newssting
BITING NEWS :
*కాకినాడలో ముగిసిన జనసేన రైతు సౌభాగ్యదీక్ష*పౌరసత్వ బిల్లుకి రాష్ట్రపతి ఆమోదం *అసోం, మేఘాలయ, త్రిపురల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు *ఐదో రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు..ఉపాధి హామీ నిధుల విడుదల కోరుతూ..నేడు అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేల ధర్నా*నేడు విశాఖలో సీఎం జగన్‌ పర్యటన..ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరు*దిగివస్తున్న ఉల్లి ధరలు...కిలో ఉల్లి 70-80 లోపే అమ్మకాలు *అమరావతి: ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌ని సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. గత ప్రభుత్వంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పనిచేసిన కృష్ణ కిషోర్*హైదరాబాద్‌: బంజారాహిల్స్ ఎస్‌బీటీ నగర్‌లో రౌడీ షీటర్ హత్య... రౌడీ షీటర్‌ సయీద్ నూర్‌ను హత్య చేసిన నలుగురు వ్యక్తులు, బంజారాహిల్స్ పీఎస్‌లో లొంగుబాటు*తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమల్లోఉంటాయి.. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు మృతదేహాలను భద్రపర్చాలి-సుప్రీంకోర్టు*కూల్చివేతలతో ప్రభుత్వాన్ని ప్రారంభించిన వైసీపీ.. అందరినీ కూల్చివేస్తోంది.. ఎంతోమంది కూలిపోయారు.. మీరెంత...? మీ 151 మంది ఎమ్మెల్యేలెంత?-పవన్*అసెంబ్లీలో మార్షల్ తీరుపై మండిపడ్డ చంద్రబాబు

ఆర్టీసీ జేఏసీలో అంత‌ర్మ‌థ‌నం.. క‌లిచివేస్తున్న ఆత్మ‌హ‌త్య‌లు

15-11-201915-11-2019 08:32:38 IST
Updated On 15-11-2019 16:49:08 ISTUpdated On 15-11-20192019-11-15T03:02:38.245Z15-11-2019 2019-11-15T03:02:27.736Z - 2019-11-15T11:19:08.468Z - 15-11-2019

ఆర్టీసీ జేఏసీలో అంత‌ర్మ‌థ‌నం.. క‌లిచివేస్తున్న ఆత్మ‌హ‌త్య‌లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
41 రోజుల పాటు నిర్విరామంగా కొన‌సాగుతున్న ఆర్టీసీ కార్మికుల స‌మ్మె ఇంకా ఓ కొలిక్కి రావ‌డం లేదు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల‌పై ప్ర‌భుత్వం ఏ మాత్రం స్పందించ‌డం లేదు. బేష‌ర‌తుగా విధుల్లో చేరాల‌ని చెబుతున్న ప్ర‌భుత్వం చ‌ర్చ‌ల‌కు కూడా సానుకూలంగా లేదు. ఆర్టీసీ కార్మికుల స‌మ్మెకు ఎట్టి ప‌రిస్థితుల్లో త‌లొగ్గొద్ద‌ని కేసీఆర్ క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

మ‌రోవైపు ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆవేద‌న‌తో ఉన్నారు. రోజుకో కార్మికుడు ఆత్మ‌హ‌త్య‌తోనో, అనారోగ్యంతోనూ క‌న్నుమూస్తున్నారు. ఉద్యోగం ఉంటుందా ? ఉండ‌దా అనే ఆందోళ‌న‌తో, ఆర్థిక ఇబ్బందుల‌తో ఆర్టీసీ కార్మికులు కుమిలిపోతున్నారు.

ఎన్ని ఆందోళ‌న‌లు చేసినా ప్ర‌భుత్వం కొంచెం కూడా స్పందించ‌క‌పోవ‌డంతో తీవ్ర ఆవేద‌న‌తో ఉన్నారు. దీంతో ఆర్టీసీ జేఏసీ కూడా అంత‌ర్మ‌థ‌నంలో ప‌డింది.

ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే ఇంకా ఎంద‌రు కార్మికుల ప్రాణాలు కోల్పోవాల్సి వ‌స్తుందో అనే ఆందోళ‌న ఆర్టీసీ జేఏసీలో ఉంది. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు, పార్టీల మ‌ద్ద‌తు ఉన్నా ప్ర‌భుత్వం క‌ఠినంగా ఉండ‌టం, ఉక్కుపాదంతో ఉద్య‌మాన్ని అణిచివేసేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌టంతో నిస్స‌హాయ స్థితిలో జేఏసీ ప‌డిపోయింది.

కార్మికులు ఐక్య‌త, పోరాటప‌టిమ చూపుతున్నా ఆత్మ‌హ‌త్య‌లు, ప్ర‌భుత్వ క‌ఠిన వైఖ‌రితో పున‌రాలోచ‌న‌లో ప‌డ్డ‌ జేఏసీ నేత‌లు ఒక మెట్టు దిగాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు.

కీల‌క‌మైన‌, ప్ర‌థ‌మ డిమాండ్‌గా ఇన్ని రోజులుగా చెబుతున్న ప్ర‌భుత్వంలో ఆర్టీసీ విలీనం అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మిగ‌తా డిమాండ్ల‌పై చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించాల్సిందిగా ప్ర‌భుత్వాన్ని కోరారు.

ఇన్ని రోజులుగా ఈ డిమాండ్ చ‌ర్చ‌ల‌కు ప్ర‌ధాన అడ్డంకిగా ఉండేది. ఆర్టీసీ జేఏసీ కూడా ముందు విలీనం అంశాన్ని తేల్చాల‌ని ప‌ట్టుబ‌ట్టింది. 26 డిమాండ్ల‌లో ఇదే ప్ర‌థ‌మ డిమాండ్‌గా పెట్టింది.

ప్ర‌భుత్వం ఈ డిమాండ్‌ను క‌నీసం ప‌రిగ‌ణ‌నలోకి తీసుకునేందుకు కూడా సిద్ధంగా లేదు. దీంతో ఆర్టీసీ జేఏసీ - ప్ర‌భుత్వం మ‌ధ్య దూరం పెరిగిపోయింది.

ఈ ఒక్క డిమాండ్ మిన‌హా మిగ‌తావ‌న్నీ సాధార‌ణ‌, ప్ర‌భుత్వం వెన‌కోముందో తీర్చ‌గ‌లిగిన డిమాండ్ల‌నే ఆర్టీసీ జేఏసీ పెట్టింది. ఇప్ప‌టివ‌ర‌కైతే ఇక చ‌ర్చ‌ల్లేవ‌ని, సెల్ఫ్ డిస్మిస్ అంటూ చెబుతున్న ప్ర‌భుత్వం ఆర్టీసీ జేఏసీ తాజా ప్ర‌తిపాద‌న‌పై పున‌రాలోచిస్తుందో లేదో చూడాలి.

ఆర్టీసీ కార్మికుల ఆత్మహ‌త్య‌లు పెరిగిపోతున్నందున ఆవేద‌న‌తో ఆర్టీసీ జేఏసీ నేత‌లు ఒక మెట్టు దిగి విలీనం డిమాండ్‌ను ప‌క్క‌న‌పెట్ట‌డం స్వాగ‌తించ‌ద‌గ్గ ప‌రిణామంగా క‌నిపిస్తోంది.

ప్ర‌భుత్వం కూడా ఒక మెట్టు దిగి ఆర్టీసీ జేఏసీతో చ‌ర్చ‌లు జ‌రిపితే స‌మ్మెకు ఒక ప‌రిష్కారం దొరుకుతుంద‌ని, ఆర్టీసీ కార్మికుల ప్రాణాలు కాపాడ‌వ‌చ్చ‌నే అభిప్రాయాలు అన్ని వ‌ర్గాల నుంచి వ‌స్తున్నాయి.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle