newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

ఆర్టీసీ జేఏసీ ఛలో ట్యాంక్ బండ్ .. పోలీసులు అప్రమత్తం

09-11-201909-11-2019 10:12:11 IST
2019-11-09T04:42:11.227Z09-11-2019 2019-11-09T04:41:40.308Z - - 22-02-2020

ఆర్టీసీ జేఏసీ ఛలో ట్యాంక్ బండ్ .. పోలీసులు అప్రమత్తం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్టీసీ జేఏసీ తన నిరసనల్లో భాగంగా ట్యాంక్ బండ్‌పై శనివారం 'సకల జనుల సామూహిక దీక్ష’ నిర్వహిస్తోంది. ఈనేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ట్యాంక్‌బండ్‌పై పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సాయంత్రం 5 గంటలకు వరకు ట్యాంక్‌బండ్‌పై రాకపోకలు నిషేధించారు. ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లే రూట్లను వేరే మార్గాలకు మళ్లిస్తున్నారు. ప్రయాణికులు, పర్యాటకులు, సాధారణ ప్రజానీకం ఈ విషయం గమనించాలని కోరారు.

సికింద్రాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వచ్చే వాహనాలు కవాడిగూడ వైపు మళ్లించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డు నుంచి ఇందిరాపార్కు వచ్చే వాహనాలు అశోక్‌నగర్‌ వైపు మళ్లిస్తున్నారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ వైపు వెళ్లే వాహనాలు ఇతర మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు. హిమాయత్‌నగర్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వచ్చే వాహనాలు బషీర్‌బాగ్‌ వైపు మళ్లిస్తున్నారు. ఓల్డ్‌ ఎమ్మెల్యే రూట్‌ నుంచి వచ్చే వాహనాలు పీసీఆర్‌ జంక్షన్‌ వైపు మళ్లిస్తున్నారు. ఖైరతాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వచ్చే వాహనాలు మింట్‌కాంపౌండ్‌ వైపు మళ్లిస్తున్నారు. 

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు డిపోల వద్ద నిరసనలు తెలుపుతున్నారు. ఛలో ట్యాంక్ బండ్ కు వచ్చేవారిని పోలీసులు ఎక్కడికక్కడ నిలిపేస్తున్నారు. గద్వాలలో ఆర్టీసీ కార్మికులు, సీపీఐ, సీపీఎం నేతలు నిరసనకు దిగారు. వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, మాజీ మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ మంత్రి గీతారెడ్డిలను హైద్రాబాద్‌లో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను హన్మకొండలో గృహ నిర్బంధం చేశారు.

చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమానికి పోలీసులు అనుమతిని నిరాకరించారు.  ఎట్టి పరిస్థితుల్లోనూ చలో ట్యాంక్‌బండ్‌ చేపట్టి తీరుతామంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించడంతో నగరంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కార్యక్రమానికి అఖిలపక్షాల మద్దతు కూడా ఉండటంతో వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘాల నేతలు ట్యాంక్‌బండ్‌కు తరలివస్తున్నారు.

టీటీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, తెలంగాణ జన సమితి, తదితర పార్టీలకు చెందిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. జిల్లాల నుంచి హైదరాబాద్‌కు చేరుకోకుండా నిఘాను కట్టుదిట్టం చేశారు, ఓయూ,  ఇతర యూనివర్శిటీల విద్యార్ధులు పెద్ద ఎత్తున తరలి వస్తారని భావిస్తున్నారు. 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   6 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   7 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   8 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   8 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   9 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   9 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   11 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   12 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   12 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   13 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle