newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

ఆర్టీసీ డ్రైవర్‌కు ఫిట్స్ .. మరొకరికి హార్ట్ ఎటాక్.. ఇంకొకరి సూసైడ్

08-11-201908-11-2019 09:23:35 IST
2019-11-08T03:53:35.695Z08-11-2019 2019-11-08T03:53:24.718Z - - 24-02-2020

ఆర్టీసీ డ్రైవర్‌కు ఫిట్స్ .. మరొకరికి హార్ట్ ఎటాక్.. ఇంకొకరి సూసైడ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సీఎం కేసీఆర్ ‘ప్రైవేట్’ పంతం

ఆర్టీసీ కార్మికుల ఆందోళనా పర్వం

ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల జీవన్మరణ పోరాటం

ప్రయాణికులకు సంకటం

ఇది తాజాగా తెలంగాణలో నెలకొన్న జీవనచిత్రం. హైకోర్టులో విచారణ వాయిదా పడడంతో ఆర్టీసీ కార్మికులు తమ ఆందోళనను కొనసాగించడం లేదు. ఆర్టీసీ సమ్మెతో కాంట్రాక్టు డ్రైవర్లు రోడ్డుమీదకు వచ్చారు. వీరి కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.

కొమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో బస్సు డ్రైవర్ కు ఫిట్స్ రావడంతో ప్రయాణికులు టెన్షన్ పడ్డారు. బస్సు రోడ్డుమీద రయ్యిమంటూ సాగుతుంటే.. అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చాయి. చాకచక్యంగా బస్సును ఆపేయడంతో ప్రమాదం తప్పింది.

రెబ్బెన మండలం ఇందిరా నగర్‌ సమీపంలో రెప్పపాటులో ప్రాణాలతో బయటపడ్డారు ప్రయాణికులు. మంచిర్యాల నుండి కాగజ్ నగర్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్‌కి హఠాత్తుగా ఫిట్స్‌ వచ్చాయి.  దీంతో ఒక్కసారిగా బస్సు అదుపు అటు ఇటూ కాస్తా కుదుపులకు గురైంది. పక్కనే ఉన్న గుంతలో పడిపోయే సమయంలో డ్రైవర్‌ బస్సును కంట్రోల్ చేశాడు.

వెంటనే ప్రయాణికులు అతడిని 108 వాహనంలో ఆస్పత్రికి పంపించారు. ఫిట్స్‌ వచ్చినా లెక్కచేయకుండా ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన డ్రైవర్‌ని అంతా అభినందించారు. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 

ఇదిలా ఉంటే వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపల్లిలో డ్రైవర్ గుండెపోటుకి గురయ్యారు. చీకటి వీరాస్వామి తొర్రూరు డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సమ్మెలో ఆయన పాల్గొంటున్నాడు. ఈ నెలాఖరున ఆయన రిటైర్ కావాల్సి ఉంది. విధుల్లో ఉంటేనే పదవీ విరమణ ప్రయోజనాలు అందుతాయని వచ్చిన వార్తలతో వీరాస్వామి టెన్షన్ పడ్డాడు. విధుల్లో చేరకపోతే రావాల్సిన డబ్బులు వస్తాయో రావోమేననే ఆందోళనతో గుండెపోటుకి గురయ్యాడు. హన్మకొండలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నాడు. 

ఆర్టీసీ సమ్మె.. ఉద్యోగం ఉంటుందో ఉండదో అని ఆందోళనతో ఓ ఆర్టీసీ మెకానిక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాణిగంజ్‌ డిపోలో మెకానిక్‌గా పని చేస్తున్న షేక్ బాబా ఇంట్లో ఉన్న గుళికల్ని కూల్‌డ్రింక్‌లో కలుపుకుని తాగాడు.

షేక్ బాబాది డబీర్ పూర్‌ గ్రామం. ఆత్మహత్యకు పాల్పడిన షేక్‌బాబాను గమనించిన కుటుంబ సభ్యులు  అతడిని చికిత్స కోసం నగర శివార్లలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ ఆస్పత్రికి తీసుకెళదామని భావించినా సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు అక్కడ వైద్యం చేయడానికి నిరాకరించడంతో కార్మికులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle