newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

ఆర్టీసీ జేఏసీ: టీఆర్ఎస్ నేతల ఇళ్ళ ముట్టడికి యత్నం.. అరెస్టులు

11-11-201911-11-2019 16:02:11 IST
Updated On 11-11-2019 16:02:10 ISTUpdated On 11-11-20192019-11-11T10:32:11.989Z11-11-2019 2019-11-11T10:31:32.123Z - 2019-11-11T10:32:10.475Z - 11-11-2019

ఆర్టీసీ జేఏసీ: టీఆర్ఎస్ నేతల ఇళ్ళ ముట్టడికి యత్నం.. అరెస్టులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా 38వ రోజు సోమవారం అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కార్మికులు చేస్తున్న సమ్మె గురించి సీఎంకు వివరించి ఆయనలో మార్పు తీసుకువచ్చేలా చూడాలని కార్మికులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఇళ్ళ ముట్టడికి సిద్ధపడ్డారు. వివిధ జిల్లాల్లో ప్రజా ప్రతినిధుల ఇళ్ల ఎదుట నిరసనలకు దిగారు. దీంతో పోలీసులు ఆర్టీసీ జేఏసీ, కాంగ్రెస్‌, సీపీఐ నేతలను అడ్డుకున్నారు. పలువురు నేతలను అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ లో మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర భారీ భద్రత ఏర్పాటుచేశారు. అటువైపు వెళ్లే వాహనాలను దారి మళ్ళించారు. దీంతో వాహనదారులు అవస్థలుపడ్డారు. బంజారాహిల్స్ లోని రోడ్డు నెంబర్ 10లో ఉన్న మంత్రుల నివాసాల వద్ద పోలీసులు భారీగా మోహరించి.. ఆర్టీసీ కార్మికులు రాకుండా అడ్డుకున్నారు. 

సిద్ధిపేటలో మంత్రి తన్నీరు హరిశ్‌రావు ఇంటి ముట్టడికి ఆర్టీసీ కార్మికులు, ప్రజా సంఘాలు, అఖిలపక్ష నాయకులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటచేసుకుంది. దీంతో ఓ కార్మికురాలు స్పృహ తప్పిపడిపోవడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇటు సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు. తమ న్యాయమైన డిమాండ్లను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి కూడా ఆర్టీసీ కార్మికుల సెగ తప్పలేదు. 

Image may contain: 22 people, people smiling, crowd and outdoor

మంత్రి దయాకర్ రావు నివాసాన్ని ముట్టడించే అవకాశం ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు. హన్మకొండలోని రాంనగర్ లో మంత్రి ఇంటిముందు కార్మికులు నిరసనకు దిగారు. ప్రభుత్వ విప్, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఇంటి ముట్డడి కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిరసనకారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.

వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ ఇంటితో పాటు నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి క్యాంపు కార్యాలయం ముందు నిరసన తెలిపారు. నర్సంపేట బస్ డిపో నుంచి ర్యాలీ నిర్వహించారు కార్మికులు. హైకోర్టులో సోమవారం విచారణ జరగనున్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష నేతలు మరోసారి భేటీకావాలని భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.

Image may contain: 10 people, people smiling, people standing and outdoor

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle