newssting
BITING NEWS :
*జగన్ ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయ సాయి రెడ్డి, టీఎస్ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వీడీ రాజగోపాల్..ఈ రోజు కోర్టుకు హాజరు కాకుండా ఆబ్సెంట్ పిటిషన్ వేసిన ఏపీ సీఎం జగన్*ఐబీ అధికారి అంకిత్ శర్మ శరీరంపై 400 కత్తిపోట్లు..ఆరు గంటల పాటు పేగులు లాగి మరి చిత్రహింసలు. పోస్ట్ మార్టంలో వెల్లడవుతున్న నిజాలు * ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం పర్యటన .. అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్ *ఢిల్లీ పోలీసు కమిషనర్ గా ఎస్.ఎన్. శ్రీవాత్సవ నియామకం..మూడు రోజుల క్రితమే ఆయన్ను స్పెషల్ కమిషనర్ గా నియమించిన ప్రభుత్వం *రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి సమీపంలో ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదం..బస్సును వెనకనుండి ఢీకొన్న కల్వకుర్తి ఆర్టీసీ డిపో బస్సు..20 మంది విద్యార్థుల్లో 6గురికి గాయాలు..ఆసుపత్రికి తరలింపు*ఇవాళ జాతీయ సైన్స్ దినోత్సవం

ఆర్టీసీ జేఏసీ యాక్షన్ ప్లాన్.. 23న ఓయూలో భారీ బహిరంగ సభ

20-10-201920-10-2019 09:16:25 IST
2019-10-20T03:46:25.460Z20-10-2019 2019-10-20T03:46:07.686Z - - 28-02-2020

ఆర్టీసీ జేఏసీ యాక్షన్ ప్లాన్.. 23న ఓయూలో భారీ బహిరంగ సభ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తమ డిమాండ్ల పరిష్కారానికి ఆర్టీసీ జేఏసీ తన ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. ఆదివారం భారీ స్థాయిలో బంద్ నిర్వహించింది. బంద్ విజయవంతం అయిందని, కార్మికులు, ప్రజలు, విద్యార్ధులు, అన్ని వర్గాలు తమకు సహకరించాయని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

ప్రభుత్వం ఎంత నిర్బంధం విధించినా జనం స్వచ్ఛందంగా ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నిలిచి బంద్ ను విజయవంతం చేశారని చెప్పారు. సమ్మెను మరింత ఉధృతం చేస్తామన్నారు. 

ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం, హామీ లేకపోవడంతో కార్మికులు ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్రంలో బంద్ విజయవంతం కావడంతో ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యచరణ నిర్ణయించింది.

నిరంకుశంగా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్ ను ఇరుకున పెట్టేందుకు రెండు ప్రణాళికలు సిద్దం చేసినట్టు సమాచారం. తొలుత అన్ని రాజకీయ పార్టీ నేతలను కలిసి సమస్య తీవ్రతను వివరించాలని భావిస్తున్నారు. 

అలాగే రాష్ట్రంలోని 119 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలను కూడా కలిసి ఆర్టీసీ సమ్మెకు మద్దతు పలకాలని కోరనున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు, వేతనం రాకపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నామనే విషయాన్ని కూడా వారు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. దీంతోపాటు టీఆర్ఎస్ మిత్ర పక్ష పార్టీ ఎంఐఎంను కూడా తమ సమ్మెకు మద్దతు ఇవ్వాలని ఆర్టీసీ జేఏసీ కోరే అవకాశం ఉంది. 

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ లేదా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని కలసి మద్దతు కోరాలని జేఏసీ నిర్ణయించింది. అదే విధంగా ఈ 23న ఉస్మానియా యూనివర్సిటీలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించినట్టు తెలిసింది.

తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర, ఉస్మానియా యూనివర్శిటీ పాత్రను ఆర్టీసీ జేఏసీ గుర్తించింది. అందుకే విద్యార్ధుల శక్తిని కేసీఆర్ కు తెలియచేసేందుకు బహిరంగ సభ ప్లాన్ వేసింది. 

నిరసనల్లో భాగంగా ఆర్టీసీ కార్మికులు ఆదివారం అన్ని డిపోలు, కూడళ్ల వద్ద ప్లకార్డులతో నిరనస ప్రదర్శనలు నిర్వహించనుంది. ఇటు ఏపీ నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు బాసట లభించింది.  తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఏపీ ఎన్జీవోలు మద్దతు ఇచ్చారు.

ఆలిండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపు మేరకు విజయవాడలో ఏపీ ఎన్జీవోలు భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు చేశారు. ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు, ఆలిండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. 

 

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

   3 hours ago


టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

   6 hours ago


కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

   6 hours ago


పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

   11 hours ago


వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

   11 hours ago


కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

   12 hours ago


అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

   13 hours ago


 మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

   14 hours ago


కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

   14 hours ago


వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

   15 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle