newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

ఆర్టీసీ జేఏసీ యాక్షన్ ప్లాన్... 9న ఛలో ట్యాంక్ బండ్

02-11-201902-11-2019 18:21:12 IST
2019-11-02T12:51:12.022Z02-11-2019 2019-11-02T12:49:57.934Z - - 25-02-2020

ఆర్టీసీ జేఏసీ యాక్షన్ ప్లాన్... 9న ఛలో ట్యాంక్ బండ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
డిమాండ్ల సాధనకు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె కీలకదశకు చేరుకుంది. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం, ఆత్మహత్యలు, గుండెపోట్లు పెరిగిపోవడంపై ఆర్టీసీ జేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈనెల 3న అమరుల కోసం పల్లెబాట, సమావేశాలు, 4న రాజకీయ పార్టీలతో డిపోల దగ్గర నిరాహార దీక్ష, 5న రహదారి దిగ్బంధం, 6న డిపోల ఎదుట నిరాహారదీక్ష, 7న ఆర్టీసీ కార్మికుల, రాజకీయ పార్టీల కుటుంబ సభ్యులతో డిపోల ముందు దీక్షలు నిర్వహించనుంది.

వీటితో పాటు ఈనెల 8న చలో ట్యాంక్ బండ్ సన్నాహక కార్యక్రమాలు. 9న ఛలో ట్యాంక్ బండ్. నిరసన దీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది ఆర్టీసీ జేఏసీ.

విద్యానగర్‌లోని ఎంప్లాయిస్‌ యూనియన్‌లో ఆర్టీసీ జేఏసీ, విపక్ష నేతలతో శనివారం సమావేశమయ్యారు. ఆర్టీసీ సమ్మెపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కలవనున్నట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి తెలిపారు. కార్మికులపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి గురించి అమిత్ షా వివరిస్తామని వెల్లడించారు.

ఆర్టీసీ జేఏసీ నేతలతో కలిసి ఈనెల 4 లేదా 5వ తేదీలలో అమిత్‌ షాతో భేటీ కానున్నారు. అలాగే ఆర్టీసీ విభజనపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్న అది చెల్లుబాటు కాదని అన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని అన్నారు. రూట్లను వేరుచేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు అశ్వత్థామరెడ్డి.  మరోవైపు తెలంగాణ కేబినెట్ ఆర్టీసీ సమ్మెపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle