుపుతున్నారు. ఎందుకంటే ఆరోగ్య సంరక్షణ వంటి ప్రాధమిక సర్వీసుగా మేం ఆర్టీసీని భావిస్తున్నాం. అందుకే టీఎస్సార్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజారవాణాను ఎలాగైనా సరే కాపాడుకోవలసిన సమయం ఆసన్నమైంది అని థామస్ రెడ్డి నొక్కి చెప్పారు.

తాను తల్చుకుంటే ఒక్క సంతకంతో 7వేల ప్రైవేట్ బస్సులను ప్రజారవాణా సర్వీసుకు అనుమతిస్తాని, దీంతో మొత్తం ఆర్టీసీ ఉద్యోగులు ఇంటికెళ్లాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నష్టాలు వచ్చే రూట్లలో ప్రైవేట్ బస్సులు నడవకపోతే వచ్చే విపరిణామాల గురించి పట్టించుకోకపోవడం విచారకరం.

చంద్రబాబుని కలిసిన మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ

చంద్రబాబుని కలిసిన మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ

   an hour ago


మాయగాళ్ళకు కేంద్రంగా ఏపీ..!

మాయగాళ్ళకు కేంద్రంగా ఏపీ..!

   an hour ago


మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతారా.. సిద్ధమే: ఒవైసీ

మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతారా.. సిద్ధమే: ఒవైసీ

   3 hours ago


కేజ్రీవాల్ మాటలో మార్పు.. పోరాటం వదిలి సర్దుకుపోయే ధోరణి!

కేజ్రీవాల్ మాటలో మార్పు.. పోరాటం వదిలి సర్దుకుపోయే ధోరణి!

   3 hours ago


అయ్య బాబోయ్.. గాంధీతో కేసీఆర్‌కు పోలికా?

అయ్య బాబోయ్.. గాంధీతో కేసీఆర్‌కు పోలికా?

   5 hours ago


రాజధాని మాటేమో కానీ విశాఖలో రియల్ బూమ్‌..

రాజధాని మాటేమో కానీ విశాఖలో రియల్ బూమ్‌..

   5 hours ago


కేంద్రంతో సయోధ్యకు కేజ్రీవాల్ ప్రయత్నాలు

కేంద్రంతో సయోధ్యకు కేజ్రీవాల్ ప్రయత్నాలు

   7 hours ago


కాశ్మీర్‌పై జోక్యం వద్దు.. ఐక్యరాజ్యసమితికి భారత్ ఘాటు జవాబు

కాశ్మీర్‌పై జోక్యం వద్దు.. ఐక్యరాజ్యసమితికి భారత్ ఘాటు జవాబు

   8 hours ago


అక్షరాస్యత, పరిశుభ్రతలో ఆంధ్రా అమ్మాయిలదే అగ్రపీఠం

అక్షరాస్యత, పరిశుభ్రతలో ఆంధ్రా అమ్మాయిలదే అగ్రపీఠం

   8 hours ago


‘‘తెలంగాణపై వివక్ష ప్రశ్నేలేదు.. మాకన్ని రాష్ట్రాలు సమానమే’’

‘‘తెలంగాణపై వివక్ష ప్రశ్నేలేదు.. మాకన్ని రాష్ట్రాలు సమానమే’’

   9 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle