newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

ఆర్టీసీ తెచ్చిన ముప్పు...కారుకు కమ్యూనిస్ట్ మద్దతు డౌటే

09-10-201909-10-2019 18:45:47 IST
Updated On 09-10-2019 18:45:43 ISTUpdated On 09-10-20192019-10-09T13:15:47.673Z09-10-2019 2019-10-09T13:15:31.094Z - 2019-10-09T13:15:43.541Z - 09-10-2019

ఆర్టీసీ తెచ్చిన ముప్పు...కారుకు కమ్యూనిస్ట్ మద్దతు డౌటే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉధృతమవుతోంది. కెసిఆర్ సర్కార్ వెనక్కు తగ్గే ఆలోచనలో లేకపోగా సమ్మెలో పాల్గొన్న ఉద్యోగుల స్థానాలలో కొత్తగా ఒప్పంద ఉద్యోగులను, కార్మికులను నియమించుకోవాలని డిసైడ్ అయింది. కనీసం సమ్మెను విరమింపజేసేందుకు కూడా ప్రయత్నాలు చేసేది లేదని ఇప్పటికే తేల్చేసిన సీఎం కెసిఆర్ పై కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. తాత్కాలిక ప్రైవేట్ వ్యక్తులతో ఆర్టీసీని నడిపిస్తూ ఎన్నిరోజులని సమ్మెను అణచివేసి పోలీసుల సాయంతో బస్సులను తిప్పుతారని ప్రశ్నిస్తున్న కార్మిక సంఘాలు చాపకింద నీరులా సమ్మెను రాష్ట్రవ్యాప్తంగా ఉదృతం చేసేందుకు ప్రణాళికలను రాసుకుంటున్నారు.

ఆర్టీసీ సంఘాలకు ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ పార్టీల మద్దతు ప్రకటించగా ప్రజాసంఘాల మద్దతు కూడా ఆర్టీసీ జేఏసీ కూడగట్టింది. మొత్తం ఈరోజు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, ఆర్టీసీ కార్మిక సంఘాలు అఖిలపక్ష సమావేశమై చర్చలు జరిపారు. రేపు కూడా చర్చలు జరిపి సర్కార్ మీద సమరానికి సిద్ధమవుతామని ప్రకటించారు. ఈనెల 9న రాష్ట్రవ్యాప్తంగా బంద్ కూడా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదే వేదిక నుండి సిపిఐ ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సీఎం కెసిఆర్ కు ఓ హెచ్చరిక కూడా పంపించారు. ఆర్టీసీపై ప్రభుత్వం నిర్ణయాన్ని తొలి నుండి వ్యతిరేకిస్తున్న సిపిఐ తాజాగా మరో షాక్ ఇచ్చింది.

నిజానికి మొన్న ఆర్టీసీ ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లుగా ప్రకటించిన రోజు సిపిఐ నేతలు ప్రభుత్వం తీరును వ్యతిరేకించినా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఉపఎన్నికల మద్దతును మాత్రం తెరాస పార్టీకే ఉంటుందని చెప్పుకొచ్చారు. ఒకపక్క మద్దతు ఇస్తూనే మరో పక్క ప్రభుత్వం నిర్ణయాలను వ్యతిరేకించడం ఏమిటని ప్రశ్నించినా అది అదే.. ఇది ఇదే అన్నట్లుగా చెప్పుకొచ్చారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితులలో మార్పులొచ్చాయి. ఈరోజు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీపై ప్రభుత్వ వైఖరిని మరోసారి పునఃపరిశీలించుకోవాలని.. లేకపోతే హుజూర్ నగర్ ఎన్నికలకు మద్దతు ఉపసంహరించుకునే ఆలోచన చేస్తామన్నారు.

అదే జరిగితే తెరాస పార్టీకి తీవ్ర నష్టం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే కమ్యూనిస్టుల పొత్తు కోసం కాంగ్రెస్ పార్టీ కాచుకుకూర్చుంది. కారును కాదని కమ్యూనిస్టులు హస్తానికి జతకడితే అక్కడ గెలుపు కష్టమే అవుతుంది. ఇక సమ్మెపై ఇదే పరిస్థితి కొనసాగితే ఎన్నికల సమయానికి ఆర్టీసీ ప్రజాసంఘాలను, పార్టీలను ఏకం చేసి రాష్ట్రవ్యాప్తంగా బంద్ లు, ఆందోళనకు దిగితే ప్రజలలో ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అన్ని విధాలా ప్రభుత్వాన్ని దెబ్బ పడే అవకాశం కనిపిస్తుంది. మరి కెసిఆర్ ఒక్క స్థానం కోసం పంతాన్ని వీడి వెనక్కు తగ్గుతారా? మొండిమనిషిగా పేరున్న సీఎం ముందుముందు ఏ నిర్ణయాలను తీసుకోనున్నారు? ఆర్టీసీ సమ్మె హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీకి కలిసొస్తుందా? అన్నది చూడాల్సి ఉంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle